టెక్కలి: వైస్సార్సీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పైన ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పని అయిపోయింది. మరో 100 రోజుల్లో టీడీపీ – జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి లోని ఎన్టీఆర్ భవన్(తెదేపా కార్యాలయం) లో గురువారం టటెక్కలి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, కార్యకర్తలు పాల్గొన్నారు.మొదటగా బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర లో ఈ కార్యక్రమం అమలులో టెక్కలి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్న బూత్ అధ్యక్షులకు, పంచాయతీ నాయకులుకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రజలకు మనం అందిస్తున్న ప్రమాణపత్రానికి వారి నుండి మంచి స్పందన వస్తోందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఆయా పంచాయతీ నాయకులు బాధ్యత తీసుకుని బూత్ అధ్యక్షులతో పాటు ప్రతీ ఇంటికి వెళ్లి కార్యక్రమం ముందుకు సాగించాలని కోరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ మొహం చూసే ప్రజలు వైసీపీ ని ఓడిస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చెల్లని కాసు ల లాంటివారు వారు. ఎక్కడన్నా ఒకటే. జగన కు బీసీలపై నిజంగా అంత ప్రేమ ఉంటే పులివెందుల ఎమ్మెల్యే టిక్కెట్ బీసీ లకు ఇవ్వాలి. శ్రీకాకుళం జిల్లా కి చేసింది ఏమిటో జగన్ చెప్పాలి. వంశధార ప్రాజెక్ట్ ఈ నాలుగేళ్లు లో 7 శాతం కూడా పూర్తి చెయ్యలేదు. ఉద్దానం కి వైస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు. ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే జగన్ జిల్లా పర్యటన. ఉద్దానం కిడ్నీ సమస్య కి టీడీపీ హయాంలో నేను చేసింది తప్ప వీళ్ళు ఏమి చేసారో బహిరంగ చర్చకు సిద్ధం. రాష్ట్రం లో 403 మండలాల్లో కరువు ఉంటే 100 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. అందులో శ్రీకాకుళం జిల్లా లేకపోవడం దురదృష్టమని అచ్చెన్నాయుడు అన్నారు. రైతులు దగ్గర నుండి ప్రతి ధాన్యం గింజ వెంటనే కొనాలి. లేని పక్షం లో రైతుల తరుపున పోరాటానికి టీడీపీ సిద్ధం. టెక్కలి ని అభివృద్ధి చేసింది నేనే.. వైసీపీ నేతల గ్రామాలు కూడా అభివృద్ధి చేసాను. అభివృద్ధి కి కేరాఫ్ అడ్రస్ కింజరాపు కుంటుంబం అని అచ్చెన్నాయుడు అన్నారు.
టెక్కలి టీడీపీలో జోరుగా చేరికలు
టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం పీవీ పురం, కళ్లాడ పంచాయతీల నుండి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో రెయ్యి సీతారాం, జలుమూరు జగ్గారావు, రెయ్యి లోకేష్, గుమ్మడి ఉపేంద్ర, మంచాల మాధవరావు, రెయ్యి తాతారావు, కళ్లాడ పంచాయతీ నుండి పద్మభూషణ జనార్థన శర్మ తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ప్రజలు అభివృద్ధి వైపే నిలబడతారని, అభివృద్ధికి చిహ్నం అచ్చెన్నాయుడే అని భావించి పార్టీలో చేరామని వారు తెలిపారు. అదే విధంగా అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో రిటైర్డ్‌బ్యాంక్ మేనేజర్ బోకర మోహనరావు టీడీపీలో చేరారు