* యుతవ తమ నైపుణ్యాలు ప్రదర్శించే తరుణమిది
* కోనసీమ యూత్ సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి లోకేష్
ఉండవల్లి (చైతన్య రథం): అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న రాష్టకార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో నిర్వహించనున్న కోనసీమ యూత్ సమ్మిట్ పోస్టర్ను బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఐటీ, విద్యా మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువతలో దాగివున్న
ప్రజ్ఞ, నైపుణ్యాన్ని రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునేందుకు కోనసీమ యూత్ సమ్మిట్వంటి కార్యక్రమాలు దోహద పడతాయన్నా రు. యువత తమ ఆలోచనలు వ్యక్తపరచడానికి యూత్ సమ్మిట్ సరైన వేదికని మంత్రి లోకేష్ అభి ప్రాయపడ్డారు. అభివృద్ధి అజండాగా భవిష్యత్ ప్రణా ళికలు చర్చించడంతోపాటు, యువతలోని నాయకత్వ లక్షణాలు,పరిస్థితులకు తగినట్టు వేగంగానిర్ణయాలు తీసుకునే ఆలోచన విధానాలను యూత్ సమ్మిట్ వంటి కార్యక్రమాలద్వారా యువత అలవర్చుకోవా లని పిలుపునిచ్చారు. యువతకు ఎంతో ఉపయోగ పడే ఇటువంటి కార్యక్రమనిర్వహణకు నదుబిగించిన మంత్రి సుభాష్ను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభి నందించారు. కేబినెట్ సమావేశానికి ముందు జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్, రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, జనార్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.