- ప్రజావినతుల కార్యక్రమానికి క్యూ కట్టిన బాధితులు
- అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ, నేతలు
మంగళగిరి(చైతన్యరథం): వివిధ సమస్యలపై బాధితులు టీడీపీ కేంద్ర కార్యాలయా నికి తరలివచ్చారు. ఎక్కువగా భూ సమస్యలు, ఇతర మోసాలపై వినతిపత్రాలు అందజేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, రాష్ట్ర బిల్డింగ్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ సలహా కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘు రామరాజులు అర్జీలు స్వీకరించారు. వెంటనే అధికారులు, సంబంధిత నేతలతో ఫోన్లలో మాట్లాడి అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
` తమకు వారసత్వంగా వచ్చిన భూమిని కబ్జా చేసి వైసీపీ నేతలు కొట్టేసేందుకు కుట్ర చేస్తున్నారని కడప జిల్లా కాశీనాయన మండలం కె.ఎన్.కోటాల గ్రామానికి చెం దిన ఓర్సు కిరణ్‌కుమార్, ఓర్సు బాలయ్యలు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ రికార్డులు మార్చి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని..వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
` గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన వాకచర్ల వీరయ్య సమస్యను వివరిస్తూ వైకుంఠపురంలోని 22ఏ జాబితాలో ఉన్న తమ పొలానికి ఎన్‌వోసీ ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద రూ.50 లక్షలు తీసుకొని వడ్లమూడి గ్రామానికి చెందిన చుంచు సుధీర్ మోసం చేశాడని..అతనిపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించా లని విజ్ఞప్తి చేశారు.
` 2018-2019లో పెద్దదోర్నాల మండలంలోని పలు చెంచుగూడెలలో అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నానని ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలానికి చెందిన ఏపీ రామారావు వినతిపత్రం అందజేశాడు. రావాల్సిన బిల్లులు ఇప్పించాలని కోరాడు.
` తన తండ్రి ఆస్తిపై కన్నేసి..తన తల్లి బతికి ఉండగానే మరో మహిళ తన తండ్రికి భార్యగా దొంగ పత్రాలు సృష్టించుకుని తమ ఆస్తిని వేరొకరికి అమ్మిందని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన జయలక్ష్మి తెలిపింది. ఆస్తిని కొన్న వారు బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నారని.. ఈ అక్రమానికి సహకరించిన అధికారులు, తన తండ్రి ఆస్తులను కొట్టేయాలని చూసిన మహిళ, కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
` రాగికోన వలస, కమ్మల గూడెంలలో నివసించే ఆదివాసీల జీవనోపాధికి ప్రభుత్వం భూమిని కేటాయించి ఆదుకోవాలని అన్నమయ్య జిల్లా సీతానగరం మండ లం మరిపివలస గ్రామానికి చెందిన దివ్యప్రసాద్ విజ్ఞప్తి చేశాడు.
` ప్రకాశం జిల్లా దర్శి మండలం పెద్ద ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన రావి వెంకటాద్రి సమస్యను వివరిస్తూ తమ పొలానికి నీరు రాకుండా పంట కాలువను పూడ్చి వేసి తమను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకుని పంట కాలువకు నీరు వచ్చేలా చూడాలని కోరాడు.
` రోడ్డుమీదకు తడిక కట్టి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు షేక్ పెద నాగూర్ అనే వ్యక్తి యత్నించగా దాన్ని ప్రశ్నిస్తే తనపై హత్యాయత్నానికి యత్నించా డని..అతనిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన షేక్ బాజీ షరీఫ్ ఫిర్యాదు చేశాడు.