- వారిని రెన్యూవల్ చేయకుండా వదిలేశారు
- జీవో ఇచ్చి ఉంటే కొనసాగించి ఉండేవాళ్లం
- అయినా మే నెల వరకు వేతనాలు చెల్లించాం
- రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ లేదు
- మండలిలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
అమరావతి(చైతన్యరథం): వాలంటీర్లను రెన్యూవల్ చేయకుండా మోసం చేసింది జగనే.. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరూ పనిచేయట్లేదు..2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. బుధవారం శాస నమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటే కొనసాగించే వాళ్లం.. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తాం.. పిల్లాడికి పేరు పెట్టలేదు అంటే..లేని పిల్లాడికి పేరు ఎలా పెట్టాలి అన్నట్లుగా ఉంది వాలంటీర్ వ్యవస్థ తీరు అని వ్యాఖ్యా నించారు. వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వం ఎటువంటి జీవోలు ఇవ్వలేదు.. వాలంటీర్ల సర్వీసులను రెన్యూవల్ చేయలేదు.. ఎన్నికల ముందు వారితో ఫేక్ రాజీనా మాలు చేయించారు..
రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్లు లేరు.. 2023 ఆగస్టు వరకే వారిని కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు. 2023 సెప్టెంబరులో వాలంటీర్లను కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదు..గత ప్రభుత్వం జీవో ఇచ్చి ఉంటే కొనసాగించి వేతనాలు పెంచే వాళ్లమని వివరించారు. జీవోలు లేనందున ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పారు. వాలంటీర్ల ను కొనసాగించే అంశమై పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మే నెల వరకు మేము వాలంటీర్లకు వేతనాలు చెల్లించాం..వాలంటీర్ల వ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది..వాలంటీర్లు ఉంటే మేము కొనసాగించేవాళ్లమని మంత్రి సమాధానమిచ్చారు.