- పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
- గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
- అచ్యుతాపురంలో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన
అనకాపల్లి(చైతన్యరథం): దేశ అభివృద్ధిలో పారిశ్రామిక రం గం అత్యంత కీలకం..వన్ ఫ్యామిలీ.. వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సాకారం చేద్దామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు నిచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఎంఎస్‌ఎంఈ పార్కుకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఒకప్పుడు ఇంటి కో ఐటీ ఉద్యోగి ఉండాలని మన ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అప్పుడు ఐటీ రంగంలో అడుగు పెట్టిన వారు నేడు ప్రపంచ వ్యాప్తంగా కీలక పదవుల్లో ఉన్నారు. నేడు ఇంటికో పారిశ్రా మికవేత్త నినాదం ఇచ్చారు.. దాన్ని అందిపుచ్చుకోవాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నినా దం ద్వారా రాష్ట్రాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మారుద్దామని పిలుపునిచ్చారు. కనిగిరి నుంచి సుమారు 87 పరిశ్రమల స్థాప నకు ముఖ్య మంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టడం అభినంద నీయమన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. అందుకు నేటి కార్యక్రమం ప్రత్యక్ష నిదర్శనం. గూగుల్ లాంటి ప్రఖ్యాతా కంపెనీ ఏపీలో అడుగు పెట్టడం అంత సులువుగా జరగ లేదని, ఆ ఒప్పందం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ కష్టం ఎంతో ఉంది. సుమారు రూ.1.35 వేల కోట్ల పెట్టుబడి రావడం అంటే ఎంత కష్టపడితే ఒప్పందం జరిగిందో యువత ఆలోచించుకోవాలి. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ అన్నాం.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఒప్పందాలను పర్యవేక్షిస్తున్నాం.
గత ఐదేళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడా నికి పారిశ్రామికవేత్తలు భయపడాల్సి వచ్చింది. 2014-19 మధ్య 15 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఒప్పందాలు జరిగితే.. తర్వాత వచ్చిన జగన్ రెడ్డి అన్ని ఒప్పందాలను నాశనం చేశాడు. విశాఖ కేంద్రంగా సద స్సులు నిర్వహించి పెట్టుబడులు ఆకర్షిస్తే.. జగన్‌రెడ్డి తరిమేశాడు. అదానీ డేటా సెంటర్, అమర రాజా బ్యాటరీస్, లులూ లాంటి కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు. గత ఐదేళ్లలో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశారు. ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కోడి, గుడ్డు అంటూ కథలు చెప్పాడు. చదువుకున్న ప్రతిఒక్కరికి ఉపాధి కల్పించడం ద్వారా మాత్రమే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుంది. కలలు కనాలి వాటిని సాకారం కోసం శ్రమించాలని అబ్దుల్ కలాం చెప్పిన మాటను తప్పకుండా అమలు చేస్తున్నాం. గత ఐదేళ్లు పరిశ్రమలు లేక, ఉద్యోగాలు లేక అద్వాన్నమైన పాలన కారణంగా యువత గంజాయి డ్రగ్స్‌కి అలవాటు పడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం. ఉత్తరాంధ్రకు అత్యంత కీలకంగా నిలిచే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11 వేల కోట్ల ఆర్థిక సాయం తీసుకొచ్చాం. రాష్ట్రంలో సుమారు 900కి. మీల తీర ప్రాంతం ఉంది. పోర్టులున్నాయి. పోర్టు ఆధారిత పరిశ్రమల రాకతో మరింత అభివృద్ధికి అవకాశం ఉంది. ఏటీసీ టైర్ గ్రూప్ 700 కోట్ల పెట్టుబడితో 300 మందికి ఉపాధి కల్పిస్తోంది.
లారస్ లాబ్స్ రూ.706 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎస్‌ఎం సీ కార్పొరేషన్ రూ.80 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి కల్పిస్తోంది. బయో ఫోర్ ఇండియా ఫార్మా రూ.150 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి కల్పిస్తోంది. బాలాజీ ఆక్షన్ బిల్డ్ వెల్ రూ.1175 కోట్ల పెట్టుబడితో సుమారు 1000 మందికి ఉపాధి కల్పిస్తోంది. లారస్ బయో రూ.573 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉపాధి కల్పిస్తోంది. స్టైరాక్స్ లైఫ్ సెన్సెస్ రూ.88 కోట్ల పెట్టుబడితో 100 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. లారస్ లాబ్స్ యూనిట్ 7 రూ.200 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి కల్పిస్తోంది. లారస్ సింథసిస్ రూ.250 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉపాధి కల్పిస్తోంది. మరోవైపు రవాణా మార్గాలు కూడా పుష్కలంగా అభివృద్ధి చెందుతున్నాయి. కనెక్టివిటీ పెరగడం ద్వారా పరిశ్రమల రాకకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. పెట్టుబడితో వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. పరిశ్రమలకు అనుగుణంగా ఇప్పటికే అనేక పాలసీలు తీసుకొచ్చాం. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనలు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.












