- ప్రశ్నిస్తే రౌడీలతో దాడులకు వస్తున్నారు
- చర్యలు తీసుకోవాలని బాధితురాలి గోడు
- ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు
- వినతులు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి
మంగళగిరి(చైతన్యరథం): అన్నవరం పంచాయతీలో ఉన్న తమ భూమిని 40 సంవ త్సరాలకు పైగా సాగు చేసుకుంటుండగా గత ప్రభుత్వంలో వైసీపీకి చెందిన వారు అక్రమంగా తప్పుడు పత్రాలతో కబ్జా చేయాలని చూశారని విజయనగరం జిల్లా భోగాపు రం మండలం తూడెం గ్రామానికి చెందిన డెక్కలి చిట్టితల్లి తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే తమపై రౌడీలతో దాడులకు వస్తున్నారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరి గిన ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఎమ్మెల్యే బడేటి చంటి అర్జీలు స్వీకరించారు.
` పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో రజకులకు కేటాయించిన స్థలంలో మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు సహకారంతో కళ్యాణ మండపాన్ని నిర్మించుకోవ డం జరిగిందని అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు తెలిపారు. అందులో తాము అవసరమైన ఫర్నిచర్ తాము సమకూర్చుకున్నాక రజక ఐక్యవేదికను ఏర్పాటు చేసుకో వడం జరిగిందని చెప్పారు. అందరూ టీడీపీకి సానుకూలంగా ఉండటంతో వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్యాణ మండపం తాళాలు పగులకొట్టి రాత్రికి రాత్రే ఫర్నిచర్‌ను దొంగిలించుకుపోయారని ఫిర్యాదు చేశారు. ఫర్నిచర్‌ను తీసుకెళ్లిన వారిలో చెరుకూరి వెంకటగిరి, మర్రిపూడి రాంబాబు, దావులూరి శ్రీనివాసరావు, కురిచే టి కోటేశ్వరరావు, ఇంకొల్లు మల్లిఖార్జునలు ఉన్నారని, వారిపై చర్యలు తీసుకుని పోయిన ఫర్నిచర్ తిరిగి ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు.
` తన మనవరాలైన అమిరున్‌ను సత్తెనపల్లికి చెందిన సయ్యద్ సుభాని కుమారుడు సయ్యద్ రఫీకి ఇచ్చి వివాహం చేయగా ఆరునెలల గడవకుండానే అదనపు కట్నం కోసం హతమార్చారని గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన షేక్ మౌలాలి తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
` గుంటూరు జిల్లా గూంటూరులోని రెడ్డిపాలెంకు చెందిన చింతమనేని శ్రీనివాసరా వు విజ్ఞప్తి చేస్తూ.. తనకు అమ్మిన స్థలాన్ని మళ్లీ మరొకరికి అమ్మిన వ్యక్తులపై కేసు పెడితే పోలీసు అధికారులు పట్టించుకోవడంలేదని..అక్రమార్కులను అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేశాడు.
` కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామానికి చెందిన ఈరన్న విజ్ఞప్తి చేస్తూ.. గత 50 సంవత్సరాల నుంచి తాము సాగుచేసుకుంటున్న భూమిని తమ పేరుపై ఆన్‌లైన్ చేయమంటే అధికారులు పట్టించుకోవడం లేదని.. దయచేసి తాము సాగుచేసుకుంటున్న భూమి ఆన్‌లైన్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
` భూమి ఆక్రమణపై కోర్టులో కేసు నడుస్తున్నా ఆక్రమణదారుడు చదును చేసుకుంటున్నాడని.. అతనిపై చర్యలు తీసుకుని తమ భూమి కబ్జాకు గురికాకుండా చూడాలని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం శేక్షానపల్లి గ్రామానికి చెందిన కె.తేజోనాథ్ వినతిపత్రం అందజేశాడు.
` కేంద్ర ప్రభుత్వం పూసల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సుముఖంగా ఉన్నందున ఏపీ ప్రభుత్వం పూసల కులంపై బీసీ (ఏ) నుంచి ఎస్టీగా మార్చేలా అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సంచార జాతుల సెల్ కన్వీనర్ అరబోలు చంద్రశేఖర్ గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చారు.
` ఎస్సీలమైన తాము పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూమిపై అగ్ర కులా లకు చెందిన వ్యక్తుల కన్ను పడిరదని.. తమ కుటుంబాన్ని చంపి భూమిని కొట్టేయాలని వారు యత్నిస్తున్నారని అన్నమయ్య జిల్లా కలికిరి మండలం మర్రికుంటపల్లి గ్రామానికి చెందిన ఎ.శ్రీనివాసులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు.
` గత ప్రభుత్వానికి తొత్తులుగా ఉండి టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టిన సీఐలు బీమానాయక్, రామకోటయ్యలపై విచారణ జరి పించి చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నాలి మధు ఫిర్యాదు చేశారు.