- మైనార్టీల అభ్యున్నతికి కూటమి కంకణం
- ఇమామ్, మౌజమ్‌లకు సర్కారు శుభవార్త
- ఆర్నెల్ల గౌరవ వేతనంగా రూ.45 కోట్లు విడుదల
- బడ్జెట్‌లో ముస్లింలకు రూ.4,376 కోట్లు కేటాయింపు
- ఐదేళ్లపాటు ముస్లింలను దగాచేసిన జగన్‌రెడ్డి
- వైసీపీ హయాంలో ఆవిరైన ముస్లిం సంక్షేమం..
రాష్ట్రంలో ఉన్నది ముస్లిం మైనార్టీల సంక్షేమం కోరే ప్రభుత్వమని మరోసారి నిరూపితమైంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ముస్లిం మైనార్టీల కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా ఇమామ్ మౌజమ్‌లకు గౌరవ వేతనం ఆరు నెలల బకాయిలు విడుదల చేసింది. విడుదల చేసిన రూ.45 కోట్ల నిధులు.. ఏప్రిల్ నుంచి పెట్టిన బకాయిలు ఇమామ్ మౌజమ్‌లకు అందుతాయి. ఎన్నికలవేళ మైనార్టీలకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలకు అండగా నిలుస్తూ వస్తున్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలపట్ల జగన్‌రెడ్డి చూపించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో అనేకమంది ముస్లింలపై దాడులు జరిగినా, 8 మందిని హత్య చేసినా ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. అటు పాదయాత్రలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా.. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశాడు. ఐదేళ్ల బడ్జెట్‌లో కూడా ముస్లిం మైనార్టీలకు అరకొర నిధులు కేటాయించి ఖర్చు చేయకుండా వదిలేశాడు. షాదీఖానాలు, ఇతర మైనార్టీ కమ్యూనిటీ భవనాలను గత టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించి నిర్మించింది. వాటికి చిన్న చిన్న మరమ్మతులు కూడా ఐదేళ్లపాటు చేయకుండా జగన్‌రెడ్డి కాలయాపన చేశారు. ఇలా ప్రతి విషయంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధిని అడ్డుకున్నాడు. ఇమామ్ మౌజమ్‌లకు ఇస్తామన్న గౌవర వేతనం ఇవ్వకుండా నిలిపివేశాడు. ముస్లిం మైనార్టీల సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించాడు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలవేళ ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తోంది. జగన్‌రెడ్డి పెట్టిపోయిన రూ.45 కోట్లు బకాయిలు విడుదల చేసింది. ఇమామ్, మౌజమ్‌లకు ఏప్రిల్ నుంచి ఆరు నెలల గౌరవ వేతనం అందనుంది.
2014 -2019 ఐదేళ్ల కాలంలో మైనార్టీలకు సంక్షేమం పండుగ:
రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మైనార్టీల కోసం అనేక పథకాలను తీసుకొచ్చింది. విజయవాడలో ఏపీ స్టేట్ హజ్ హౌస్ నిర్మాణానికి రూ.23 కోట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరయ్యింది. అలాగే కడపలో రూ.13 కోట్ల రూపాయులతో ఏపీ స్టేట్ హజ్ హౌస్ నిర్మాణం జరుగుతుంది. మైనార్టీ సంక్షేమ నిధులు మైనార్టీలకే ఖర్చు చేశారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.325 కోట్లతో 49,682 మందికి ఆర్ధిక సాయం అందజేశారు. విదేశీ విద్యకు రూ.10 లక్షలు ఇచ్చి… 527 మందిని విదేశాలకు పంపించారు. దుల్హన్ పథకం కింద 30వేలమందికి ఒక్కొక్కరికి రూ.50వేలు అందజేశారు. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా రూ.20.25 కోట్లు ఖర్చు చేసింది. ఐదేళ్లపాటు పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేసింది. మసీదుల మరమ్మతులకు ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.2.5 కోట్లు ఖర్చు చేసింది. షాదీఖానాలకు రూ.50 కోట్లు వెచ్చించింది. విజయవాడ, కడపలో హజ్ హౌస్‌ల నిర్మాణం, కర్నూలులో ఉర్ధూ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. దూదేకుల ఫెడరేషన్‌కు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. ఇలా అడుగడుగునా ముస్లింల అభివృద్ధికి చంద్రన్న ప్రభుత్వం పాటుపడిరది.
