- దోపిడీ దొంగల కేంద్రంగా మార్చారు
- ఆలయ ప్రతిష్టను దిగజార్చారు
- భూమన నీతి సూక్తులు సిగ్గుచేటు
- ఆయన చేసిన అవినీతి ప్రజలకు తెలుసు
- విశ్రాంతి షెడ్లను షాపుల కోసం అమ్మేశారు
- కాంట్రాక్టుల పేరుతో దోచుకుతిన్నారు
- దర్శనం టిక్కెట్లనూ అమ్ముకున్నారు
- చెవిరెడ్డి దోపిడీ బయటపడుతుంది
- తిరుమల పవిత్రను కాపాడిరది టీడీపీనే
- యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ
మంగళగిరి(చైతన్యరథం): టీటీడీ గురించి మాట్లాడే నైతికత వైసీపీకి కానీ, కరుణాకర్‌రెడ్డికి కానీ లేదని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు తిరుమల పవిత్ర తను కాపాడిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. అన్నప్రసాదం పవిత్రతను కాపాడడంలోనూ, సామాన్య భక్తులకు స్వామివారి దర్శ నం చేరువ చేయడంలోనూ ప్రత్యేక స్థానం టీడీపీకే లభించిందని గుర్తుచేశారు. టీడీపీ ఎల్లప్పుడూ నిస్వార్థంగా స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్న వారినే టీటీడీ చైర్మన్‌లుగా నియమించిందని, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలిసిన వాస్తవమ ని పేర్కొన్నారు. వైఎస్సార్, జగన్‌రెడ్డి పాలనలో టీటీడీ నిర్వహణ ఎంత దుర్భర స్థితికి చేరుకుందో భక్తులు స్వయంగా అనుభవించా రని చెప్పారు. నాసిరకం సరుకులతో అన్నప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు అందించిన దారుణ స్థితిని ప్రజలు కళ్లారా చూశా రని, కోట్లాది మంది భక్తుల డబ్బును దుర్వినియోగం చేస్తూ వైసీపీ హయాంలో స్వామివారి ప్రతిష్ఠను దిగజార్చారని ఆరోపించారు. అన్నప్రసాదాల విషయంలో వైసీపీ ఏ విధంగా దారుణానికి ఒడిగ ట్టిందో అందరూ చూశారు.. కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న సమ యంలో తిరుమల మాడ వీధుల్లో లడ్డు గుమగుమలు భక్తులు ఎరు గరని, ఆ సమయంలోనే మేము ఈ ప్రశ్నను ఎన్నికల ముందు లేవనెత్తామని గుర్తుచేశారు.
కరుణాకర్‌రెడ్డి ఈ రోజు నీతులు వళ్లిం చడం అంటే దెయ్యాలు వేదాలు వళ్లించినట్టే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీటీడీలో కరుణాకర్‌రెడ్డి చేసిన అవినీతి చర్యల కు సమాధానం చెప్పరని అన్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి షెడ్లను వైసీపీ పాలనలో షాపుల కోసం అమ్మేశారని విమర్శించారు. ఎన్నికల గెలుపు కోసం కరుణాకర్‌రెడ్డి కుమారు డు స్వామివారి సొమ్ము రూ.1600 కోట్లను సివిల్ కాంట్రాక్టుల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. టీవీల కుంభకోణం, దర్శ నం టికెట్ల కుంభకోణం, తాళిబొట్ల కుంభకోణం, అభిషేకం టికెట్ల కుంభకోణం, తలనీలాల కుంభకోణం, స్వామివారి డాలర్ల కుంభ కోణం ఇలా అవినీతి చరిత్ర మొత్తం భూమనదేనని స్పష్టం చేశా రు. దర్శనం టిక్కెట్లు అమ్ముకుని కోట్ల రూపాయలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. కరుణాకర్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి కలసి టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చి స్వామివారి ప్రతిష్ఠను దిగజా ర్చారని దుయ్యబట్టారు. కరుణాకర్‌రెడ్డి రోజుకు 5,000 టిక్కెట్లు జారీ చేస్తే, బి.ఆర్.నాయుడు రోజుకు కేవలం 50 టిక్కెట్లు మాత్ర మే జారీ చేస్తున్నారని, ఇక్కడే ఇద్దరి మధ్య తేడా స్పష్టమవుతుందని తెలిపారు. బి.ఆర్.నాయుడు నిస్వార్థంగా స్వామివారికి సేవ చేస్తున్నప్పుడు, టీటీడీని అడ్డగోలుగా దోచుకున్న వారు ఆయనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రాజకీయ లబ్ధి కోసం, కమీషన్లకు కక్కుర్తి పడి తిరుమ లలో సత్రాలను కూలగొట్టి హడావుడిగా నిర్మించి దోచుకుతిన్నది కరుణాకర్‌రెడ్డేనని తీవ్రంగా విమర్శించారు. కరుణాకర్‌రెడ్డికి టీడీపీని, టీటీడీ చైర్మన్‌ను విమర్శించే నైతికత లేదన్నారు. పింక్ డైమండ్ మాయమైందని వైసీపీ నీచ రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. టీడీపీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తుందని, కానీ ఎంపీ ఎన్నికలలో వైసీపీ నకిలీ ఓటర్ కార్డు లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని చెప్పారు. వైసీపీ పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఎన్నో ఘోరాలు జరిగాయి.. 300కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని తెలిపారు. వైసీపీ హయాంలో పవిత్రమైన తిరుమలలో ఎంతమందిని చంపారో జగన్‌రెడ్డి చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలు అరెస్టు కావడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి మైన్స్ దోపిడీ నిజమా కాదా అని ప్రశ్నించారు. త్వరలో చెవిరెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ దోపిడీ కూడా బయటపడుతుందని చెప్పారు. ప్రధాన నగరాల్లో వైసీపీ టీడీఆర్ బాండ్స్ దోపిడీ గురిం చి ప్రజలకు తెలిసిందేనని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి బంధు వర్గంతో కలసి వైసీపీ నేతలు టీటీడీని దోపిడీదారుల, దొంగల కేంద్రంగా మార్చిన చరిత్ర ఉందని మండిపడ్డారు. వైసీపీ ఆడుతు న్న వీధి నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హితవుపలికారు.