- మైనారిటీ యువత ఓటు హక్కు వినియోగించుకోవాలి
- టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్ మొహమ్మద్ నూర్
అమరావతి (చైతన్య రథం): ఉమ్మడి కృష్ణ -గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజాని అత్యధిక మెజారిటీతో గెలిపిద్దామని టీడీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి మహమ్మద్ నూర్ పిలుపునిచ్చారు. మైనారిటీ యువత అత్యధికగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఆలపాటి మంచి వ్యక్తి, విద్యావంతుడు, స్నేహశీలి అని, మొదటి ప్రాధాన్యత ఓటుతో ఆయనను గెలిపిద్దామన్నారు. జగన్ ప్రభుత్వంలో యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో, నారా లోకేష్ సారధ్యంలో ‘జాబ్ ఫస్ట్’ నినాదంతో యువతను ప్రోత్సహిస్తోన్న విషయం గుర్తెరగాలన్నార. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యతనిస్తూ.. ఏపీని అభివృద్ధిపథంవైపు తీసుకెళ్తున్న చంద్రబాబు సారథ్యంలోని కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని నూర్ పిలుపునిచ్చారు.