- స్వయంగా ప్రారంభించిన మంత్రి పొంగూరు నారాయణ
- 30 రోజుల్లో యుద్ధప్రాతిపదిక ముళ్ల కంపలు తొలగిస్తాం
- వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో తీరని నష్టం జరిగింది
- ఐఐటీ నిపుణుల నివేదిక తర్వాతే భవన నిర్మాణాలపై నిర్ణయం
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వ విధ్వంసంతో ఐదేళ్లుగా నిర్జీవంగా పడి ఉన్న రాజధాని అమరావతి కొత్త కళ సంతరించుకోనుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో దట్టమైన అడవిని తలపించేలా ఏపుగా పెరిగిపోయిన తుమ్మ చెట్లు, ముళ్ల కంపలతో భూములిచ్చిన రైతులు కూడా తమ భూమి ఎక్కడ ఉందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడిరది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పరిస్థితి నుంచి ముందుగా అమరావతిని పూర్తిగా బయటకు తీసుకొచ్చేలా కంపలు, తుమ్మచెట్లను తొలగించాలని సీఎం ఆదేశించారు.
ఇందులో భాగంగానే ముందుగా అమ రావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం రూ.36.5 కోట్లతో నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌సీసీ) సంస్థ టెండర్ ద్వారా ఈ పనులను దక్కించుకుంది. మొత్తం 23,429 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధప్రాతిపది కన చేపట్టింది. బుధవారం ఉదయం 9 గంటలకు అమరావతిలోని ఎన్ 9 రహదారిని ఆనుకుని ప్రస్తుత సచివాలయం ఉన్న వెనుక వైపు జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారం భించారు. స్థానిక ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్‌కుమార్‌తో కలిసి ప్రత్యేక పూజల అనంత రం మంత్రి నారాయణ స్వయంగా పొక్లెయినర్‌ను ఆపరేట్ చేసి పనులను ఉత్సాహంగా ప్రారంభించారు.
అమరావతి పనులకు తొలి అడుగు
అనంతరం మీడియా ప్రతినిధులతో నారాయణ వివరాలు వెల్లడిరచారు. గత వైసీపీ ప్రభు త్వం మూడు ముక్కలాట ఆడి మూడు రాజధానులంటూ రైతులను ఇబ్బంది పెట్టింది. మొత్తం 58 వేల ఎకరాలు అమరావతి పరిధిలో ఉండగా 24 వేల ఎకరాల్లో దట్టమైన అడవిలా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. వెంటనే ముళ్ల కంపలు తొలగించాలన్న సీఎం ఆదేశాలతో పనులు ప్రారంభించాం. 30 రోజుల్లోగా పనులు పూర్తి చేసేలా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాం. అమరావతి పనులకు ఇది మొదటి అడుగు. జంగిల్ క్లియరెన్స్ పూర్తయితే రైతులు తమకు వచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఉన్నా యో చూసుకునే అవకాశం ఉంటుంది. అమరావతికి జరిగిన అన్యాయంతో రైతులు ఇబ్బందులను గుర్తించి వారికి మరో ఐదేళ్ల పాటు కౌలు గడువు పొడిగించాం. భూమి లేని నిరుపేదలకు కూడా మరో ఐదేళ్లు పెన్షన్ కొన సాగించేలా నిర్ణయం తీసుకున్నాం. అమరావతి నిర్మాణం ద్వారా రైతుల భూముల విలువ పెరిగేలా చేస్తామని తెలిపారు.
ఐఐటీ నిపుణుల నివేదిక తర్వాత నిర్మాణాలపై నిర్ణయం
గడిచిన ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం పట్టిం చుకోకపోవడంతో వాటి సామర్థ్యంపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్ నుంచి ఇంజినీరింగ్ నిపుణులు అమరావతిలో పర్యటించి గతంలో నిలిచిపోయిన భవనాల నిర్మాణాలను పరిశీలించినట్లు తెలిపారు. త్వరలో ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందిస్తారని…దానికనుగుణంగా నిర్మాణాల విషయంలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
అమరావతి నాశనంతో ప్రజలపై జగన్ భారం
ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ అమరావతి రైతులకు ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజన్నారు. గత ఐదేళ్లలో అమరావతి ప్రాంత ప్రజలపై కోపంతో రైతులను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందన్నారు. అమరావతిని నాశనం చేయడం తో పాటు ముళ్లకంపలు పెరిగిపోవడంతో వాటిని తొలగించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం తీసు కొచ్చిన మెటీరియల్ కూడా పాడైపోయిందని తెలిపారు.