- దోపిడీలో ఆయనను మించిన వ్యక్తి లేడని ఎఫ్‌బీఐ పేర్కొంది
- విద్యుత్ కొనుగోళ్లలో ఒప్పందాలు, లంచాలను సంస్థ గుర్తించింది
- న్యూయార్క్ గ్లామర్ బాయ్ చర్యలతో రాష్ట్ర ప్రజలపై పెనుభారం
- జ్యూరీ ట్రైల్ బై డిమాండ్ ప్రకారం అక్కడ ఏడాదిలో తీర్పు వస్తుంది
- అక్కడ జైలుకు భోజనం కుదరదు..బ్రెడ్ ముక్కలు తినడం నేర్చుకోండి
- చంద్రబాబుకు విజయసాయి, శ్రీకాంత్, అజేయకల్లం క్షమాపణ చెప్పాలి
- అనంతపురం సోలార్ పార్క్ పీపీఏలో అన్నింటా తక్కువ రేటుకే ఒప్పందం
- అందులో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి…కర పత్రికలో తప్పుడు ప్రచారం
- అక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): అవినీతిలో జగన్‌రెడ్డికి మించిన రారాజు లేడు..విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో జగన్‌రెడ్డికి రూ.1,750 కోట్ల లంచం ముట్టినట్లు అమెరికా ఎఫ్‌బీఐ తేల్చిందని అక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేఖరుల సమా వేశంలో జగన్‌రెడ్డి అవినీతిని ఎండగట్టారు. ముడుపుల కోసం జగన్‌రెడ్డి రహస్య ఒప్పం దాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. యునైటెడ్ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్ట్రన్ డిస్ట్రిక్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్‌లో ఫైల్ అయిన కేస్1-24సీఐవీ8080లో ఏపీ ప్రభుత్వంలో పెద్దపెద్ద బడా వ్యక్తులు, ఐఏఎస్ అధికారుల పేర్లు ఎఫ్‌బీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.. విద్యుత్ కొను గోలులో అదానీ సంస్థ నుంచి జగన్‌రెడ్డికి రూ.1,750 కోట్లు లంచం ముట్టిందని అక్కడి ఎఫ్‌బీఐ తేల్చింది.. జూన్ 2020లో 90 రోజుల్లో డిస్కంలతో పీపీఏ డిస్ట్రిబ్యూషన్ ఒప్పం దం చేసుకోవాలని సెకీతో రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటే 18 నెలలు అయినా జగన్‌రెడ్డి ఎందుకు చేసుకోలేదు? అని ప్రశ్నించారు.
ముడుపుల కోసమే రహస్య ఒప్పందాలు
తమ దగ్గర 9 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉంది కొనుక్కోండని రాష్ట్ర ప్రభుత్వాల ను సెకీ కోరగా మాకొద్దంటే మాకొద్దు..ఆ రేటుకు కొనలేము..మీకు దండం పెడతామని అన్ని రాష్ట్రాల డిస్కంలు జం కాయి..కానీ జగన్‌రెడ్డి మాత్రం మార్కెట్ రేటు కంటే ఎక్కువ రేటైనా సరే మాకు కావా లంటే మాకు కావాలని ఎగబడ్డాడు.. ఇదే విషయాన్ని ఎఫ్‌బీఐ తేల్చింది. అన్ని రాష్ట్రాలు తమ వద్ద పవర్ కొనుగోలుకు ముందుకురావడం లేదని ఆగస్టు 2021లో అదానీ వచ్చి జగన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్‌లో కలిశారు. జగన్‌రెడ్డికి లంచం డిమాండ్ చేయడంతో ఆ కంపెనీ ఒప్పుకుంది.. దాంతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫైళ్లు అర్థరాత్రులు కూడా ముందుకు కదిలాయి. ఐఏఎస్ అధికారులు కూడా నిద్రపోకుండా అర్థరాత్రి ఒంటి గంటకు అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తలుపుకొట్టారు. సంత కం పెట్టమంటే ఇందులో ఏదో లొసుగుందని గుర్తించి జాగ్రత్తపడి ఆయన పెట్టనని తప్పుకున్నారు. దాంతో మంత్రి ప్రమేయం లేకుండానే సెకీతో అగ్రిమెంట్ ఫైళ్లను క్యాబినెట్‌లో పెట్టి ఆమోదం తెలిపారని వివరించారు.
