అమరావతి (చైతన్యరథం): భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ˜నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానం అన్నారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషిచేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దామని మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు.