- ఐదేళ్ళ పాలనలో ఒక్క పైసా కూడా మామిడి రైతుకు సబ్సిడీ ఇవ్వని జగన్
- కిలో మామిడికి రూ.3లే ఇస్తూ.. రైతును దోపిడీ చేస్తున్న పెద్దిరెడ్డి ఫ్యాక్టరీ
- తమ రాష్ట్ర మామిడిని ఏపీలో అమ్ముకునేందుకు అనుమతించాలని కర్ణాటక సీఎస్.. ఏపీ ప్రభుత్వానికి లేఖ
- తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకన్నా ఏపీలోని మామిడి రేట్లు ఎక్కువగా ఉన్నది నిజం
- మామిడి రైతుల పరామర్శ పేరుతో అలజడులు రేపి రాజకీయ లబ్ధికి జగన్ కుట్ర
- జగన్ పాలనలో ఏడాదికి 300 రైతు ఆత్మహత్యలు జరిగింది నిజం
- కూటమి ఏడాది పాలనలో జరిగిన రైతు ఆత్మహత్యలు 50లోపు మాత్రమే
- జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం చేయగా.. నేడు శరవేగంగా నిర్మాణాలు
- 2014-19 చంద్రన్న పాలనలో ఇన్‌పుట్ సబ్సిడీ రూ.3,759 కోట్లు ఇవ్వగా.. జగన్ ఇచ్చింది రూ.1977 కోట్లు మాత్రమే
- చంద్రన్న పాలనలో డ్రిప్‌కు 90శాతం సబ్సిడీ ఇవ్వగా.. జగన్ దాన్ని రద్దు చేశారు
- రైతు ద్రోహి జగన్.. రైతు బాంధవుడు చంద్రన్న
అవినీతి విషపుత్రిక సాక్షి ఉద్యోగి వర్ధెల్లి మురళి 6.7.2025 ఆదివారం సాక్షిలో ‘చెట్టునే నరకనా.. మెడ కోసుకోనా..’ అనే శీర్షికన నరుకుడు భాషతో చంద్రన్న పాలనపై అబద్ధాల దాడి చేశారు. తన యజమాని లక్షణాల్ని చంద్రబాబుకు అంటగట్టి.. రాసిన అబద్ధాలనే వందసార్లు రాస్తున్నారు. ఒకసారి అబద్ధాలకు, విద్వేష ప్రచారాలకు మోసపోయి చంద్రబాబును కాదని జగన్ పాలనలో ఎన్నివిధాల నష్టపోయారో ఆంధ్ర ప్రజలకు అనుభవం ఉంది. -జగన్ ముఠా అబద్ధాలకు మరోసారి మోసపోవడానికి ఆంధ్రులు సిద్ధంగా లేరు. స్వర్ణాంధ్ర 2047 సాకారం కోసం కూటమి పాలనను సుదీర్ఘంగా కాపాడుకొంటారు. అబద్ధాల్ని, విద్వేషాల్ని తిప్పికొడతారు.
మామిడి రైతులపై మొసలికన్నీరు కారుస్తున్న జగన్ ముఠా..
జగన్ పాలనలో పెద్దిరెడ్డి జ్యూస్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో వైకాపా ఫ్యాక్టరీ యజమానులు మామిడి రైతుల్ని దోచుకొన్న అనుభవం చిత్తూరు జిల్లా రైతులు ఇంకా మరిచిపోలేదు. వారి పాలనలో మామిడి రైతులకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదు.
