- చంద్రబాబు, లోకేష్‌పై సింగయ్య భార్యతో తప్పుడు ప్రచారం
- ఆమెతో అబద్ధాలు చెప్పించి కేసు నుంచి బయటపడాలని ఎత్తుగడ
- దళితుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ రెడ్డి
- చంద్రబాబు మాటలను వక్రీకరిస్తున్న వైసీపీ నేతలు
- లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు ధ్వజం
అమరావతి (చైతన్యరథం): దళితుల జీవితాలతో ఆడుకుంటూ జగన్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నాడని లిడ్‌క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. దళితుడైన సింగయ్యను జగన్ కాన్వాయ్‌తో ఢీ కొట్టి చంపాడు. అది రాష్ట్రమంతా చూసింది. కారుతో గుద్ది మానవత్వం లేకుండా వెళ్లిపోయాడు. వాళ్ల కార్యకర్తలు కూడా గాయపడ్డ సింగయ్యను లాగి ముళ్లపొద్దల్లో పాడేశారు. పోలీసులు వారి బాధ్యతగా మానవత్వం ప్రదర్శిస్తూ సింగయ్యను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు కాపాడే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు కూడా పార్టీతో సంబంధం లేకుండా తమ ఊరివాడు అనే అభిమానంతో కల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి పరామర్శించి డబ్బులు ఇచ్చి సాయం కావాలంటే చెప్పమని సింగయ్య కుటుంబ సభ్యులను కోరాడు. మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించి ఏదైనా సాయం కావాలంటే చెప్పండి చేస్తామని దళితుడైన మైనర్ బాబు అనే టీడీపీ నేతను సింగయ్య ఇంటికి పంపించారు. ఒకపక్క జగన్ మానవత్వం మరిచి కనిపిస్తే… మరోపక్క మానవత్వం ప్రదర్శించిన టీడీపీ, పోలీస్, వైద్య సిబ్బంది కనిపిస్తున్నారు. సింగయ్య మృతిపై జగన్ మాట్లాడకపోగా, ఈ కేసు తన మెడకు చుట్టుకోవడంతో ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో అని భయపడి కొత్త ఎత్తుగడ వేశాడు. ఏవరైనా చనిపోతే ఇంటికి వెళ్లి పరామర్శించడం కనీస నైతిక ధర్మం. కానీ జగన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు.
సింగయ్య భార్యను ఇంటికి పిలిపించుకొని చుట్టూ వైసీపీ నాయకులు చేరి ప్రెస్ మీట్ పెట్టించి… మంత్రి లోకేష్ బెదిరించారని చెప్పించారు. అంబులెన్స్‌లో చంపేశారని చెప్పు, పోలీసులు చంపేశారని చెప్పు అంటూ సిగ్గు, లజ్జా విడిచి చెప్పించినందుకు జగన్ సిగ్గుపడాలి. జగన్‌కు ఇలాంటి లుచ్ఛా రాజకీయాలు అలవాటే. ఒక దళిత వ్యక్తిని కారుతో గుద్ది చంపడమే కాకుండా కుక్కపిల్లలా లాగేశారని ఎంతో ఆవేదనతో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధపడితే… దళితులను కుక్కలు అంటున్నాడని వైసీపీ నేతలు నీచపు రాజకీయాలు చేస్తున్నారు. సొంత బాబాయ్‌ని చంపి సీఎం చంద్రబాబే చంపేశాడని ప్రచారం చేశాడు. ఇలాంటి నీచుడితో రాజకీయాలు చేయాల్సిన దౌర్భాగ్యం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు వచ్చినందుకు చాలా బాధపడుతున్నాం. సింగయ్య భార్యతో ఈ విధంగా చెప్పిండచం ద్వారా రానున్న రోజుల్లో కోర్టులో ఆమెను ప్రవేశపెట్టి కేసు నుంచి బయటపడాలనేది జగన్ రెడ్డి ఎత్తుగడ. టీడీపీకి దళితులంటే ప్రేమ ఉంది. దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. రాష్ట్రంలోని దళితులంతా అప్రమత్తంగా ఉండాలి. మన ప్రాణాలు, మానాలతో ఆడేందుకు జగన్ చూస్తున్నాడు. జగన్ గాలి కూడా మన ఇంటి ఛాయలకు రాకుండా కళ్లాపి చల్లాలి. జగన్ రెడ్డి దళితుల జీవితాలతో రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి దళితుడిపైనా ఉందని మాణిక్యరావు హితవు పలికారు.