- బాబు గెలుపుతోనే మత్స్యరంగం క్షేమం
- ప్రజా ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యం
- వైసీపీని ఓడిరచడమే మనందరి లక్ష్యం
- మహిళల కోసం చంద్రబాబు వరాలు
- గంగపుత్రులతో మాటామంతీలో భువనమ్మ
మచిలీపట్నం (చైతన్య రథం): మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ వృద్ధికి పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నారా భువనేశ్వరి పిలుపు నిచ్చారు. తెలుగుదేశం హయాంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తే.. వైసీపీ సర్కారు హయాం లో ఆ రంగాన్ని నిర్వీర్యం చేశారని భువన్వేశ్వరి విమ ర్శించారు. దుర్మార్గపు వైసీపీని వేటాడాలని, చంద్ర బాబు కృషితోనే రాష్ట్రంలోని మత్స్యరంగానికి పూర్వ వైభవం రాగలదన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించా రు. ‘నిజం గెలవాలి’ పర్యటనలో భాగంగా శుక్రవారం మచిలీపట్నం నియోజకవర్గం కోన గ్రామంలో పార్టీ శ్రేణులను భువనమ్మ కలిశారు. తెలుగుదేశంపార్టీ ఆవి ర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహా నికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భం గా గంగపుత్రుల కుటుంబాలతో నిర్వహించిన మాటా మంతీ కార్యక్రమానికి మాజీమంత్రి కొల్లురవీంద్ర అధ్య క్షత వహించగా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం పరిచయ బాధ్యతలు నిర్వర్తించారు.
కార్యక్రమంలో భువనమ్మ మాట్లాడుతూ `‘చంద్రన్న మీద మీకున్న ప్రేమ, అభిమానం కళ్లారా చూశాను. నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన కష్టసమయంలో ఓ కుటుంబంలా పార్టీ శ్రేణులు నాకు తోడుండటాన్ని జీవితంలో మర్చిపోలేను. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, కూతురిగా, మీలో ఒకరిగా వచ్చానేగానీ, రాజకీయాలు మాట్లాడటానికి కాదు. ఇక్కడున్నవాళ్లలో తమ కోసం, పిల్లలకోసం రేయింబవళ్లు కష్టపడే మహిళలే అధికం. కుటుంబం కడుపు నిండా తినడానికి రోజంతా పనిచేసే మహిళా శక్తితో మాట్లాడుతుండటం చాలా ఆనందంగా ఉంది. మచిలీపట్నం చాలా విషయాలకు ప్రసిద్థి అయి నా.. ఫిష్ పోర్టు టౌన్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గుజరాత్ తరువాత ఆంధ్రకే 975కిలో మీటర్ల తీర ప్రాంతం ఉంది. దేశంలోనే చేపల ఉత్పత్తిలో ఆంధ్రది ప్రథమస్థానం.మత్స్యకారుల వృత్తి కష్టానికి చంద్రబాబు సహకారం తోడైంది కనుక`2014-19 మధ్య మత్స్య రంగంలో ఏటా 19.17లక్షల టన్నుల ఉత్పత్తి సాధిం చాం.
దురదృష్టవశాత్తూ వైసీపీ సర్కారు హయాంలో మత్స్యరంగం పూర్తిగా నిర్వీర్యమైంది. ఈ రంగంలో రాష్ట్రం పూర్వవైభవం సాధించాలంటే ప్రజా ప్రభుత్వం రావాలి. చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అన్నారు. చేప ఆరోగ్యానికి మంచి దంటూ, ఇందులో ఒమేగా 3, ప్రోటీన్, విటమిన్ డివం టి అనేక పోషకాలు లభిస్తాయని భువనమ్మ గుర్తుచేశా రు.‘ప్రజలకష్టాన్ని గుర్తించి,అందుకు తగినఫలితం అం దించే మద్దతు ప్రభుత్వం నుంచి ఉండాలి. కానీ, గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో అటువంటి ప్రభుత్వం లేకపోవ టం దురదృష్టం. టీడీపీ హయాంలో మత్స్య రంగంలో ఏటా 19.17లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తే, వైసీపీ హయాంలో అది 6.44లక్షల టన్నులకు పడి పోయిం ది. అయినా ధైర్యం కోల్పోవద్దు. మత్స్యసంపద పెంచు కుని, మత్స్యకారుల సంక్షేమాన్ని ప్రజా ప్రభుత్వం గెలు పుతో సాధిద్దామని భువనమ్మ పిలుపు నిచ్చారు.
