- ప్రజలన్నా, దేశమన్నా గౌరవం లేదు
- అందుకే స్వాతంత్య్ర వేడుకలకు దూరం
- పులివెందులలో ఆయనను ఛీకొట్టారు
- ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
మంగళగిరి(చైతన్యరథం): స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం జగన్ అహంకారాన్ని తెలియజేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రతిఒక్కరూ జెండా పండుగ చేసుకుంటా రు. ఎంతటి పనుల్లో వేడుకల్లో పాల్గొని దేశభక్తి చాటుకుంటారు. జగన్‌రెడ్డి మాత్రం జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా భార తీయులను అవమానపరిచారు..ఆయనకు ప్రజలంటే ఏ మాత్రం గౌరవం లేదు.. దేశంపై భక్తి భావాలు లేవు..స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు, విధ్వంసకాండ మాత్రమే కావాలి. భారతదేశాన్ని పాకిస్తాన్‌లా చూసే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ విధంగా విధ్వంసం సృష్టించాలా అని ఆలోచిస్తుంటాడు. శాశ్వతం గా సీఎంగా ఉండాలంటే ఏం చేయాలన్నదే ఆయన ఆలోచన.
ఎప్పుడూ ప్రజలను ఇబ్బంది పెడుతుండాలనేదే ఆయన ఉద్దేశం. జగన్‌కు జెండా వందనం చేయడానికి పది నిమిషాల సమయం దొరకలేదా? అని ప్రజలు విమర్శిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొన్నామని, తమకు స్వేచ్ఛ వచ్చిందని అక్క డి ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారు. చంద్రబాబును అవమాన పరచారన్న కోసం ప్రజల్లో ఉంది. అందుకే జగన్‌రెడ్డికి తగిన శాస్తి చేశారు. డిపాజిట్ కూడా రాకుండా చేశారు. నిస్వార్థంగా పని చేస్తున్న పోలీసు యంత్రాంగాన్ని ఇబ్బంది కలిగించారు. ప్రజల్ని మభ్యపెట్టడమే జగన్ పని. జగన్ మానసిక స్థితి సరిగా లేదు. ఏదైనా మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి చూపించుకోవాలని హితవుపలికారు.
చంద్రబాబు సారథ్యంలో ప్రగతిపథం
చంద్రబాబు చేస్తున్న మంచి పనులను చూసి ప్రజలు ఆశీర్వ దిస్తున్నారు. సూపర్‌సిక్స్ హామీలు అమలవుతున్నాయి. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై చాలా ఆనందంగా ఉన్నారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర మంత్రులను కలిశాం. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా కూటమి ప్రభుత్వంపై విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. పారిశ్రామికవేత్తలను రావద్దంటూ వైసీపీ నాయ కులు అడ్డుపడుతున్నారు. ఇలా కుట్రలు, కుతంత్రాలకు తెరలే పారు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యో గాలు వస్తాయి. పెట్టుబడులు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందు తుంది. రాష్ట్రంపై కుట్రలు చేస్తున్న జగన్‌లో పశ్చాత్తాపం, జ్ఞానోద యం కలిగించాలని వేడుకున్నారు.