- మహిళల్ని అవమానించిన వారు..కాలగర్భంలో కలిసిపోతారు
- జగన్‌ది క్షమించరాని నేరం
- బే షరతుగా క్షమాపణ చెప్పాలి
- అమరావతిపై విషం చిమ్మితే తాడేపల్లి ప్యాలెస్‌పైనే పడుతుంది
- జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతల రాజధాని అది
- సాక్షి టీవీ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ మండిపాటు
అమరావతి (చైతన్యరథం): అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్‌పైనే పడుతుందని జగన్‌రెడ్డిని విద్య, ఐటీశాఖల మంత్రి లోకేష్ హెచ్చరించారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అంటూ మరోసారి స్పష్టం చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదు.. అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ స్పందించారు. మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ హెచ్చరించారు.
మహిళలను ఇంత ఘోరంగా మీ సాక్షి మీడియాలో ఇంత ఘోరంగా అవమానిస్తారా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం దిగజారుడుతనానికి పరాకాష్ట అంటూ ధ్వజమెత్తారు. ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుందన్నారు. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని తెలిపారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అంటూ మరోసారి స్పష్టం చేశారు. అది భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి అని అన్నారు. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి రాజధాని అని చెప్పుకొచ్చారు. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి అని అన్నారు. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుంది అంటూ ఫైర్ అయ్యారు. మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారన్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నామని తెలిపారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామన్నారు.
అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమన్నారు. మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, తామేమీ గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర మహిళలను అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తామన్నారు. ‘దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్ పనిపడుతుంది’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.