టీడీపీ చేసిన అభివృద్ధి పనులు
2014లో చంద్రబాబు సీఎం అయ్యేనాటకి ఏపీలో చేపల ఉత్పత్తి 19.78 లక్షల టన్నులుంటే, 2018-19 నాటికీ ఉత్పత్తిని 39.91లక్షల టన్నులకు పెంచగలి గారని భువనమ్మ వివరించారు. మత్స్య సంపద వృద్ధికి టీడీపీ ఏటా సగటున రూ.235 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్సార్‌సీపీ కేవలం రూ.59 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మత్స్యరంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. కొత్తవల లు, ఐస్‌బాక్స్‌లు కొన్నప్పుడు,బోట్ యాంత్రీకరణ చేయి ంచినప్పుడు టీడీపీ ప్రభుత్వం70-90 శాతం సబ్సిడీ ఇచ్చిందని,మత్స్యకారులకోసం ఫైబర్‌బోటుపై రూ.2.5 లక్షల సబ్సిడీ కల్పిస్తూ.. 300ఫైబర్ బోట్లను అందిం చిందని గుర్తు చేశారు. మెకనైజ్డ్ మరియు మోటారుబోట్ల సరఫరాకు రూ.2 లక్షలు లేదా 75 శాతం సబ్సిడీ ఇచ్చారని, డీజిల్‌పై రూ.6.09 సబ్సిడీ ఇవ్వడం, మోటార్లకు ఉపయోగించే నూనెపై సేల్స్ ట్యాక్స్ తొలగించడంలాంటి చర్యలతో మత్స్యరంగ అభివృద్ధికి చంద్రబాబు ఇతోధిక సహకారం అందించారని గుర్తు చేశారు. 8 జిల్లాల్లోని 9 రిజర్వాయర్లలో 9 కేజ్ కల్చర్ యూనిట్లను ప్రవేశపెట్టి చేపల ఉత్పత్తిని టీడీపీ ప్రభుత్వం పెంచిందన్నారు.
‘సముద్రంలో చేపల వేట ప్రమాదకరమైన వృత్తి. ఆ సమయంలో మరణం లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే మత్స్యకార కుటుంబాలు దెబ్బతినకుండా టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా కింద రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారన్నారు. మత్స్యకారుల పింఛన్‌ను నెలకు రూ.1000నుండి రూ.2000కి పెంచారన్నారు. చేపల వేట నిషేధ కాలంలో ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.2000 నుండి రూ.4000 పెంచారని గుర్తుచేశారు. భీమవరంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పా టుకు టీడీపీనే శ్రీకారం చుట్టిందని, అలాగే మత్స్యకా రుల పిల్లల కోసం ప్రత్యేకంగా శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 6 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించిందీ చంద్రబాబేనన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక…
వైసీపీ సర్కారు జీవో నంబర్ 217ను ప్రవేశపెట్టి వేలాది చెరువులు, రిజర్వాయర్లు, సాగునీటి కాల్వలను వేలం వేసి మత్స్యకారుల జీవనోపాధిని కొల్లగొట్టిందని భువమన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. మచిలీపట్నం పోర్టు ను టీడీపీ ప్రభుత్వం ప్రారంభిస్తే, రివర్స్ టెండరింగ్‌తో నిర్మాణ ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం నత్తనడకన సాగిస్తోందన్నారు. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్‌తో 39 వేల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరు తుందని, కాని వైసీపీ సర్కారు ఆ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను జగన్ రద్దుచేసి `మత్స్యకార నేస్తంపేరిట కేవలం రూ.10,000 ఆర్థిక సాయతో చేతులు దులుపుకున్నాడని విమర్శించారు. ఈ సొమ్ముతో వలలు, అవసరమైన కొత్త యంత్రాలు కొనటం సాధ్యమా? అని ప్రశ్నించారు. వేట సమయం లో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తానని జగన్ దగా చేశా డని గుర్తు చేశారు. జగన్ తన అసమర్థ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలను నిర్వీర్యం చేశాడని, ధరలు, ఛార్జీలు పెరగడంతో ఐదేళ్లుగా మహిళలు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసునని భువనమ్మ అన్నారు.
