అమరావతి: నిరుపేద కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం నేటితరం యువతకు మార్గదర్శిగా నిలుస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కలాం చిత్రపటానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్‌బాబు, శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, బీటెక్ రవి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ, ఇతర నేతలు పూలతో నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు, ముఖ్యంగా రక్షణ రంగం బలోపేతానికి చేసిన కృషి వెలకట్టలేనిదని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, రెడ్డివారి శ్రీనివాసరెడ్డి, ఏ.ఎస్.రామకృష్ణ, పిల్లి మాణిక్యరావు, సయ్యద్ రఫీ, శ్రీరామ్ చిన్నబాబు, హాసన్ భాష, సాహెబ్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, ఆళ్ల గోపాలకృష్ణ, వల్లూరి కిరణ్ , సీహెచ్. రాజశేఖర్, కుర్ర నరేంద్ర, షేక్ ఆషా తదితరులు పాల్గొన్నారు.