అమరావతి(చైతన్యరథం): జర్మనీలోని బెర్లిన్ ఎక్స్‌పో సెంటర్ సిటీలో ప్రారంభమ య్యే ఐటీబీ బెర్లిన్-2025 సదస్సులో పాల్గొనేందుకు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ జర్మనీ బయలుదేరి వెళ్లారు. అక్కడి ఎయిర్‌పోర్టులో ఆయనకు కూటమి శ్రేణులు స్వాగ తం పలికారు. పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు సాధించేందుకు ఏపీ పర్యాటక రంగంలో అవకాశాలు, వనరుల గురించి వివరించనున్నారు. పర్యాటక, అతి థ్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఎకో టూరిజంలో పెట్టుబడి, వివిధ రకాల పర్యాటక అవకాశాలను వివరించనున్నారు. దాదాపు 30 మందిపైగా పెట్టుబడిదారు లతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అంతర్జాతీయ మీడియాతో ఏపీలో పర్యాటక అవకా శాలను వివరించనున్నారు. మంత్రి దుర్గేష్‌తో పాటు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట బెర్లిన్‌కు వెళ్లారు.