- ఆయనకు ఉచ్చు బిగుసుకునేసరికి కొత్త నాటకాలా?
- విషయం పక్కదారి పట్టించేందుకు చిన్నిపై ఆరోపణలు
- నాడు ఎంపీగా ఉంటూనే జగన్‌కు కోవర్టుగా పనిచేశావ్
- దమ్ముంటే ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలి
- నిన్ను వదలను..నీ చిట్టా మొత్తం బయటపెడతా
- బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలనే మోసగించావు
- నీ అవినీతిపై ఈడీ, సీబీఐకు లేఖ రాస్తున్నా
- కేశినేని నానిఫై టీడీపీ నేత బుద్దా వెంకన్న ధ్వజం
విజయవాడ(చైతన్యరథం): కేశినేని నానిఫై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యా రు. చంద్రబాబు రాజకీయ భిక్ష పెడితే నాడు విశ్వాసం లేకుండా ఆయనపైనే విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ ఎంపీగా ఉంటూనే..జగన్‌కు కోవర్టుగా పనిచేశారు. 2019-24 వరకు చంద్రబాబు, లోకేష్, నేను, ఇతర నేతలు మద్యం కుంభకోణంపై గళ మెత్తాం. జగన్, అండ్ కో మద్యం మాఫియాపై పోరాటాలు చేశాం. అవినీతి సొమ్ము మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతుందని ఆ రోజే చెప్పాం. అయినా నాడు జగన్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియాపై సిట్ విచారణ చేపట్టిందన్నారు. కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సూత్రధారిగా మొత్తం వ్యవహారం నడిచిందని సిట్ నిర్ధారించింది. ఇప్పుడు జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఏర్ప డిరది. దీంతో విషయం పక్కదారి పట్టించేందుకు జగన్ కొత్త నాటకాలు ప్రారంభించా డు. కేశినేని నానిని అడ్డం పెట్టుకుని ఎంపీ కేశినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు హడావుడి చేస్తూ నాటకానికి తెరలేపారు. నాని ఆడుతున్న నాటకానికి ముగింపు పలికేలా చేస్తామని హెచ్చరించారు.
అప్పులు చెల్లించకుండా ఎగవేశావ్..నువ్వా మాట్లాడేది
విజయవాడలో పెద్ద హోటల్ కడతామని ఎనిమిదిన్నర కోట్లు బ్యాంకుల నాని, అతని భార్య కలిసి అప్పు తీసుకున్నారు. కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న రికార్డులు కూడా చూపిస్తున్నాం. ఈ ఆధారాలను అధికారులకు ఇచ్చి విచారణ చేయాలని ఈడీని కోరుతున్నాం. తర్వాత కేశినేని హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరును కేశినేని హారిక పేరుతో మార్చారు. ఇందులో కూడా డైరెక్టర్లు కేశినేని నాని, పావని, హేమా చౌదరి డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ తర్వాత వీరంతా డైరెక్టర్లుగా తప్పుకుని అతని దగ్గర పనిచేసే రాము, హేమంత్‌లను డైరెక్టర్లుగా చేశారు. ఇప్పుడు ఆ హోటల్స్ మీద వచ్చే ఆదాయాన్ని కేశినేని నాని తింటున్నాడు. బ్యాంకుకు తీసుకున్న అప్పు మాత్రం చెల్లించకుండా తప్పుకుంటున్నాడు. నాని కుటుంబసభ్యులు బయటకు వెళ్లి జీతగాళ్లను డైరెక్టర్లుగా ఎందుకు చేశారో నాని చెప్పాలని ప్రశ్నించారు. జగన్‌ను కేసు నుంచి బయ టపడేయాలనే నాని అబద్ధాలు చెబుతున్నారు. ఈడీకి కేశినేని చిన్ని పేరు చెప్పడం ద్వారా అసలు విషయాన్ని దారి మళ్లించాలని చూస్తున్నారు. బ్యాంకు రుణం తీసుకుని రూపాయి కట్టకుండా మోసం చేసిన నువ్వా విలువల గురించి మాట్లాడేదని ప్రశ్నించారు.
