- వారం రోజుల్లో సమగ్ర నివేదిక రూపొందిస్తాం
- ప్రభుత్వ ఆమోదం మేరకు తుది నిర్ణయం
- వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
- సన్నబియ్యం, వరి ఎగుమతి రకాలపై సమీక్ష
అమరావతి(చైతన్యరథం): సన్నబియ్యం ఎగుమతులకు సంబంధించి రకాలపై వారంరోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించి కమిటీలో అంతర్గతంగా చర్చించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం మేరకు తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం మంత్రి అధ్యక్షతన సన్నబి య్యం, ఎగుమతి వరి రకాలపై సమీక్ష జరిగింది. వ్యవసాయశాఖ కమిషనం, ఎక్స్ అఫిషి యో సెక్రటరీ సి.సౌరభ్‌గౌర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢల్లీి రావు, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ మనజీర్ జిలాని, ఏఎన్‌జీఆర్‌ఏయూ పరిశోధనా సంచాలకులు పి.వి.సత్యనారాయణ, రైతులు, వ్యవసాయాధికారులు, వివిధ జిల్లాల నుంచి బియ్యం ఎగుమతిదారులు, రైస్ మిల్లర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎగుమతిదారులు మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి 30 లక్షల టన్నుల ఎగుమతి రకాలకు అవకాశం ఉందని తెలిపారు. ఐఆర్`64, ఎంటీయూ`1010, ఎంటీయూ`1273, ఎంటీయూ `1293, ఎంటీయూ`1156ల గింజ పొడవు ఆరు మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ ఉంటే ఆ రకాలు ఎగుమతులకు అనుకూలమైనవిగా వివరించా రు.
ఈ రకాలు రాష్ట్రంలో 25 వేల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయని, దీనిని ఆరు లక్షల హెక్టార్లకు మించి పెం చాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై వారంరోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించి కమిటీలో అంతర్గతంగా చర్చించి తుది నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపడం జరుగుతుందని మంత్రి సమాధానమిచ్చారు. వ్యవసాయ డైరెక్టర్ ఎన్.ఢల్లీిరావు ఖరీఫ్ పంట కాలంలో వివిధ వ్యవసాయ మండలాల్లో సాగవుతున్న వరి రకాలు, వాటి విస్తీర్ణం, ఉత్పత్తులు, రబీ పంట కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సాగు చేసిన వరి రకాలు, వాటి విస్తీర్ణం, సాధించిన దిగుబడి గురించి వివరించారు. ఖరీఫ్‌లో సన్న రకాలతో పాటు, ఎంటీయూ-7029, ఎంటీయూ-1318, ఎంటీయూ-1121, ఎంటీ యూ-1061, ఎంటీయూ-1064, ఎంటీయూ-1262, పీఎల్‌ఏ-1100, ఎంటీయూ-1224 వంటి రకాలు ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే రబీ పంట కాలంలో సన్న రకాలతో పాటు ఎంటీయూ-1121, ఎంటీయూ-1156, ఎంటీయూ-1153, ఎంటీయూ-1262, ఎంటీయూ-1271, ఎంటీయూ-1224, ఎంటీయూ-7029 వంటి రకాలను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేయడం జరుగు తుందని చెప్పారు.
ఖరీఫ్‌లో ఎంటీయూ-1121, ఎంటీయూ-1061, ఎంటీయూ-1064, పీఆర్-126, రబీలో ఎంటీయూ-1121, పీఆర్-126, ఎంటీయూ-1153 రకాల విస్తీర్ణం తగ్గించాలని, ధాన్యం సేకరణను నిలిపివేయాలని సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకుంది. పై రకాలకు ప్రత్యామ్నాయ వరి రకాలను సూచించాలని ఏఎన్‌జీ ఆర్‌ఏయూకు తెలిపారు. ఆ రకాలకు విత్తనాల సరఫరా, ధాన్యం సేకరణ చేయాలని ఆయా శాఖలకు వివరించారు. సన్న వరి రకాలైన బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, బీపీటీ-3291, ఎంటీయూ-1224, ఆర్‌జీఎల్-2537, ఎన్‌ఎల్‌ఆర్-34449, ఎన్‌డీఎల్‌ఆర్-7, పీఎల్‌ఏ-1100, జేజీఎల్-384, హెచ్‌ఎంటీ, జైశ్రీరామ్, సాధన సన్న వరి రకాలను సాగు చేయాలని కమిటీ రాష్ట్ర రైతాంగానికి సూచించింది.