ఎఫ్‌బీఐ చార్జ్‌షీట్‌లో జగన్‌రెడ్డి బాగోతం
ఒకసారి ఎఫ్‌బీఐ చార్జ్‌షీట్‌లో ఐదు ఫారాలు చదివితే చాలు జగన్ తన జీవితంలో అమెరికా కేసుల నుంచి బయటపడలేడు. 80వ పాయింట్‌లో 2021 ఆగస్టులో జగన్ నిర్వహించిన రహస్య భేటీ, 81వ పాయింట్‌లో 7,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కొనుగోలుకు నాటి జగన్ ప్రభుత్వానికి చెల్లిస్తానన్న లంచాల వివరాలు కూడా ఆధారా లతో సహా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకసారి 82వ పాయింట్ చూస్తే జగన్ ప్రభు త్వానికి ఇచ్చిన లంచం ఒడిశా విద్యుత్ సరఫరా ఒప్పందం కంటే పెద్దదని.. 200 మిలియన్ డాలర్లు(రూ.1,750 కోట్లు) నేరం ఉంటుందని ఎఫ్‌బీఐ నిర్ధారించింది. 83వ పాయింట్‌లో జగన్‌మోహన్‌రెడ్డితో విద్యుత్ కంపెనీ సమావేశాలు కేవలం లంచాలు చెల్లించడం కోసమే అంతర్గతంగా జరిగాయని ఆ తర్వాతే విద్యుత్ కొనుగోలుకు అంగీక రించారని స్పష్టం చేసింది. 84వ పాయింట్‌లో ఇదే తాడేపల్లి ప్యాలెస్‌కు ముడుపులు చేరిన తర్వాతే మొదటి దశలో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించుకోవడానికి క్యాబినెట్‌లో జగన్ ప్రభుత్వం అంగీకరించిందని కూడా ఎఫ్‌బీఐ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
జగన్‌రెడ్డి దోపిడీ ఇంటర్నేషనల్..అజేయకల్లం క్షమాపణ చెప్పాలి
లంచం తీసుకోవడం గొప్ప కాదు.. కానీ అమెరికా కోర్టులో జగన్‌రెడ్డి పేరు రావడం గొప్పతనం. న్యూయార్క్ గ్లామర్ బాయ్‌గా ఆయన నేడు గుర్తింపుపొందారు. ఒడిస్సాతో కుదుర్చుకున్న ఒప్పందానికి తీసుకున్న లంచం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న లంచం ఎక్కువని ఎఫ్‌బీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అవినీతిలో జగన్‌రెడ్డికి మించిన రారా జు లేడు. 200 మిలియన్ డాలర్ల లంచం ముట్టిన తర్వాత ఫైళ్లు చాలా వేగంగా కదిలా యని ఎఫ్‌బీఐ గుర్తించింది. విద్యుత్ కొనుగోలులో చంద్రబాబు కుదుర్చుకున్న పీపీఏలు తప్పని జూలై 2019లో అజేయకల్లంరెడ్డి, శ్రీకాంత్‌తో సహా మరో ఐఏఎస్ అధికారులు ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు తప్పు చేశాడని చెప్పారు. ఇప్పుడు ఎఫ్‌బీఐ పొందుపర్చిన చార్జ్‌షీట్‌లో జగన్‌రెడ్డి అవినీతి గురించి చదువుకుని మీరు ప్రేమించిన జగన్‌రెడ్డి దొంగ, దోపిడీదారుడు అని ఒప్పుకుని చంద్రబాబును క్షమాపణ కోరాలి. ఇక్కడ సీబీఐ, ఈడీ కేసులు 14-18 సంవత్సరాలు నడిపించినట్లు ఆ కేసును కూడా నడిపించవచ్చని అనుకోవద్దు జగన్‌రెడ్డి. జ్యూరీ ట్రైల్ బై డిమాండ్ ప్రకారం ఏడాదిలో ఈ కేసులో జడ్జిమెంట్ వస్తుంది. అది కూడా ఇక్కడిలా జడ్జీలు కాదు జడ్జిమెంట్ ఇచ్చేది.. ప్రజల్లో నుంచి కొంతమందిని ఎంచుకుని వారితో జడ్జిమెంట్ ఇప్పిస్తారు. ఏడాదిలో జగన్ బాగోతం మొత్తం బయటపడుతుంది. జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి..ఇలా ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందో వారెవరూ తప్పించుకోలేరు. ఇక్కడిలా జైలుకు భారతిరెడ్డి క్యారేజీ తీసుకురాలేదు..కాబట్టి బ్రెడ్ ముక్కలు తినడం నేర్చుకోండి అని సూచించారు.
మాది అంతా ఓపెన్ బుక్..మీది సీక్రెట్ ఫైల్స్
నాడు చంద్రబాబు ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.4.43కు కొన్నాడని, దొంగ అని అవినీతి పత్రిక సాక్షి అంటోంది. నాడు తెలంగాణ ఎన్టీపీఎస్ రూ.4.66కు కొనింది అంటే కేసీఆర్ కూడా దొంగేనా? మన రాష్ట్రమే కాదు ఆ రోజు భారతదేశంలో ఉన్న మార్కెట్ రేటు రూ.4.43 నుంచి రూ.4.67 వరకు వ్యత్యాసముంది. అందుకే మిగిలిన రాష్ట్రాలకంటే మనమే తక్కువ రేటుకు కొన్నాం. అనంతపురం సోలార్ పార్క్‌కు చేసిన పీపీఏలో అన్ని రాష్ట్రాలు కుదుర్చుకున్న రేటు కంటే తక్కువ రేటుకు చంద్రబాబు కుదు ర్చుకున్నారు. ఇందులో ఏదో తప్పు జరిగిందని అవినీతి పత్రిక కథనాలు రాసింది. నిజం గా తప్పు జరిగుంటే మీరు ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకు విచారణ జరిపిం చలేదు అజేయకల్లంరెడ్డి? ఎందుకు సీబీఐ, ఎఫ్‌బీఐలు మా మీదకు రాలేదు? ఇందులో ఎక్కడ తప్పు జరిగిందో అజేయకల్లంరెడ్డి, శ్రీకాంత్‌లు సమాధానం చెప్పాలని ప్రశ్నించా రు.