నేడు కూడా సదుంలోని పెద్దిరెడ్డి ఫ్యాక్టరీలో కిలో మామిడికి రూ.3లే ఇస్తున్నారు. వైసీపీకి చెందిన సిజిఆర్ ఫుడ్స్, కాసా, సన్నిధి, ఆర్‌ఎంఎం వగైరా ఫ్యాక్టరీలన్నీ చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల్ని దోపిడీ చేస్తున్నాయి. ముందు వీరిచేత కిలో రూ.16లకు జగన్ కొనిపించగలరా? తమిళనాడు, కర్నాటకలోకి రూ.16లకు కొనుగోలు చేస్తున్నారని జగన్ ముఠా అబద్ధపు ప్రచారం చేస్తూ రైతుల్ని రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారు. తమిళనాడు, కర్నాటకలలో కిలో రూ.2 లేదా రూ.3లకే కొనుగోలు చేస్తున్నారు. అందుచేతనే ఆ రాష్ట్రాల మామిడి రైతులు వారి దిగుబడులను ఏపీ తెచ్చున్నారు. ఏపీకి రాకుండా మన ప్రభుత్వం చెక్ పోస్టులను కట్టుదిట్టం చేసింది. అందువల్ల కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి వారి మామిడిని అనుమతించాలని లేఖ వ్రాసినా.. మన ప్రభుత్వం అంగీకరించలేదు. దీన్నిబట్టి కర్నాటకలో రూ.16లకు కొంటున్నారనే కరుణాకరరెడ్డి ప్రచారం శుద్ధ అబద్ధమని స్పష్టమౌతున్నది. 2018లో చంద్రబాబు ప్రభుత్వం కిలో రూ.2.50లు, నేడు కిలోకు రూ.4లు సబ్సడీ ఇచ్చి ఆదుకొన్నది. ఈ సీజన్‌లో మామిడి రైతులకు రూ.300 కోట్లు సబ్సిడీ ఇస్తుంది చంద్రబాబు ప్రభుత్వం ఒక్కటే.
ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లపై మాట తప్పిన జగన్ పాలన
ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మాట తప్పాడు జగన్. 2019-24 మధ్య ఐదేళ్లలో జగన్ ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ కేవలం రూ.1977 కోట్లు మాత్రమే. 2014-19 మధ్య చంద్రబాబుకు రూ.3,759 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. నేడు కూడా మామిడితోపాటు మిర్చి, టుబాకో, టమోట, ఉల్లి వగైరా పంటలకు సబ్సిడీ ఇచ్చి కొనుగోళ్లు చేసింది. జగన్ పాలనలో 42 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయగా… చంద్రన్న ప్రభుత్వం ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. ఇందుకు జగన్ పెట్టిన ధాన్యం బకాయిలు రూ.1670 కోట్లతోపాటు రూ.13 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో కూటమి ప్రభుత్వం జమచేసింది. చంద్రబాబు లక్షవరకు సున్నా వడ్డీతోపాటు మూడు లక్షల రుణానికి పావలా వడ్డీ అమలు చేశారు. జగన్ పాలనలో లక్ష వరకే సున్నా వడ్డీ పరిమితం చేశారు. పావలా వడ్డీ రద్దు చేశారు. లక్ష నుంచి 3 లక్షల రుణాలకు చంద్రబాబు పాలనలో రూ.6వేలు వడ్డీ చెల్లిస్తే… జగన్ పాలనలో రూ.12 వేలు చెల్లించాల్సి వచ్చింది. డ్రిప్‌కు 90 శాతం సబ్సిడీ ఇవ్వగా… జగన్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల భూములు కబ్జా చేశారు. రైతుల పాస్ పుస్తకాలపై రాజముద్ర స్థానంలో జగన్ బొమ్మలు వేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం విపత్తుల సాయాన్ని రెట్టింపు చేసింది.
