- జగన్ రెడ్డి పెట్టిన ఫీజు బకాయిలు రూ.4,271 కోట్ల
- బటన్ నొక్కుడుతో చేసిన బడాయి
- వేధింపులకు దిగిన విద్యాసంస్థలు
- విలవిల్లాడిన తల్లితండ్రులు
- సిగ్గు వదిలేసి తగుదునమ్మా అని ధర్నాలు
అమరావతి (చైతన్యరథం): నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారయింది వైసీపీ బ్యాచ్ పరిస్థితి. ఈ నెల ఐదవ తేదీన వైఎస్సార్‌సీపీ చేపట్టే ‘ఫీజుపోరు’ కార్యక్రమం పోస్టర్‌ను వైసీపీ దొంగల ముఠా అంతా కలిసి విడుదల చేయడం విడ్డూరంగా ఉంది. దీనికి అనుమతివ్వాలని ఈసీకి లేఖ రాయడం మరీ వింతగా ఉంది. పేద విద్యార్థులు చదువు, ఉద్యోగాలు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన భిక్ష అని పదేపదే వాగుతున్న జోగి రమేష్ తన పిచ్చి మాటలతో ప్రజలను భిక్షగాళ్లను చేసేశాడు. ప్రజలను భిక్షగాళ్లతో పోలుస్తున్న వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని విద్యా దీవెనగా మార్చి తామేదో ఘనకార్యం చేసి కొత్తగా పథకాన్ని సృష్టించినట్లు సిగ్గులేకుండా జగన్ ప్రచారం చేసుకున్నాడు. గతంలో విద్యార్థుల తరుఫున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసేది. కానీ జగన్ రెడ్డి ప్రచార ఆర్భాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థులను, వారి తల్లితండ్రుల్ని దారుణంగా మోసం చేశాడు. తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామంటూ ప్రచార పటొటాపానికి తెరతీశాడు. తన వికృత మనస్తత్వంతో ఖాతాలో ఎప్పుడు వేస్తాడో, ఎప్పుడు వేసేవాడో తెలీకుండా మాయ చేశాడు. కళాశాల యాజమన్యాలు మాత్రం విద్యార్థులను తీవ్రంగా వేధించాయి. కొన్ని చోట్ల హాల్ టిక్కెట్లు నిలిపేసి, పరీక్షలు రాయనిచ్చేది లేదని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేశాయి. అవమానించాయి. ఇంత జరగుతున్నప్పటికీ జగన్ తన వికృత చేష్టలను వదల్లేదు. దిగిపోయే ముందు కూడా బటన్ నొక్కి డ్రామా ఆడాడు. బకాయిల కుప్ప పెట్టి పోయాడు.
2014-2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందిక,ి అదీ కూడా విడతల వారీగా ఇచ్చాడు. దాదాపు 7 లక్షల మంది పేద విద్యార్థులను మోసగించి ఇంకా సిగ్గులేకుండా మాట్లాడడం వైసీపీ వాళ్ళకే చెల్లింది. విద్యా దీవెన అని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి విద్యార్థులను ముప్పు తిప్పలు పెట్టాడు. వారిని మానసిక క్షోభకు గురి చేసిన నీచుడు జగన్మోహన్ రెడ్డ్ణి. వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ, ఇతర కోర్సులు పూర్తి చేసినప్పటికీ ఉన్నత విద్య చదివే అవకాశం లేక కొందరు, ఉద్యోగావకాశాలు కోల్పోయి మరికొందరు విద్యార్థులు సతమతమయ్యారు. ఇంత చేసిన వైసీపీ మూకలు ఏ మొహం పెట్టుకుని ధర్నా చేస్తున్నారని విద్యార్థులు, వారి తల్లితండ్రులు నిలదీస్తున్నారు. వైసీపీ దరిద్రపు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవడంతో 2022లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి… ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించటం నిజమో..కాదో జగన్ రెడ్డి చెప్పాలి. 2021-22 విద్యాసంవత్సరంలో 4వ క్వార్టర్ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజీ యాజమాన్యం రూ.60 వేల ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి తాఖీదు ఇచ్చింది లేదంటే పరీక్షలు రాయనీయబోమని ఇబ్బంది పెట్టింది నిజామా కాదా?చిత్తూరు జిల్లాలోని ఓ ప్రముఖ కాలేజీకి గత ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ నిధులను బకాయి పెట్టడంతో 2018-19లో పూర్తిచేసిన కోర్సుకు సంబంధించిన రూ.57 వేల ఫీజు బకాయిని 15 రోజుల్లో చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలేజీ నుంచి లీగల్ నోటీసు అందింది నిజమా.. కాదా? విద్యార్థులను ఫీజు కోసం లీగల్ నోటీసులు అందుకునేలా చేసిన వైసీపీ వాళ్ళు నేడు ధర్నాల పేరిట డ్రామాలకు దిగటం చేయడం సిగ్గుచేటు. సిగ్గు అనే మాటకు అర్ధం తెలియని వాళ్ళు సైతం విద్యార్థులపై మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదం. 2023, డిసెంబర్ 17న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు అందలేదని దాదాపు 30 మంది ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులను నర్సింగ్ కళాశాల నుండి బయటకు పంపేసింది నిజమా.. కాదా? వైసీపీ దొంగల ముఠా వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
ఇవ్వని ఫీజులకు కూడా పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చుకుని బాకా కొట్టుకుంది మీరు కాదా? జగన్ రెడ్డి పదవి నుండి దిగిపోయే ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్ – రూ.2,832 కోట్లు, వసతి దీవెన బకాయిలు – రూ.989 కోట్లు, పీజీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద రూ.450 కోట్లు బకాయిల కుప్పపెట్టాడు. అందినకాడికి దోచుకున్నాడు. బెంగళూరు ప్యాలస్‌లో కూర్చొని నీచరాజకీయాలు నడుపుతున్న వైసీపీ దొంగల ముఠా నాయకుడు జగన్ రెడ్డి తాను పెట్టిన బకాయిల గురించి, దోపిడీ గురించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకే నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అని జగన్ రాజకీయ అవసరం కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ ఫీజులు కూడా విడతల వారీ చెల్లింపులు అన్నాడు, కాలేజీలు అంగీకరించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు మంచి పేరున్న కాలేజీలకు దూరమయ్యారు… ఈ పాపం నీది కాదా జగన్ రెడ్డీ అని వారంతా ప్రశ్నిస్తున్నారు.
5 ఏళ్లకు నాలుగు విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే రూ.4,271 కోట్ల బకాయిలు పెట్టిన జగన్ రెడ్డే అసలు 420. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.788 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసింది. వివిధ కళాశాలల్లో నిలిచిపోయిన 10 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికేట్లను విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకున్నది. విద్యార్థులను ఫీజు కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇవేమీ పట్టని జగన్ రైతుపోరు అన్నాడు, అట్టర్ ఫ్లాప్ అయింది, అయినా సిగ్గులేని రాజకీయ నేత జగన్ రెడ్డికి బుద్ధి రాదు. ఫీజు పోరు పేరుతో కొత్త నాటకం మొదలెట్టాడు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చూస్తే సైకోకు మనశ్శాంతి ఉండదు. ప్రజల చేత పేడ నీళ్లు మొహం మీద కొట్టించుకునే దాకా వైసీపీ నేతలకు కుదురుండదు.