- టీసీఎస్, కాగ్నిజెంట్‌లపైనా కోర్టులకు వెళుతూ విషప్రచారం
- విశాఖ, ఉత్తరాంధ్ర భవితకు చంద్రబాబు పునాదులు వేశారు
- లోకేష్ ఎంఎన్‌సీ కంపెనీలను తెచ్చేందుకు కృషి చేస్తున్నారు
- ఉత్తరాంధ్రను దోచుకోబట్టే వైసీపీని చిత్తుగా ఓడిరచారు
- గత ప్రభుత్వంలో వేల కోట్ల భూములు కబ్జా చేశారు
- రుషికొండ భవనం అధికార దుర్వినియోగానికి నిదర్శనం
- శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
మంగళగిరి(చైతన్యరథం): విశాఖ, ఉత్తరాంధ్రను రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా మార్చాలన్న విజన్‌తోనే 2014-19 మధ్య నాడు టీడీపీ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్నో ఐటీ పరిశ్రమలను తీసుకువచ్చారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభు త్వం ఉన్న కంపెనీలను తరిమికొట్టి ఉత్తరాంధ్ర యువత భవిష్య త్తును అంధకారం చేసిందని ధ్వజమెత్తారు. అందుకే 2024 ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు వైసీపీని చిత్తుగా ఓడిరచి ఒక్క సీటు కూడా రాకుండా బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఐటీ ఉద్యోగాలకు బదులు, యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడి నిర్వీర్యమయ్యేలా చేశారు.. అభివృద్ధిని వదిలేసి, భూకబ్జాలు, అరాచకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ విశాఖను ఐటీ హబ్‌గా మార్చేందుకు 5 లక్షల ఉద్యోగాల కల్పన అనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ జాతీయ, అంతర్జాతీయ కంపె నీలను వైజాగ్ రప్పిస్తున్నారు. ప్రభుత్వం కంపెనీలను తీసుకు వస్తుంటే ఓర్వలేక వైసీపీ నేతలు కోర్టులకు వెళ్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
హైకోర్టు మొట్టికాయలు వేసినా..
ఇటీవలే టీసీఎస్ విషయంలో వైసీపీకి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా సాక్షి పేపర్, సోషల్ మీడియా ద్వారా విషం కక్కు తూనే ఉన్నారు. అప్పట్లో వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు రుషికొండ నుంచి భీమిలి వరకు వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్న విషయం అందరికీ తెలుసు. కేవలం సొంత లాభం కోసం కొండ లను పిండి చేసి రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్‌లు కట్టుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. గతంలో వైసీపీ వేధింపుల వల్ల అమరరాజా, కియా వంటి సంస్థలు పక్క రాష్ట్రా లకు వెళ్లిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చి పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగిస్తూ అభివృద్ధిని పరు గులు పెట్టిస్తోంది. ఐటీ కంపెనీలు వస్తుంటే కేసులు వేసి అడ్డుకుంటున్న వైసీపీకి యువత బాగుపడటం ఇష్టం లేదా? గంజాయి, డ్రగ్స్ ఊబిలో యువత నాశనం కావాలని కోరుకుం టున్నారా? అని ప్రశ్నించారు. భూకబ్జాలకు పేటెంట్ రైట్ కలిగిన వైసీపీ నేతలు నేడు నీతులు మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు.
