- లబ్ధిదారుల ఖాతాల్లో వేయాల్సిన డబ్బును బినామీలకు సమర్పించే యత్నం
- ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పంచాయతీలకు వేల కోట్ల బకాయిలు
- అయినా అప్పులు తెచ్చిమరీ సొంత మనుషులకు దోచిపెట్టే కుట్ర
- లబ్ధిదారులకు చెల్లించేలా సీఎస్ ను ఆదేశించండి
అమరావతి(చైతన్యరథం): సీఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధన లకు విరుద్ధంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్ధమైం దని.. దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వివిధ పథకాల లబ్దిదారులకు చెందాల్సిన నిధులను సీఎం జగన్ రెడ్డి సొంత కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సిద్ధమయ్యారని, దీనిని అడ్డుకోవాలంటూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీరు మంగళవారం చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కు కొన్ని నెలల ముందు డీబీటీ పథకాలకు సీఎం అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్దిదారుల ఖాతాల్లో నగదు జను కాలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్లుల విడుదల జరగబోతోంది. కొద్దిరోజుల క్రితం ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్ల కు, పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారు.
ఎన్నికల కోడ్ కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఎన్నికల కోడ్ కు ముందే బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన నిధులు ఎందుకు జమ. కాలేదో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రోజు వారీ అప్పుల పైనే ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్న విషయం మీకు తెలిసిందే. ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంకు, బ్యాంకుల నుండి తరచూ ఓవర్ డ్రాఫ్ట్లకు వెళ్లింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టింది. ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించక పోవడంతో సేవలు నిలిపేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నా యి. ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్ కి చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లిం చింది. రుణాల కింద రూ.4 వేల కోట్లు, బాండ్ల ద్వారా మరో రూ.7000కోట్లు ప్రభుత్వం సమీకరించింది.
ఈ నిధులన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా అను కూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్ని స్తోంది. రాజకీయ స్వార్థం కోసం చేసే ఇటువంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వ కుటిల యత్నాలను వెంటనే అరికట్టేందుకు సీఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా మీరు ప్రభుత్వా నికి ఆదేశాలు ఇవ్వాలి. లబ్దిదారులకు మేలు చేసే డీబీపీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని గవర్నర్ను చంద్రవాబు కోరారు. గవర్నర్కు రాసిన లేఖ ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆర్ధిక ముఖ్య కార్యదర్శికి కూడా చంద్రబాబు పంపించారు.