- స్వాతంత్ర పోరాటాన్ని అవమానించడమే
- దేశానికి క్షమాపణ చెప్పాలి
- మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఐటీ మంత్రి నారా లోకేష్ మరోసారి విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేయకపోవడం జగన్ అహంకారానికి నిదర్శనం అని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఇది మన స్వాతంత్ర పోరాటాన్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకుగాను.. జగన్ భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఇన్సెల్ట్స్ నేషన్ అనే ట్యాగ్ లైన్‌లతో మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.