వైసీపీ పాలనలో గంజాయి, ఇసుక మాఫియా, డ్రగ్స్, కల్తీమద్యం, హత్యలు, అత్యాచారాల్లో రాష్ట్రం అగ్రస్థానా నికి చేరుకుని పరువు పోగొట్టుకుందన్నారు. వైసీపీ నేతలు తమ పబ్బం గడుపుకునేందుకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడారని తీవ్రస్వరంతో దుయ్య బట్టారు. రోజుకొక గ్యాంగ్‌రేప్, అత్యాచారం వార్తలు చూస్తుంటే గుండె కలిచివేస్తోందని, ఆడపిల్లలకి రక్షణ లేని రాష్ట్రంలో భయంభయంగా బతకాల్సిరావడం దుర దృష్టమన్నారు.రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ మెరుగైన జీవితం గడిపే హక్కుంది. ఐదేళ్ళ పాలనలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం, కష్టనష్టాలు అనుభవించాం. ఈ పరిస్థితి మారుతుందనే ఆశ, నమ్మకం ఉంది. ఆరాచక పాలనకి ముగింపు పలికే అవకాశమొచ్చింది. మన జీవితాలను, మన రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలిగే వారినే గెలిపించు కుందాం అని భువనమ్మ పిలుపునిచ్చారు.
మెరుగైన జీవితం గడిపేందుకు అర్హులమా? కాదా?.మన రాష్ట్రానికి అభివృద్ధి చెందే అర్హత ఉందా? లేదా?. మీకు అభివృద్ధి కావాలా? వద్దా?. మహిళలకి భద్రత కావాలా? వద్దా?. యువతకు ఉద్యోగాలు కావా లా? వద్దా?. మన రైతులు సంతోషంగా ఉండాలా? లేదా?.
మన రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా మారాలా? వద్దా? అని ప్రశ్నలతో మత్స్యకారులను చైతన్యపరు స్తూనే.. మీ ఓటుతో అన్నీ సాధించుకోవచ్చని భువనమ్మ సూచించారు. చంద్ర బాబు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ అందుతాయంటూ, బాగా ఆలోచించి ఓటు వినియోగించాలని సూచిం చారు. చంద్రబాబు పార్టీ, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తారని, ఆయన చివరి నిమిషం వరకు ప్రజల కోసమే ఉంటారన్నారు. ఇలాంటి నాయకుడు మీకు మరో వ్యక్తి దొరకరు. ఆయన జైలులో ఉండగా ఆరోగ్యం దెబ్బతిన్నా 10రోజులు కూడా ఇంట్లో కూర్చోవడానికి ఒప్పుకోలేదని భువనమ్మ గుర్తు చేశారు.
మహిళల కోసం చంద్రబాబు వరాలు
18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు ఆడబిడ్డ నిధికింద రూ.1,500 ఇచ్చి అండగా ఉంటారు. స్కూల్‌కి వెళ్ళే ప్రతివిద్యార్థికి ఏడాదికి రూ.15,000 ఇస్తారు.ముగ్గురు పిల్లలుంటే రూ.45,000 ఇస్తారు. ప్రతి ఇంటికి దీపం పథకం కింద ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తారు. ఇవి కేవలం మ్యానిఫెస్టో హామీలు కాదు, మహిళా సాధికారత పెంచే సాధనాలు.
మహిళలకి మేమిచ్చే గౌరవానికి ప్రతీకలు. ఈ రోజు మీ అందరికీ నేను ఒకటే చెప్పాల నుకుంటు న్నాను. మన సమస్యలు దూరమవ్వటానికి ఇంకా 45 రోజులే ఉంది. మే 13న మీ కోసం, కుటుంబం కోసం, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఓటు వేయండి. ‘‘సైకిల్‌కు ఓటు వేద్దామని’’ ప్రతిజ్ఞ చేద్దాం. మీరు సిద్ధమేనా? అంటూ భువనమ్మ మాట తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న పెద్ద ఆస్తి కార్యకర్తలేనని, పార్టీని ముందుకు నడిపేది, భవిష్యత్తులో ముందుకు నడిపించేది లక్షలాది పార్టీ కార్యకర్తలే అన్నారు. పార్టీ కార్యకర్తలంతా రానున్న ఎన్నికల్లో సైకిల్‌పై స్పీడుగా ముందుకు దూసుకెళ్లాలని, అడ్డొచ్చిన వాడు ఎవరినైనా సరే గుద్దుకుంటూ ముందుకెళ్లి ఎన్నికల కురుక్షేత్రంలో పసుపుజెండాను ఎగరేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.