అమరావతి (చైతన్యరథం): క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ జాతీయ వర్క్ షాప్‌లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులకు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో, అమరావతిని క్వాంటం టెక్నాలజీలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం ఆవిష్కరణల్లో ముందంజలో ఉంచేందుకు ఈ సమావేశం గొప్ప ముందడుగా అభివర్ణించారు. అందరం కలిసి కట్టుగా భవిష్యత్తును రూపొందిద్దామని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.