అమరావతి: సాహిత్యంతో అనునిత్యం సమాజం లోని మూఢాచారాల మీద యుద్ధం చేసిన కవి గుర్రం జాషువా అని టీడీపీ నేతలు అన్నారు. కవికోకిల, నవయుగకవి చక్రవర్తి గుర్రం జాఘవా జయంతి సంధర్బంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ తెలుగు నేలపై అంతరాల మధ్య సతమతమవుతున్న సమాజాన్ని కవిత్వంతో ప్రశ్నించిన అభ్యుదయ వాది గుర్రం జాఘవా. చిన్నతనంలోనే అంటరాని తనాన్ని ఎదుర్కొ న్న జాఘవ కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢా చారాలపై తిరగబడ్డారు. ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. ఆకలిని, శోకాన్ని నిర్మూలించా లన్నదే ఆయన ధ్యేయం. అంధ విశ్వాసాలను, మత విద్వేషాలను తీవ్రంగా నిరశించారు. చిత్తశుద్ది లేని పెత్తం దార్లను, గుత్త స్వాములను నిలదీసి ప్రశ్నించే వారు. ఆస్తి అందరిది కావాలని, కొందరికే పరిమితం కారాదని ఆయన ఆభిమతమని నేటి సంఘసంస్కర్తల కు జాషువా ఆదర్శ పురుషుడని టీడీపీ నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు టీ.డీ జనార్ధన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు, హెచ్ ఆర్డీ చైర్మన్ రామాంజనేయులు, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.