• కొండపి నియోజకవర్గం మాలెపాడు వాటర్ ట్యాంక్ వద్ద కుంటిమల్లారెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• రాష్ట్రంలో 2 లక్షల మంది కుంటిమల్లారెడ్డి కులస్తులం ఉన్నాము.
• రెడ్డి కులం గోత్రాలు, ఆచార అలవాట్లను కథల రూపంలో తెలియజేయడం మా వృత్తి.
• మా కులంలో నిరక్షరాస్యత అత్యధికంగా ఉంది.
• మా కులానికి చెందిన చదువుకునే పిల్లలను మిగిలిన విద్యార్థులు పిచ్చిగుంట్ల అని ఎగతాళి చేస్తున్నారు.
• 1996లో మా కులానికి పిచ్చిగుంట్ల/వంశారాజ్ అనే పేరుతో జీఓ ఇచ్చారు.
• మేము కుంటి మల్లారెడ్డి వంశస్తులము. మా కులానికి పిచ్చిగుంట్ల అనే పదం తొలగించి కుంటిమల్లారెడ్డి అనే పేరు మార్చాల్సిందిగా కోరుతున్నాము.
నారా లోకేష్ స్పందిస్తూ…
• సమాజంలో అన్ని సామాజికవర్గాలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం.
• జగన్ అధికారంలోకి వచ్చాక నలుగురు తప్ప రెడ్డి సామాజికవర్గం కూడా తీవ్రంగా నష్టపోయింది.
• టిడిపి అధికారంలోకి వచ్చాక పిచ్చిగుంట్ల పేరును మార్పును చేస్తూ ప్రత్యేక జిఓ విడుదల చేస్తాం.
• కుంటిమల్లారెడ్డి కులస్తుల విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.
• స్వయం ఉపాధి రుణాలను అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తాం.