- లోక్‌సభ, రాజ్యసభలో డబుల్ గేమ్
- వక్ఫ్ బిల్లుపై వైసీపీ డ్రామాలు
- పార్టీలో ఉన్న వారు బయటకురావాలి
- మైనార్టీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం
- సీడాప్ చైర్మన్ దీపక్‌రెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): మైనార్టీల అభ్యున్నతి కోసం టీడీపీ పనిచేస్తుంటే.. రాజకీ య లబ్ధి కోసం అసత్యాలు, వక్ఫ్ బిల్లుపై తప్పుడు ప్రచారాన్ని చేస్తూ వైసీపీ వీధి నాటకా లు ఆడుతోందని సీడాప్ చైర్మన్ దీపక్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుందని, మైనార్టీలకు వాస్తవాలు చెప్పేందుకే ఈ ప్రెస్‌మీట్ నిర్వ హిస్తున్నట్లు చెప్పారు. వక్ఫ్ బిల్లు పార్లమెంట్‌లో పెట్టబోతున్నామని చెప్పిన రోజు అర్ధ రాత్రి ఒంటి గంట వరకు సీఎం చంద్రబాబు, లోకేష్ ఎంపీలతో మాట్లాడారు. మైనార్టీల హక్కుల కోసం కృషి చేయాలన్న అంశంపై చర్చించారు. నేషనల్ మీడియా అనేక సార్లు ఫోన్ చేశారు. కచ్చితంగా బిల్లులో మూడు సవరణలు చేస్తేనే సపోర్ట్ చేస్తామని చెప్పారు. మైనార్టీలకు వ్యతిరేకంగా ఈ బిల్లు ఉంటే మద్దతు ఇచ్చేది లేదని తెలిపారు. టీడీపీ సూచించిన విధంగా మూడు సవరణలు చేయడం వల్లే వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ లోక్‌సభ, రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసిందని తెలిపారు. చెప్పిన విధంగా ముస్లింలకు సంబంధించిన సవరణలను ప్రతిపాదించాం. జేపీసీకి పంపించి ఓకే చేయిం చాం. బిల్లులో సవరణలు చేయాలని మొట్టమొదట టీడీపీనే ప్రతిపాదించింది. వక్ఫ్ బిల్లుపై జేపీసీ 38 సార్లు సమావేశం నిర్వహించి 97 లక్షల అప్లికేషన్లు తీసుకుంది. 25 స్టేట్ వక్క్ బోర్డులతో మాట్లాడిరది. టీడీపీ ఎంపీలు మూడు ముఖ్యమైన సవరణలను ప్రతిపాదించాం.
100 శాతం సమావేశాల్లో టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. వైసీపీ ఎంపీలు మాత్రం 47 శాతం కూడా సమావేశంలో పాల్గొనలేదు. ముస్లింలకు సంబంధించిన ఎటువంటి ప్రతిపాదనలు వక్ఫ్ బిల్లులో చేర్చమని చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ భూములు అన్ని యథాస్థితిలోనే ఉంటాయి. కలెక్టర్ కన్నా పెద్ద ర్యాంకు ఉన్న అధికారిని నియమించి వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాం. ముస్లిమేతరులకు వక్ఫ్ బిల్లులో చోటు ఇవ్వకూ డదని ప్రతిపాదించి అంగీకరించేలా చేశాం. వైసీపీ మైనార్టీలను నమ్మించి మోసం చేసిం ది. వైసీపీ చేసిన మోసాన్ని ముస్లిం సోదరులు గమనించాలని కోరారు. గతంలో సీఏఏ వచ్చినప్పుడు జగన్ తప్పుడు ప్రచారం చేశాడు. తర్వాత పార్లమెంట్‌లో వెళ్లి సీఏఏకు అనుకూలంగా ఓటు వేశారు. ఈసారి నమ్మకద్రోహం చేశాడు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై మైనార్టీలకు వెన్నుపొటు పొడిచారు. వ్యతిరేకంగా ఓటు వేస్తామని అనుకూలంగా ఓటు వేశారు. ఎటువంటి సవరణలు కోరలేదనే విషయం మైనార్టీలు గమనించాలని కోరారు. కొంతమంది ఎంపీలు వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారని వైసీపీ ఒప్పుకుంది. ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. వైసీపీపై మైనార్టీలు తిరుగుబాటు చేయాలి..వైసీపీలో ఉన్న మైనార్టీలు ఆ పార్టీని వీడాలి. 2006లో సచార్ కమిటీ 12 వేల కోట్ల ఆదాయం వక్ఫ్ ఆస్తుల ద్వారా వస్తుందని తెలిపింది. ఇప్పు డు రూ.55 నుంచి రూ.60 వేల కోట్లు వక్ఫ్ బోర్డు ద్వారా రావాల్సింది ఉంది. కానీ రాలేదు..
మైనార్టీలు జగన్‌రెడ్డిని ప్రశ్నించాలి. ముస్లింలకు తెలుగుదేశం పార్టీ భరోసా ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 65 వేల వక్ఫ్ ఆస్తుల్లో 50 శాతం భూములు వైసీపీ హయాం లో కబ్జాకు గురయ్యాయి. దీనికి ఎవరు జవాబు చెబుతారని ప్రశ్నిస్తున్నాం. మైనార్టీలపై వైసీపీకి చిత్తశుద్ధి లేదు..టీడీపీ వారి అభివృద్ధి కోసం పనిచేస్తోంది. బడ్జెట్‌లో మైనార్టీలకు రూ.5,434 కోట్లు కేటాయించాం. పాత వక్ఫ్ బోర్డు తప్పుల తడకగా ఉంటే జీఓ 43 రద్దు చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేశాం. 100 రోజుల్లో 162 కేసులు పరిష్కరించాం. గత 40 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో దేశంలోనే తొలిసారి ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్‌ను 1985లో ఏర్పాటు చేశాం. ఉర్దూ భాషను రెండో భాషగా గుర్తించాం. హైదరాబాద్‌లో ఉర్దూ వర్సిటీని నిర్మించాం. విభజిత రాష్ట్రంలో కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. రూ.100 కోట్లు కేటాయించాం. సుమారుగా 7,500 మదర్సాలను కట్టించాం. 2014 నుంచి 2019లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేశాం. 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం యువతకు విదేశీ విద్యా పథకం ఇచ్చాం. ఇమామ్ మౌజమ్‌లకు రూ.45 కోట్లు విడుదల చేశాం. వైసీపీలా మాటలు చెప్పే పార్టీ తమది కాదని, చేతల్లో చేసి చూపిస్తున్నామని హితవుపలికారు. చంద్రబాబు ముస్లింల అభ్యున్నతి కోసం వారి సమాజ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. వైసీపీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని మైనార్టీలు గుర్తించారు. చంద్రబాబు, లోకేష్ వారికి అండగా ఉన్నా రు..ధైర్యంగా ఉండాలని కోరారు. వక్ఫ్ బిల్లుపై ఏ విధమైన భయాలు అవసరం లేదని, మైనార్టీల హక్కులను కాపాడతారని స్పష్టం చేశారు.