- నాలుగు లైన్ల రహదారి మంజూరుకు చర్యలు తీసుకోవాలి
- రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలి
- రాయచోటిలో రోడ్ల కనెక్టివిటీకి నిధులు మంజూరు చేయాలి
- నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ఆమోదించాలి
- కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వినతి
న్యూఢీల్లీ(చైతన్యరథం): న్యూఢీల్లీలో రవాణా, యువజన, క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని బుధవారం ఆయన నివాసంలో కలిసి సుమారు 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా కడప – రాయచోటిలో నాలుగు కిలో మీటర్ల టన్నెల్ ఏర్పాటుకు సర్వం సిద్ధం కాగా ఇటీవల సమగ్ర నివేదిక కేంద్ర రవాణా బృందం సిద్ధం చేసిందని, నాలుగు లైన్ల టన్నెల్ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు కేంద్రం ఆమోదం రూపంలో సహకారం అందించాలని కోరారు. అందులో భాగంగా రాయచోటిలో సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షన్ నిధుల ద్వారా రోడ్ల విస్తరణ గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా హెడ్ క్వార్టర్స్ మధ్య మెరుగైన కనె క్టివిటీ సులభతరం చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎన్‌హెచ్ నేషన ల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టును ఆమోదించి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కడప నుంచి రాయచోటి వరకు 4 లైన్ల రహదారి మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజంపేట – రాయచోటి – కదిరి రహదారి – రాష్ట్ర రహదారి నుంచి జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు శాఖాపరమైన ఆదేశాలు జారీ చేయా లని కోరారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ రాష్ట్ర రవాణా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామ ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖకు సంబంధించిన ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.