- బడుగుల కోసం పోరాటం అసామాన్యం
- గత ఐదేళ్లు బీసీలను వేధించి హింసించారు
- కూటమి వచ్చాకే వారికి స్వాతంత్య్రం వచ్చింది
- జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ(చైతన్యరథం): తెలుగువారి పోరాటానికి నిలువె త్తు రూపం సర్దార్ గౌతు లచ్చన్న అని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గౌతు లచ్చన్న జయంతి ని అధికారికంగా నిర్వహించడం ద్వారా బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిదర్శనమన్నారు. లచ్చన్న లాంటి పోరాట యోధుడు మన తెలుగువారు కావడం మన అదృష్టం. చట్ట సభల్లో సిద్ధాంతాలపై పోరాడిన ఘనత గౌతు లచ్చన్నకే సాధ్యం. రాష్ట్రంలో గత ఐదేళ్లు ప్రజాస్వా మ్యాన్ని హరించి ప్రజల హక్కులను కాలరాశారు. ప్రశ్నించే బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులపై కేసులు పెట్టి వేధించారు. బీసీ నాయకులు అచ్చెన్నాయుడు సహా అనేక మందిపై కేసులు నమోదు చేశారు. నాపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. గౌతు లచ్చన్న వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన గౌతు శిరీషపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బీసీలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్ని కల్లో ఇచ్చిన హామీ మేరకు నాయీ బ్రాహ్మణులకు 200 యూని ట్ల వరకు ఉచిత విద్యుత్, కల్లుగీత కార్మికులకు మద్యం షాపు లు, బార్లలో 10 శాతం రిజర్వేషన్, హ్యాండ్ లూంకు 200 యూనిట్లు, పవర్ లూంకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. బీసీలను సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్స్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వంలోనే బీసీలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.