- మాండ్ తిరస్కరణ..41ఎ నోటీసులివ్వాలని ఆదేశం
- పాల్గొనేవారు ఐడి కార్డులు తీసుకోవాలన్న పోలీసులు
- పిసిసి చీఫ్ శైలజానాథ్, బిజెపినేత కన్నా సంఫీుభావం
- రెండోరోజు విజయవంతంగా కొనసాగిన పాదయాత్ర
అమరావతి: అమరావతి నుంచి అరసవిల్లి రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభమై 24గంటలు గడవక ముందే ఉద్యమాన్ని అణగదొక్కేందుకు జగన్‌రెడ్డి సర్కారు కుట్రలు మొదలయ్యాయి. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు జగన్‌రెడ్డి పన్నిన కుట్ర బెడిసికొట్టింది. రాజధాని భూముల కేసులో ఇద్దరిని సీఐడీ అధికారులు విజయవాడ అ.ని.శా కోర్టులో హాజరుపర్చగా తప్పుల తడక రిమాండ్ రిపోర్టును చూసిన జడ్జి నిందితుల రిమాండ్‌ను తిరస్కరించారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్‌ను సీఐడీ అధికారులు జడ్జి ఎదుట హాజరు పర్చారు. ఇద్దరి రిమాండ్‌ను న్యాయస్థానం తిరస్కరిం చింది. సీఐడీ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో కొన్ని సెక్షన్లు కేసుకు వర్తించవన్న జడ్జి..41ఏ సీఆర్‌పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించింది.
5గురు అరెస్టు.. ఇద్దరే కోర్టులో హాజరు
ఇదిలావుండగా రాజధాని భూముల్లో కుంభకోణమంటూ గతంలో తప్పుడుకేసు నమోదు చేసిన సిఐడి తప్పుల తడక అభియోగాలతో మొత్తం అయిదుగర్ని అరెస్టుచేసి మంగళవారం వ్యూహాత్మకంగా ఇద్దరినీ మాత్రమే కోర్టుకు హాజరుపర్చింది. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్‌ల రిమాండ్‌ను విజయవాడ కోర్టు జడ్జి తిరస్కరించారు. చిక్కాల విజయసారధి, బడే ఆంజనే యులు, కొట్టి దొరబాబులను కూడా మంగళవారం ఉదయం సిఐడి అరెస్టు చేసినప్పటికీ కోర్టులో ప్రవేశ పెట్టలేదు.(అయితేవీరిని విశాఖలో అరెస్టుచేసి విజయ వాడ తీసుకొచ్చేసరికి ఆలస్యమైనందున హాజరుపర్చలేదని సిఐడి వర్గాలు చెబుతున్నాయి). మొత్తంగా 1100ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను చేర్చింది. బంధువులు,పరిచయస్తుల పేరుతోనారాయణ బినామీ లావాదేవీలు నిర్వహించారని, వేర్వేరు సర్వే నంబర్లతో 89.8ఎకరాల భూమిని అక్రమంగా నారాయణ కొనుగోలు చేశారని ఆరోపించింది. నారాయణ, రామకృష్ణ హౌసింగ్ ప్రై.లి. మధ్య రూ.15కోట్ల లావాదేవీల జరిగాయంటూ పసలేని అభియోగాలతో చార్జిషీటు దాఖలు చేసింది.