- ప్రస్తుతం మండలానికో గ్రామంలో ప్రాజెక్ట్
- గత ప్రభుత్వంలో తప్పులతడక, ప్రచార ఆర్భాటం
- వాటిని సరిదిద్దేందుకు సకాలంలో చర్యలు
- 6688 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాం
- 2.79 లక్షల ఫిర్యాదుల్లో 90 శాతం పరిష్కారం
- అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో తప్పుల తడకగా సాగిన భూముల రీ సర్వేను సరిదిద్దుతున్నామని, తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిన రీ సర్వేలో ఎలాంటి తప్పులకు అస్కారం లేకుండా చాలా పకడ్బందీగా కొనసాగిస్తున్నామని రెవెన్యూ, రిజి స్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎలాంటి హడావిడి లేకుండా భూయజమానులను ఒప్పించి ప్రతిష్టాత్మకంగా రీ సర్వే ప్రాజెక్ట్‌ను మూడేళ్ల సమయంలో పూర్తి చేస్తామని చెప్పారు. జనవరి 20న తమ ప్రభుత్వం భూముల రీ సర్వేను తిరిగి ప్రారంభించిందని, అయితే ఈసారి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్‌గా తీసుకుని రీ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామాన్ని బ్లాకులుగా విభజించి, ప్రతి బ్లాక్‌కు అధికారులను కేటాయించి రోజుకు 20 ఎకరాల మేరకే రీ సర్వే చేయిస్తున్నామని చెప్పారు. రీ సర్వే చేసే ముందు ఆ భూమికి సరిహద్దులో ఉన్న భూ యజమానులందరికీ నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే రీ సర్వే చేస్తున్నారని చెప్పారు. ఒక బ్లాక్‌లో ఉన్న భూ యజమానులందరికీ వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి అందరికీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నామని చెప్పారు.
అసెంబ్లీలో మంగళవారం ప్రశోత్తరాల సమయంలో భాగంగా రీ సర్వే అంశంపై టీడీపీ సభ్యులు ప్రత్తిపాటి పుల్లారా వు, కూన రవికుమార్, బోనెల విజయచంద్ర, రాజగోపాల్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ కాలంలో 6688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశారని, కానీ ఆ రీ సర్వే అంతా తప్పుల తడకగా మారిందన్నారు. రీ సర్వేకు సంబంధించి భూ యజమానులకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, రీ సర్వే పూర్తయిన తర్వాత భూ యాజమానులు అభ్యంతరాలు తెలిపేందుకు 60 రోజులగా ఉన్న గడువును 21 రోజుల కు కుదించారని వివరించారు. నిబంధనల ప్రకారం కాకుండా సరిహద్దు రాళ్లపైన తమ బొమ్మలు వేసుకోవాలనే పిచ్చితో హడావిడిగా రీ సర్వే చేశారని చెప్పారు. పాస్ పుస్తకా లపైన తన బొమ్మలు వేసుకోవాలనే పిచ్చి తప్ప రీ సర్వేను సక్రమంగా చేయాలనే ఆలోచ న జగన్‌రెడ్డి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. అప్పటి రీ సర్వేపై భూ విస్తీర్ణం, సరిహ ద్దు, పేర్లు దిద్దుబాటు, భూ వర్గీకరణ సమస్యలపైన భూ యజమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
వీటిని సరి చేసేందుకు కూటమి ప్రభుత్వం రీసర్వే పూర్తయిన అన్ని గ్రామాల్లోనూ గ్రామసభలు నిర్వహించి అర్జీలు స్వీకరించిందని చెప్పా రు. వీటికి సంబంధించి దాదాపు 2,79,712 అర్జీలు రాగా 2,57,881 అర్జీలను పరిష్క రించామని, మిగిలిన 21,831 అర్జీలను మార్చి 31లోగా పరిష్కరిస్తామని చెప్పారు. వచ్చిన అర్జీల్లో విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు సంబంధించి 99,216 అర్జీలు రాగా 89,473 అర్జీలను పరిష్కరించామని, జాయింట్ ఎల్పీఎం(ల్యాండ్ పార్శిల్ మ్యాప్) సమస్యపై 64,441 అర్జీలు రాగా 57,527 అర్జీలను పరిష్కరించామని, పేర్లు మార్పు, వ్యక్తిగత వివరాలు, భూమి వర్గీకరణ వంటి రెవెన్యూ అంశాలకు సంబంధించి 1,16,055 అర్జీలు రాగా 1,10,881 అర్జీలను పరిష్కరించామని తెలిపారు. జాయింట్ ఎల్పీఎంలలో సమ స్యలు ఉత్పన్నమయ్యాయని, ఒకే ఎల్పీఎంలో వేర్వేరు భూ యజమానులు ఉండడంతో వారిని వ్యక్తిగత ల్యాండ్ పార్సిల్స్‌గా సబ్ డివిజన్ చేసేంత వరకు వారు తమ ఆస్తులను మ్యూటేషన్ లేదా రిజిస్ట్రేషన్ చేయించడానికి ఇబ్బంది ఏర్పడిరదని చెప్పారు.
జాయింట్ ఎల్పీఎంలను విడగొట్టి రిజిస్ట్రేషన్‌కు అనుకూలంగా మార్చేందుకు గ్రామ, వార్డు సచివాల యాల్లో ఆన్‌లైన్ సబ్ డివిజన్ సిటిజన్ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. సబ్ డివిజన్ చేసుకునే భూ యజమానులకు ఈ ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆరు నెలల పాటు ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు సబ్ డివిజన్ కోసం 71,337 దరఖాస్తులు రాగా 62,816 దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. 22 ఏ 1(సీ)లో పెట్టిన భూములపై నిర్ణయం తీసుకునేం దుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఉప సంఘం సిఫార్సులతో ఆ భూములపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.