- సోదరీమణులకు మంత్రి లోకేష్ పిలుపు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో మహిళా సాధికారత ఎలా ఉందో ప్రపంచానికి చాటుదామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ దిగి చఖీRజుజుపబరుఱసవ్‌రూవశ్రీటఱవకి ట్యాగ్ చేస్తూ షేర్ చేయాలని మహిళలను కోరారు. సురక్షితంగా.. గౌరవంతో కూడిన ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మహిళకు కల్పిస్తోందని వెల్లడిరచారు. మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు టికెట్ అనేది నమ్మకానికి నిదర్శనం… స్వేచ్చకు, గౌరవానికి ప్రతీకగా పేర్కొన్నారు. ఇది కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు.. స్వాతంత్య్రం, సమానావకాశాలకు ప్రతిరూపం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలకు సాధికారత కల్పించడం గర్వంగా ఉందని ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.