- సీఎం పదవి పొయ్యాక పిచ్చెక్కి మాట్లాడుతున్న జగన్
- గత ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినా తీరు మారలేదు
- రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం
- టీడీపీ కార్యకర్తలందరూ పార్టీ సభ్యత్వం తీసుకోవాలి
ఒంగోలు (చైతన్యరథం): ప్రభుత్వ అధికారులపై వైసీపీ అధినేత జగన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ హెచ్చరించారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారులను ఏదో చేస్తామని జగన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావటం అనేది ఓ కలగానే మిగులుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికలో వైసీపీకి జగన్ గట్టిగా బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసినా జగన్ కు సిగ్గు రాలేదని విమర్శించారు. వైసీపీ సోషల్ మీడియా సైకోలు సొంత తల్లి, చెల్లిని అసభ్యంగా వేధిస్తే పైశాచిక ఆనందం పొందిన నీచమైన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు కన్నెర్ర చేస్తే జగన్ రాష్ట్రంలో తిరగలేడన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో ఎటువంటి అవినీతికి జరగకపోయినా కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి నిరాధార ఆరోపణలతో సీఎం చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించిన క్రూరుడు జగన్ అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు ప్రతిశాఖలోనూ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, త్వరలో వాటన్నిటినీ బయట పెట్టి వారిని జైలు పంపటం ఖాయం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నిరంతరం కష్టపడుతుంటే జగన్ ఓర్చుకోలేక పోతున్నారని బాలాజీ ఆక్షేపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఆటంకం కలిగిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవటం ఖాయమని స్పష్టం చేశారు. సీఎం పదవి పొయ్యాక జగన్‌రెడ్డి పిచ్చి పట్టి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కొంతమంది అధికారులను గత ప్రభుత్వ వాసన వదలేదని, అలాంటివారు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలేది లేదని బాలాజీ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూనే, కార్యకర్తలందరికీి అండగా ఉంటున్నారన్నారు. ప్రతి టీడీపీ కార్యకర్త పార్టీ సభత్వం తీసుకోవాలన్నారు. సభ్యత్వం ద్వారా వచ్చే బీమా ప్రమాద సమయాల్లో కార్యకర్తకి అండగా ఉంటుందని తెలిపారు.