- శ్రీచరణికి మంత్రి లోకేష్ అభినందనలు
- రాష్ట్రానికే గర్వకారణమని ప్రశంస
అమరావతి (చైతన్యరథం): కడపకు చెందిన ఎన్ శ్రీచరణి ముక్కోణపు అంతర్జాతీయ వన్‌డే సిరీస్ కోసం భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపిక కావటంపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రా క్రికెట్‌కు ఇది గొప్ప మలుపు అని ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. అంధ్రులందరికీ గర్వకారణమన్నారు. ముక్కోణపు వన్డే సిరీస్ జట్టులో స్థానం పొందటం అసాధారణ ఘనత అన్నారు. ఆమె విజయాల కోసం తనతో పాటు మొత్తం అంధ్రప్రదేశ్ ఎదురుచూస్తోందన్నారు. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.