- అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం
- మిగిలిపోయిన వాటికి మళ్లీ దరఖాస్తులు
అమరావతి(చైతన్యరథం); ఏపీ ప్రభుత్వం 2025-28 కాలాని కి బార్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం ఓపెన్ కేటగి రీలో 840 బార్లు, రిజర్వ్ కేటగిరీలో గీత కులాలకు 84 కేటా యించారు. వీటిని డ్రా ఆఫ్ లాట్స్ (లాటరీ) విధానం ద్వారా అభ్య ర్థులకు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు (డీపీ ఈవోఎస్) ఓపెన్ కేటగిరీకి ఈ నెల 18న, రిజర్వ్ కేటగిరీకి 20న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుల
స్వీకరణకు చివరి తేదీ 29-08- 2025గా నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ చివరి తేది నాటికి ఓపెన్ కేటగిరీలో మొత్తం 1698 దరఖాస్తులు, రిజర్వ్డ్ కేటగిరీలో 567 దరఖాస్తులు అందాయి. ఓపెన్ కేటగిరీకి చెందిన 388 బార్లకు 1,657 దరఖాస్తులు
వచ్చాయి. వీటికి డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించేందుకు అర్హత లభించింది. రిజర్వ్డ్ కేటగిరీ లోని 78 బార్లకు 564 దరఖాస్తులు వచ్చాయి. వీటికి కూడా డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించేందుకు అర్హత లభించింది. మొత్తం 466 బార్లకు శనివారం ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యం లో డ్రా తీసి లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికై న వారికి సమాచారం అందించారు..
గడువు పెంపు
అయితే ఓపెన్ కేటగిరీలో 37 బార్లకు, రిజర్వ్డ్ కేటగిరీలో 3 బార్లకు నాలుగు కన్నా తక్కువ దరఖాస్తులు వచ్చినందున వీటి దరఖాస్తుల గడువు సోమవారం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. వీటికి 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంట లకు లాటరీ ద్వారా కేటాయిస్తారు. దరఖాస్తులు రాని బార్లకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేస్తారు.
జిల్లాల వారీగా విక్రయించబడిన బార్ల విభజన కింది విధంగా ఉంది: