అమరావతి (చైతన్య రథం): రాజ్యాంగ విలువలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘తోటి పౌరులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మనం భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును గుర్తుచేసుకుంటూ, దానిలో పొందుపర్చిన విలువలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన రాజ్యాంగ నిర్మాతలను, ముఖ్యంగా దాని ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను గౌరవిస్తున్నాము. వారి దార్శనిక నాయకత్వంలో, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావంతో మన ప్రజాస్వామ్యానికి పునాది వేసింది. స్వర్ణ ఆంధ్ర మరియు విక్షిత భారత్ నిర్మాణానికి మనం కృషి చేస్తున్నప్పుడు, మన రాజ్యాంగ సూత్రాలు మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.











