- చంద్రబాబును తిట్టాలని క్షతగాత్రులపై ఒత్తిడి చేశారు
- ముందుగానే ఆసుపత్రిలో డబ్బుల కవర్లు ఇచ్చారు
- స్విమ్స్ సీసీ కెమేరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి
- దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
అమరావతి(చైతన్యరథం): పరామర్శ పేరుతో జగన్ దుష్టచతుష్టయ యాత్ర సాగిం చాడని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ తిరుమల దేవస్థానాన్ని భ్రష్టుపట్టించిన ఆ నలుగురే నిన్న జగన్‌తో ఉన్నారు.. జగన్ అసుపత్రికి వెళ్లేసరికి ఆసుపత్రిలో 18 మంది వరకు ఉన్నారు. జగన్ వెంట ఉన్న దుష్ట చతుష్టయంలోని ఒకరు జగన్ కంటే ముందు ఆసుపత్రి లోపలికి వెళ్లా రు..ఆసుపత్రిలో క్షతగాత్రులకు డబ్బుల కవర్లు ఇచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ దగ్గర మాట్లాడమని చెప్పారు. తెలుగుదేశంపై, చంద్రబాబుపై వ్యతిరేకంగా చెప్పండని క్షతగాత్రులకు కవర్లు ఇచ్చారు..అలా చేయడం వైసీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా? అని దుమ్మెత్తి పోశారు. ఐదేళ్లు పాలన చేసిన మీరు పరామర్శకు వెళ్లి ప్రభుత్వంపై, సీఎంపై ఆరోపణలు చేయమని డబ్బుల కవర్లు ఇచ్చి వస్తారా? మీ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడు ఈ పని చేశాడు.. ఇంకా ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకుని జగన్ ఇంకా ఊరేగుతున్నాడు..
ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమేరాల్లో వైసీపీ నేతలు ఇచ్చిన తెల్ల కవర్ల దృశ్యాలు రికార్డు అయ్యాయి..కవర్లు ఇచ్చి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పిన విషయాన్ని అక్కడ ఉన్న డాక్టర్లు, సిబ్బంది కూడా గుర్తించారు. ఏం జీవితాలు అయ్యా మీవి? ఈ మానవ సమాజంలో ఉండదగిన వాళ్లా మీరు? అని ధ్వజమెత్తారు. మృగాల మధ్య పెరగాల్సిన మీరు ఇవాళ రాష్ట్ర ప్రజల కర్మగాలి సమాజంలో తిరుగు తు న్నారు. ఓ పక్క చనిపోయిన వాళ్లు..మరో పక్క క్షతగాత్రులు ఉంటే ఆ శవాల మధ్య పేలాలు ఏరుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ నిన్న తిరుమల నెయ్యి గురించి మాట్లా డారు..గత ఐదేళ్ల పాలనలో అన్ని దేవాలయాల్లో తక్కువ క్వాలిటీ నాణ్యత వాడి ప్రసా దాలను అపవిత్రం చేశారు. నెయ్యి కల్తీ విషయాన్ని బయటపెట్టిందే మా ప్రభుత్వం.. దీనిపై జగన్ ఏం మాట్లాడుతాడు? ప్రసాదాలు, అన్న ప్రసాదాలు క్వాలిటీ ఎంత మెరుగుపరిచామో భక్తులను అడిగి జగన్ తెలుసుకోవాలని హితవుపలికారు. భక్తుల మనోభావాలు కాపాడుతాం..సామాన్య భక్తులకు శ్రీవారిని చేరువ చేస్తామని తెలిపారు.