ఉత్తరాంధ్రలో మీ దోపిడీ రాష్ట్ర ప్రజలకు తెలుసు
వైవీ సుబ్బారెడ్డి విశాఖను జగన్‌రెడ్డికి రాసిచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు. రుషికొండ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములను వైసీపీ నేతల పేరు మీద దారాదత్తం చేసిన పాపం మీది కాదా? పర్యావరణాన్ని నాశనం చేసి రూ.500 కోట్లతో కట్టుకున్న ప్యాలేస్ మీ విలాసానికి నిదర్శనం కాదా? బే-పార్కు ఆక్రమణలు, దశపళ్ల భూములపై సాగించిన రాజకీయం రాష్ట్ర మంతటికీ తెలుసు. మధురవాడలో రూ.1500 కోట్ల విలువైన భూమిని నాగార్జున కనస్ట్రక్షన్‌కు కారుచౌకగా అప్పగించిన దోపిడ ీపై లెక్కలు తేలాల్సి ఉంది. భీమిలీలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన భూ ఆక్రమణలు, ఎన్‌సీసీ ప్రాజెక్టులో కొట్టు సత్యనారాయణ వాటాల వ్యవహారం, ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ డ్రామాలు.. ఇవన్నీ విశాఖ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సొంత పార్టీ ఎంపీలే భూముల కోసం కొట్టుకు చచ్చిన చరిత్ర మీది కాదా? భూముల వాటాల కోసం గొడవ పడటమే కాకుండా.. ఏకంగా ఫ్యామిలీలను కిడ్నాప్ చేసుకునే స్థాయికి అరాచకాలు దిగజారిన విషయం ప్రజలెవరూ మర్చి పోలేదు. మంత్రి నారా లోకేష్ ఎంతో కష్టపడి టీసీఎస్, కాగ్ని జెంట్, డేటా సెంటర్ వంటి సంస్థలను వైజాగ్ రప్పిస్తుంటే.. వాటిని ఎలా తరిమికొట్టాలి? ఎలా కేసులు వేయాలి? అని వైసీపీ ఆలోచించడం దుర్మార్గం. యువతకు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా? ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తామని పార్టీ పెట్టి.. మీ సొంత కేసులు మాఫీ చేసుకోవడానికే అధికారాన్ని వాడుకున్నారు.
అభివృద్ధిని హర్షించడం చేతకాకపోతే సైలెంట్‌గా కూర్చోవాలి కానీ, అడ్డగోలుగా కేసులు వేయడం ఏంటి? వైసీపీ హయాంలో భూములు ధారాదత్తం అయిపోతున్నాయని..మీ పార్టీ వాళ్లే కేసులు వేసిన విషయం గుర్తులేదా? ఇప్పుడు బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారా? మీ హయాంలో బీచ్ సాండ్, మోనోసైట్, బాక్సైట్ ఏమైపోయాయి? ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ కొట్టేయడానికి అడ్డగోలుగా రోడ్లు వేసిన మ్యాపులు ప్రజల కళ్లముందే ఉన్నాయి. లాటరైట్, బాక్సైట్‌లను భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించిన దోపిడీ అంతా ఇంతా కాదు. జగన్‌రెడ్డి పాలన అంతా దందాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతి, అక్రమాలు, అరాచకాలు అనే ఆరు సూత్రాల మీద సాగింది. ఈ దందా, దౌర్జన్యం, దోపిడీ పాలన వల్ల పెట్టుబడిదారులు ఏపీ అంటేనే భయపడి పారి పోయారు. వైసీపీ నేతల వాటాల వేధింపులు తట్టుకోలేక అమ రరాజా బ్యాటరీస్ హైదరాబాద్‌కు, ఇన్ఫోటెక్ బెంగళూరుకు, కియా అనుబంధ సంస్థలు చెన్నైకి తరలిపోయాయి. లులూ గ్రూపును తరిమికొట్టిన పాపం మీది కాదా? అని ప్రశ్నించారు.
ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఒక్క సెంట్ భూమిని కూడా వదలకుండా వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారు. కార్తీక వన భూములను సైతం దారాదత్తం చేసిన మీరు, ఈరోజు భూముల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. బాక్సైట్, లాటరైట్‌లను భారతీ సిమెంట్లకు తరలించ డానికి ఏజెన్సీలో అక్రమంగా రోడ్లు వేయించింది నిజం కాదా? బీచ్ సాండ్, మోనోసైట్ దోపిడీని ప్రజలు మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రినారా లోకేష్ 18 నెలల పాటు శ్రమించి, పారిశ్రామికవేత్తల్లో నమ్మ కాన్ని నింపి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చారు. 5 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో కంపెనీలను తెస్తుంటే కోర్టుల ద్వారా అడ్డుకోవడం వైసీపీ నీచబుద్ధికి నిదర్శనం. టీసీఎస్ విషయంలో హైకోర్టు అక్షింతలు వేసినా, సాక్షి పేపర్లో అబద్ధపు రాతలు రాయడం వైసీపీకి అలవాటుగా మారింది. కోర్టులన్నా, వ్యవస్థలన్నా మీకు గౌరవం లేదని అర్థమైందని మండిపడ్డారు.