బనకచర్లపై కేసిఆర్ వాదనను సమర్థిస్తున్న జగన్ ముఠా
జగన్ ఐదేళ్ళ పాలనలో రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చుపెట్టి, అందులో సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది కేవలం రూ.32 వేల కోట్లు మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వం 2014`19 మధ్య రూ.7 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చుచేసి… అందులో సాగునీటి ప్రాజెక్టులకు రూ.71 వేల కోట్లు ఖర్చు చేసింది. రూ.1600 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసి రూ.50 వేల కోట్ల దిగుబడులు సాధించింది. రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబునాయుడు రూ.12,500 కోట్లు ఖర్చు చేయగా… జగన్ ఖర్చు చేసింది రూ.2వేల కోట్లు మాత్రమే. నాడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరాన్ని విధ్వంసం చేశారు. ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను వరదల్లో గల్లంతుచేసి.. 42మంది ప్రాణాలు పోగ్గొట్టారు. డ్రిప్ ఇరిగేషన్‌ను నీరుగార్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పాడు చేశారు. చంద్రబాబు 6 లక్షలమంది కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వగా… జగన్ లక్ష మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో ఉందంటే.. జగన్ రైతు ద్రోహి కాదా? చంద్రబాబు రైతు బాంధవుడిగా ఉన్నారు. నేడు ప్రాజెక్టులకు ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం రూ.18 వేల కోట్లు బడ్జెట్ కేటాయించింది. మూడేళ్లలో చాలావరకు పెండిరగ్ ప్రాజెక్టులతోపాటు పోలవరం పూర్తి అవుతాయి. ప్రతి ఐదేళ్లలో.. రెండేళ్లు కృష్ణానదిలో నీటి కొరత ఏర్పడి కరవు వస్తోంది. రెండోవైపు గోదావరిలో 3 వేల టీఎంసీ నీరు సముద్రం పాలౌతున్నాయి. దిగువ రాష్ట్రం వరద జలాలను వాడుకునే హక్కును బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. గోదావరి వరద జలాలు బనకచర్లకు తరలించడం ద్వారా కరవురహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. నాడు రూ.1600 కోట్లు పట్టిసీమపై ఖర్చు చేస్తే నాడు అది వృధా ఖర్చని జగన్ ముఠా దుష్ప్రచారం చేసింది. అదే పట్టిసీమ ఇప్పటికే రూ.50 వేల కోట్లు అదనపు విలువగల దిగుబడులనిచ్చింది. బనకచర్ల కూడా ఇలాంటిదే. డబ్బు ముఖ్యం కాదు. నీళ్లు అమూల్యం. ఎవరు నిర్మిస్తున్నారనేది కాదు… వారికి నిర్మించే సామర్థ్యం ఉందా? లేదా? అనేదే ముఖ్యం. రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. బీఆర్‌ఎస్ వాదన కేవలం ప్రాంతీయ చిచ్చు ద్వారా రాజకీయలబ్ధి పొందాలనేది వారి కుతంత్రం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గోదావరి జలాలు ఉపయోగపడాలి గాని సముద్రం పాలు కాకూడదనేది చంద్రన్న లక్ష్యం.
దుర్యోధనుడు, హిట్లర్ నాశనమైంది అసూయ, విద్వేషాలతోనే…
హైటెక్ సిటీ నిర్మాణం కాకమునుపు అక్కడ ఎకరం భూమి ఖరీదు రూ.5 లక్షలు కాగా… నేడు అదే ఎకరం వందల కోట్లు విలువ చేస్తుంది. అమరావతి నిర్మాణం ఒకదశకు వస్తే అక్కడ కూడా ఎకరం ఖరీదు కనీసం రూ.50 కోట్లకు చేరుకున్నా అశ్చర్యపోవాల్సిన పనిలేదు. రైతులిచ్చిన అమరావతి మిగులు భూముల విలువ రూ.2 లక్షల కోట్లు. ఇందులో అమరావతి నిర్మాణానికి చేసిన అప్పులు పోగా… ఇంకా భారీగా మిగులుతుంది. ఆ మిగులు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడటంతోపాటు 175 నియోజకవర్గాల బిడ్డలకు లక్షలాది ఉద్యోగాలు అమరావతిలో వస్తాయి. అమరావతి ఆంధ్ర సైబరాబాద్ అవుతుంది. అమరావతిపై విద్వేషం మానుకోకపోతే… హిట్లర్, దుర్యోధనుడు ఏమయ్యారో అదే అవుతుంది. నాడు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 5 వేలు ఎకరాలు కేటాయిస్తే దాన్ని విమర్శలు చేసిన వారు ఇప్పుడేమంటారు? అమరావతి ఎయిర్ పోర్టును వ్యతిరేకించే వారు కూడా భవిష్యత్తులో ప్రజల ముందు దోషులుగా నిలబడక తప్పదు. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళలో చేస్తుంది. స్వర్ణాంధ్ర 2047ను సాకారం చేస్తుంది. తెలుగువారిని అగ్రస్థానంలో నిలబెడుతుంది.
-గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్