అమరావతి (చైతన్యరథం): వివేకా హత్య కేసులో ఆయన కూతురు సునీతా రెడ్డి అడిగిన జగన్‌రెడ్డి సమాధానాలు చెప్ప గలరా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిలదీశారు. మంగళగిరి లోని తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాల యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలే ఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ 2019, మార్చి 14 అర్ధరాత్రి బాబాయిని హత్య చేసిందెవరో జగన్‌రెడ్డికి తెలుసు అని సునీత ఢల్లీిలో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారన్నారు. చెల్లెలు సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా? జగన్‌కు ఓటెయ్యద్దు, ఘోరంగా ఓడిరచం డి అని సునీత చెప్పడం కంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటుందా? గతంలో వివేకా హత్య గురించి టీడీపీ తరఫున మేము అనేక ప్రశ్నలడిగినా సమాధానం చెప్పలేదు.. ఇప్పుడు మీ చెల్లెలు సునీతకైనా సమాధానాలు చెప్పండి. బాబాయి హంత కులు ఎవరో మీకు ముందే తెలుసని కుండ బద్దలు కొట్టినట్లు సునీతమ్మ చెప్పింది. ఎంక్వైరీ చేస్తున్న అధికారులను, అప్రూవర్ గా మారిన దస్తగిరిని మీరు బెదిరించ లేదా? వారిపై కేసులు బనాయించలేదా? అవినాష్‌రెడ్డిపై అనుమానముందని సునీత చెబితే వదిలేయమని, లేకపోతే ఆయన బీజేపీలోకి పోతాడని సునీతతో జగన్ అన లేదా? జగనంటే నేనే.. నేనంటే జగన్ అనే సజ్జల ముఖంలో.. సునీత ప్రెస్‌మీట్ తరు వాత జీవకళ పోయి ప్రేతకళ కనిపిస్తోంది. అందుకే ఇదంతా చంద్రబాబు కుట్ర అంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ కు నైతిక విలువలు ఉంటే సునీత అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు చెప్పాలి. లేకుంటే వివేకా హంతకులు ఎవ రో ఆయనకు తెలిసినట్లుగానే భావించాల్సి ఉంటుందని వర్ల రామయ్య స్పష్టంచేశారు.