మా హయాంలో ప్రతీ ఒప్పందాలు, జీవోలు వెబ్‌సైట్‌లో ఉండేవి. చంద్రబాబు ఎవరిని కలిసినా, ఎవరు చంద్రబాబును కలిసినా ఎందుకు కలిశారు..ఏమిటనేది అంతా ఓపెన్ బుక్. సీఎస్ నుంచి ఆఫీస్ బాయ్‌ల వరకు అందరూ మీటింగ్ వద్దే ఉండేవారు. జగన్‌రెడ్డిలా దొంగ జీవోలు, దొంగ మీటింగ్‌లు చంద్రబాబు చేయలేదు. కానీ జగన్‌రెడ్డి ఐదేళ్లలో ఎవరిని కలిసినా ఆయన, సతీమణి భారతీరెడ్డి తప్పించి ఎవరూ ఉండేవారు కారు. దీని వెనుకున్న అంతర్యమేమిటో ఎవరికి తెలియదు. వీటిన్నింటినీ ఎఫ్‌బీఐ పసి గట్టింది. కొదిరోజుల్లోనే అన్ని ఆధారాలతో కోర్టులో ఎఫ్‌బీఐ సమర్పించనుందని హెచ్చ రించారు.
ఆదాయ వనరుగా నిలిచే కంపెనీలను తరిమేశారు
2021లో 6.4 గిగావాట్ల సోలార్ పవర్‌కు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ టెండర్‌కు పిలిచింది. అదానీ, షిర్డీసాయి, టారెంట్ వంటి నాలుగు కంపెనీలు టెండర్లకు వచ్చాయి. మేము కూడా టెండర్ ప్రక్రియలో పాల్గొంటామని టాటా కంపెనీ వచ్చింది. టాటా కంపెనీ ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వలేదు. వారు లంచాలు ఇచ్చా రంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరని జగన్‌రెడ్డి ప్రభుత్వం టెండర్లలో టాటా కంపెనీ పాల్గొనేందుకు ససేమిరా అంది. కొన్ని అభ్యంతరాలను తెలపగా ఈ టెండర్‌ను జగన్ రెడ్డి రద్దు చేసింది. టాటా కంపెనీ పెట్టిన అభ్యంతరాలు సరైనవే అని కిందస్థాయి కోర్టు తీర్పును కూడా ఇచ్చింది. నేడు ఈ కేసు హైకోర్టులో ఉంది. మన రాష్ట్రానికి రావాల్సిన 6,400 మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును జగన్‌రెడ్డి నాశనం చేశాడు.
2014లో 5 పీపీఏలపై చంద్రబాబు సంతకం చేశారు. కర్నూలు, అనంతపురంలో ప్లాంట్లు మొదలయ్యాయి. చంద్రబాబు విజనరీని మెచ్చి మేము వస్తామంటూ ఎన్నో సాఫ్ట్ బ్యాంకు సంస్థలు మన రాష్ట్రానికి క్యూ కట్టాయి. జగన్‌రెడ్డి సీఎం అయ్యాక కక్షగట్టి నాడు చంద్రబాబు కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేస్తామనడంతో ఆ సంస్థలన్నీ హైకోర్టుకు వెళ్లాయి. తమ కార్యకలాపాలను నిలిపేసి వెనక్కి వెళ్లిపోయా యి. ప్రపంచంలోనే నెంబర్ 1 దిగ్గజ జపాన్ సంస్థ ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ కంపెనీ ని సైతం జగన్‌రెడ్డి ప్రభుత్వం వెనక్కి పంపించింది. 3.11.2023న మరలా తిరిగి వచ్చేయండని ఆ కంపెనీలన్నింటికీ జగన్‌రెడ్డి లేఖలు రాశాడు. ఆ రోజే గనుక జగన్ రెడ్డి ఆ సంస్థలను వేధించకుండా ఆపి ఉంటే 6 వేల నుంచి 10 వేల మెగా వాట్లు మన రాష్ట్రంలో ఉండేవి. నేడు మన రాష్ట్రానికి మణిహారంగా నిలిచేవి. ఒక మెగా వాట్‌కి రూ.14 లక్షల జీఎస్టీ వచ్చేది. అందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ది. జగన్‌రెడ్డి వల్ల రూ.1,260 కోట్లు నష్టం వాటిల్లింది. ప్రతీ మెగావాట్‌కు రూ.20 లక్షలు గ్రాంట్‌ను రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది. దాంతో రూ.1,800 కోట్లు నష్టం వాటిల్లింది. లంచమే ముఖ్యమనుకున్న జగన్ రెడ్డి వల్ల మొత్తంగా రూ.3,060 కోట్లు నష్టం వచ్చిందని ధ్వజమెత్తారు.