నీ అక్రమాలపై ఈడీకి లేఖ రాస్తున్నాను
కేశినేని చిన్నికి లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేదనేది వాస్తవం. ఇప్పుడు లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతున్న నాని 2019-24 మధ్య ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించా రు. చిన్ని తన వ్యాపారాలకు సంబంధించి ప్రజల నుంచి రెండు శాతం జీఎస్టీ వసూలు చేస్తూ ప్రభుత్వానికి ఐదు శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. అదీ చిన్ని నిజాయితీ. కేశినేని నాని వంటి విషపురుగు పార్టీలో ఉండకూడదనే చంద్రబాబు దూరం పెట్టారు. నేడు సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా బురద జల్లడం వైసీపీకి ఆలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంలో కేసిరెడ్డి, కేశినేని చిన్నికి సంబంధం ఉందని ఈడీకి ఇచ్చిన లేఖలో నాని రాయడం ఆయన కొత్త నాటకానికి, అబద్ధాలకు నిదర్శనమన్నారు. లిక్కర్ స్కాం వ్యవహా రం నడిపిన జగన్ పేరు ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అంటే కేసిరెడ్డి, ఇతర నిందితులకు శిక్ష పడినా పర్లేదు.. జగన్‌ను కేసు నుంచి కాపాడాలనే చేస్తున్నారా? అని ప్రశ్నించారు. జగన్ వెనక ఉండి కేశినేని నానితో నాటకాలు ఆడిస్తున్నారనే కదా అర్థం. త్వరలోనే నాని చేసిన ఒక్కొక్క మోసాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తాం. దొంగ డాక్యుమెంట్లు, దొంగ అగ్రిమెంట్లు చేసుకుని బ్యాంకులనే మోసం చేసిన చరిత్ర. పైనాన్స్ కంపెనీల నుంచి అప్పులు తీసుకుని బస్సులు కొన్న చరిత్ర. వాటిని చెల్లించకుండా కేశినే ని ట్రావెల్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి ఫైనాన్స్ సంస్థలను మోసం చేశాడని ధ్వజ మెత్తారు.
వదిలేది లేదు..చిట్టా మొత్తం బయటపెడతా
కేశినేని నాని గుర్తు పెట్టుకో.. ఈడీ, సీబీఐకి నీ అవినీతి గురించి లేఖలు రాసి ఆధా రాలు అందిస్తాను. ఇటువంటి మోసగాళ్లను ప్రజలు కూడా నమ్మవద్దని కోరుతున్నా. నేను చెప్పేది ఆరోపణలు, విమర్శలు కాదు..వాస్తవాలని స్పష్టం చేశారు. ఆయన చేసిన ఆరోప ణలకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టి మాట్లాడాలని హితవుపలికారు. విష యం పక్కదారి పట్టాలనో.. జగన్‌ను కేసు నుంచి తప్పించేలా ప్రజలను మాయ చేయా లనో ఆరోపణలు చేస్తున్నాడు. మద్యం కుంభకోణం మొత్తం జగన్ ఆదేశాలతో జరిగిం దన్నది జగమెరిగిన సత్యం. జగన్‌ను కాపాడటమే లక్ష్యంగా నాని పని చేస్తున్నారు.. ఆధారాలు లేవు కాబట్టే ఆరోపణలకు పరిమితం అయ్యారు. ఒకే నెంబర్‌పై పది బస్సుల ను నడిపిన చరిత్ర కేశినేని నానిది. ఇటువంటివి చంద్రబాబు సహించరు కాబట్టే ఆనాడు అధికారు లు చర్యలు తీసుకున్నారు. అదే బస్సులు ఆపేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చిన నాని తర్వాత అప్పులు మొత్తం ఎగ్గొట్టాడు. ఈ వ్యవహారంపైనా ఈడీ, సీబీఐ కూడా స్పందించి విచా రణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.