- రేపు తయారీ పరిశ్రమకు శంకుస్థాపన
- చర్మకారులకు జీవనోపాధికి ప్రభుత్వం చర్యలు
- లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి పిల్లి మాణిక్యరావు
మంగళగిరి(చైతన్యరథం): ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం యడవల్లిలో 25 ఎకరాల లిడ్‌క్యాప్ స్థలంలో లెదర్ ఉత్పత్తుల తయారీ కేంద్రానికి ఫిబ్రవరి 1న శనివారం శంకుస్థాపన చేయనున్నట్లు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ.6 కోట్లు కేటాయించి ఆ ప్రాంత చర్మకారులకు జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరిం చారు. రాష్ట్రంలో చర్మ పారిశ్రామికాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అనేకరం గాల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చినట్లే.. చర్మ పారిశ్రామికాభివృద్ధికి కూడా త్వరలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రానున్నారని వెల్లడిరచారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడి న చర్మశుద్ది కేంద్రాలు, లెదర్ గూడ్స్ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు లిడ్‌క్యాప్ కోసం మినీ, మీడి యం, మెగాపార్కుల నిర్మాణం కోసం స్థలాలను కేటాయిస్తే.. జగన్ వాటిని తన స్వార్థాని కి వాడుకున్నాడు. జగన్ అన్యాక్రాంతం చేసిన లిడ్‌క్యాప్ భూములు ఆ సంస్థకే చెందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చర్మకా రుల జీవితాలు బాగుపడాలని చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకుని వారి కోసం అనేక పథకాలు తీసుకొచ్చి వారి గౌరవాన్ని పెంచారు. చర్మకారులను పారిశ్రామికంగా ఎదిగేలా చేశారు. రాష్ట్రం విడిపోయాక కూడా ఈ లిడ్‌క్యాప్‌కు నిధులు కేటాయించి ఎంతో అభివృ ద్ధి చేశారని గుర్తుచేశారు.
రోడ్ల పక్కన చెప్పులు కుట్టే వారికి అనేక సదుపాయాలు కల్పించడంతో పాటు వారికి రుణాలు అందించేలా చర్యలు చేపట్టడంతో వారు ఎంతో అభివృద్ధిలోకి వచ్చారని కొనియాడారు. లెదర్ ఇండస్ట్రీస్‌ని తెచ్చి రాష్ట్రానికి రెవె న్యూ వచ్చేలా చేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో లిడ్‌క్యాప్‌కు సంబంధించిన చర్మ పరిశ్రమ ఒక్కటి మాత్రమే ఉంది. అది కూడా ప్రైవేటు వ్యక్తుల చేతు ల్లో తడలో వరదాయపాలెం అనే ఊరిలో దాదాపు వంద ఎకరాల స్థలంలో అవంతి ట్రేడ ర్స్ అని ఉంది. ఇందులో ఒక శాతం మాత్రమే లిడ్‌క్యాప్‌కు వాటా ఉంది. ఇలాంటి పరిశ్రమలు రాష్ట్రంలో ప్రభుత్వం తరపున నెలకొల్పాల్సిన అవసరముందని తెలిపారు. చర్మాలు, గొర్రెలు, మేకల చర్మాల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న మనం ఈ చర్మాలను చెన్నైకు తీసుకెళ్లి అక్కడ ప్రాసెసింగ్ చేసి ఎక్స్‌పోర్టు చేస్తున్నారు. ఆ ప్రాసెసింగ్ యూనిట్ల ను మన రాష్ట్రంలోనే పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పక్క రాష్ట్రానికి తీసుకెళ్లడం వల్ల చర్మాలను అమ్ముకుని జీవనం సాగించుకునే వారికి అన్యాయం జరుగుతుందని..వారికి జీవనోపాధి కల్పిస్తామని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రానికి రెవెన్యూ కూడా సమకూరి ఉద్యోగావకాశాలు కలుగుతాయని తెలిపారు. లెదర్ ఇండస్ట్రీస్ ద్వారా యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని, రాష్ట్రంలో లెదర్ పరిశ్రమను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.