డోన్: జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెంచిన పన్నులను నిరసిస్తూ డోన్ పట్టణంలోని 32వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే -బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. నియంత్రణ లేని నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల సామాన్యుడి బతుకు భారమైందని వివరించారు. పన్నుల పేరుతో సామాన్యులను పీడిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపితేనే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, 32వ వార్డు నాయకులు, డోన్ పట్టణ టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షులు మస్తాన్, డోన్ పట్టణ టిడిపి బిసి సెల్ ఉపాధ్యక్షులు జిలేబి ధను, కొసన పల్లె రామాంజనేయులు, బ్రహ్మం, అల్లాబకాష్, గౌస్, అరుణ్, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మెన్ మురళీకృష్ణ గౌడ్, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్, గండికోట రామసుబ్బయ్య, నంద్యాల జిల్లా టిడిపి బిసి సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల మల్లిఖార్జున, నంద్యాల జిల్లా టిడిపి టీఎన్‌టీయూసీ అధ్యక్షులు అజీజ్, నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు, అడ్వకేట్ హారణ్, డోన్ నియోజకవర్గ టిడిపి తెలుగుయువత అధ్యక్షులు కుమ్మరి సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, డోన్ మండలం టిడిపి బిసి సెల్ అధ్యక్షులు కొచ్చెరువు రామాంజనేయులు, ఉడుములపాడు నాగేంద్ర, రామిరెడ్డి, గోవింద రెడ్డి, కామగానికుంట్ల బాలు, డోన్ పట్టణ టిడిపి తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కేబుల్ కిరణ్, పాలరాజు, ఐటిడిపి పీరా, సీసంగుంతల కాంత్, ఎర్రిస్వామి, ఉడుములపాడు చంద్ర గౌడ్, మయూరి గౌడ్, దేవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.