పత్తికొండ నియోజకవర్గం డీసీ కొండ గ్రామ ప్రజలు, టిడిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో 2020 సెప్టెంబర్ 8న టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసిపి గూండాలు దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా, మాపైనే రివర్స్ కేసులు పెట్టారు. నెల రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి, 42రోజులు సబ్ జైల్లో పెట్టించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక మాపై ఉన్న అక్రమ కేసులు రద్దు చేయాలి. మాపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాజారెడ్డి రాజ్యంగాన్ని అమలుచేస్తూ టిడిపి కార్యకర్తలను ఊచకోత కోస్తూ రాక్షాసానందం పొందుతున్నారు.జగన్ అధికారంలోకి వచ్చాక 45మంది టిడిపి నాయకులు, కార్యకర్తలను హత్యచేశారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,400 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, కళావెంకట్రావు, చింతమనేని ప్రభాకర్, పట్టాభి వంటి 100మందిపై తప్పుడు కేసులు బనాయించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2021లో 21,880 దాడుల ఘటనలు చోటుచేసుకున్నయి. పోలీసులు ఏకపక్ష వైఖరి అవలంభించి టీడీపీ కార్యకర్తలను అక్రమ కేసుల్లో ఇరికించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి పై సుమారు 80కేసులు పెట్టారు.
తాడపత్రి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు 249మందిని అక్రమ కేసుల్లో జైలుకు పంపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తాం. పనిగట్టుకొని టిడిపి నేతలను వేధించిన పోలీసులను సర్వీసునుంచి తొలగించి జైలుకు పంపుతాం అని లోకేష్ వెల్లడించారు.