- తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కార్యక్రమం
- సీఎం చంద్రబాబును ఆహ్వానించిన మంత్రి కందుల
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర పర్యాటక శాఖ అధికారులు మంగళవారం సచివాలయం మొద టి బ్లాక్‌లోని సీఎం చాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశా రు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్ర చరిత్ర, సంగీతం, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు.
కార్యక్రమంలో భాగంగా ఆంధ్రుల సాంస్కృతిక వైభవం, వారసత్వం, సంప్రదాయాలతో పాటు రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన వంటకాలు, హస్త కళలు, చేనేత వస్త్రాలు, ప్రాచుర్యంలో లేని ప్రాంతాలకు ప్రచారం కల్పించనున్నట్లు చెప్పారు. కర్ణాటక సంగీత ప్రదర్శనలతో పాటు పలురకాల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిఏటా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా నిర్వహిస్తోన్న కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమంపై చర్చతో పాటు రాష్ట్ర పర్యాట కాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఎకో, టెంపుల్, క్రూయిజ్, అడ్వెంచర్, రీజినల్, వెల్నెస్ టూరిజం, సర్క్యూట్ల ఏర్పాటుపై చర్చ జరిగింది. సావధానంగా విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అంశాలపై సానుకూలంగా స్పందించారు.