జగన్‌రెడ్డి కాలంలో మైనార్టీలకు అడుగడుగునా మోసం:
ఇచ్చిన మాట నిలబెట్టుకునే స్వభావం చంద్రబాబుది అయితే… మాటిచ్చి మడమతిప్పి ద్రోహం చేయడం జగన్ నైజం. జగన్‌రెడ్డి ఐదేళ్లపాటు మైనార్టీలను దోకా చేశారు. ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకపోగా.. 2014- 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అనేక పథకాలను రద్దు చేసి ముస్లిం మైనార్టీలకు తీరని ద్రోహం చేశారు. మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483.62 కోట్లు దారి మళ్లించాడు. మైనార్టీ ఫైనాన్స్ కొర్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. ఐదేళ్ల కాలంలో ఒక్కరికీ రుణాలివ్వలేదు. ముస్లింలను విదేశీ విద్యకు దూరం చేశాడు. దూదేకుల ఫెడరేషన్‌కు ఐదేళ్ల కాలంలో కేవలం రూ.1.4 కోట్ల నిధులు మాత్రమే వెచ్చించారు. విజయవాడలో ఏపీ స్టేట్ హజ్ హౌస్ నిర్మాణానికి రూ.23 కోట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైంది. అలాగే కడపలో రూ.13 కోట్ల రూపాయలతో ఏపీ స్టేట్ హజ్ హౌస్ నిర్మాణం జరుగుతుంది. ఈ రెండిరటి నిర్మాణాలకు 2019 `2024 మధ్యకాలంలో నిధులు కేటాయించకపోగా.. ఉన్నవాటిని జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశాడు. వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల ఎకరాలకు సంబంధించిన వక్ఫ్ భూముల్లో 32 వేల ఎకరాలు కబ్జాకు గురైనా.. జగన్‌రెడ్డి పట్టించుకోలేదు. దుల్హన్ పథకం కింద పెళ్లి కానుకలను రూ.లక్షకు పెంచుతానని ప్రకటించిన జగన్‌రెడ్డి… రెండేళ్లల్లో ఒక్కరంటే ఒక్కరికీ ఇవ్వలేదు. హజ్ యాత్రకు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపేశారు. మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించి… అన్ని రంగాల్లో మైనార్టీల అభివృద్ధికి జగన్‌రెడ్డి అడ్డుపడ్డాడు.
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.4,376 కోట్ల నిధులు:
ఇప్పుడు `కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల సంక్షేమంపై దృష్టిపెట్టింది. 2024 `2025 ఆర్థిక బడ్జెట్‌లో రూ.4,376 కోట్ల నిధులు కేటాయించి… మైనార్టీలకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అలాగే మైనారిటీ యువత జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనారిటీ ఆర్థిక సహకార సంస్థకు రూ.173 కోట్లు ప్రతిపాదించింది. ఇందుకు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమానికి రూ.208 కోట్లు ఇవ్వనుంది. అలాగే ఉర్దూ అకాడమీకి రూ.5.3 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. షాదీ ఖానా, కమ్యూనిటీ నిర్మాణానికి రూ.2.90 కోట్లు నిధులు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో మరిన్ని మైనార్టీ పథకాల అమలుకు మరో రూ.104 కోట్లు ఖర్చు చేయబోతోంది. నేషనల్ మైనార్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద రూ.300 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది. మైనార్టీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రధాన మంత్రి జన వికాస్‌కు రూ.26.13 కోట్లు మ్యాచింగ్ గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ స్కీమ్‌కు చంద్రన్న ప్రభుత్వం రూ.8.86 కోట్లు కేటాయించింది. అసంపూర్తిగా ఉన్న షాదీ ఖానాలు, మైనార్టీ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. ఇలా అన్ని విధాలుగా ముస్లిం మైనార్టీలను అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ప్రవీణ్ బోయ,
అనలిస్ట్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్