చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బైజూస్‌కు బైబై… రూ.668 కోట్లు హాంఫట్..?

by చైతన్యరధం
Apr 11, 2023 at 12:50pm
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
ys jagan and byjus

Jagan Reddy good bye for Byjus services in AP

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అంతా అనుకున్నట్టే అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో బైజూస్ కంటెంట్‌కు జగన్ సర్కార్ బై బై చేప్పేస్తోంది. దీంతో.. ఏపీలో సీఎం జగన్.. బైజూస్ బంధం మూన్నాళ్ళ ముచ్చటగా మారింది. గత ఏడాది చివర్లో ఎంతో ఆర్భాటంగా బైజూస్‌‌తో ఒప్పందాన్ని ప్రకటించిన సీఎం జగన్ రెడ్డికి.. 3 నెలల తిరిగే సరికే తత్వం బోధపడినట్టుంది. అందుకే బైజూస్‌ కంటెంట్‌కు బదులు.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కంటెంట్‌ను రెడీ చేయిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో సొంత కంటెంట్‌నే బైజూస్ ట్యాబ్‌లలో వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో బైజూస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళూ ఆడిన డ్రామా తుది అంకానికి చేరినట్టైంది.

“అడుసు తొక్కటం.. కాళ్ళు కడుక్కోవటం” అలవాటుగా మార్చుకున్న సీఎం జగన్ రెడ్డి నైజానికి మంచి ఉదాహరణగా ఏపీలో బైజూస్ ఉదంతం నిలుస్తోంది. ఆన్ లైన్ ట్యూషన్ సర్వీసులు అందించే ఈ బైజూస్ సంస్థ కరోనా సమయంలో బాగా పాపులర్ అయ్యింది. అయితే.. అదే సమయంలో నాసిరకం కంటెంట్‌తో పిల్లలకు.. వారి తల్లి తండ్రులకు కుచ్చుటోపీ పెడుతోందంటూ బైజూస్ పై అనేక విమర్శలు వచ్చాయి. క్వాలిటీ లేని కంటెంట్, ట్యాబ్‌లను అంట గడుతూ బైజూస్ మోసం చేస్తోందని దేశ వ్యాప్తంగా అనేక కేసులూ నమోదయ్యాయి. అయితే.. ఇలాంటి బైజూస్ సంస్థతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏకంగా దావోస్ వెళ్ళి మరీ ఒప్పందం చేసుకుని వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో బైజూస్ కంటెంట్ తో ఆన్లైన్ బోధన చేస్తామంటూ గొప్పలు పోయారు. బైజూస్ పాఠాలు వింటే.. పిల్లలంతా అపరమేధావులుగా తయారైపోతారనేలా అరచేతిలో స్వర్గం చూపించారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలోని ప్రభుత్వ కంటెంట్ కంటే.. బైజూస్ కంటెంట్ చాలా గొప్పదనేలా అప్పట్లో జగన్ రెడ్డి బిల్డప్ ఇచ్చారు. తీరా.. మూడు నెలలు గడిచాయో లేదో కానీ.. బైజూస్ కంటెంట్ కు జగన్ రెడ్డి బైబై చెప్పేస్తున్నారు.

సంబంధితవార్తలు

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై, అధికారులపై చర్యలు తీసుకోవాలి – టీడీపీ నేతలు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారి సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు పార్టీలో చేరిక.

నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి – టిడిపి నేతల మీడియా సమావేశం.

అయితే… బైజూస్‌తో ఒప్పందం సందర్భంగా సీఎం జగన్ రెడ్డి మాట్లాడిన మాటలను ఇప్పుడు ఓ సారి గుర్తుకు తెచ్చుకోవాలి. కార్పొరేట్ విద్యా స్కూళ్ళకే పరిమితమైన కాస్ట్‌లీ కంటెంట్‌ను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇస్తున్నామని ఆనాడు సీఎం పేర్కొన్నారు. బైజూస్ కంటెంట్‌ను గేమ్ ఛేంజర్ గా ఆయన అభివర్ణించారు. ఒక్కో విద్యార్ధి 25 వేల రూపాయలు పెట్టి ఆ కంటెంట్ కొనుక్కోలేరు కనుక.. ప్రభుత్వమే దానిని కొని అందిస్తుందని గొప్పలు పోయారు. ఈ క్రమంలోనే 2022 డిసెంబర్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి చదివే 4.59 లక్షల మంది విద్యార్ధులకు, 59 వేల మంది టీచర్లకు కలిపి 5 లక్షల 18 వేల 740 ట్యాబ్‌లు ఇచ్చారు. ఇందు కోసం 688 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. అంతే కాదు.. ఎంతో విలువైన కంటెంట్‌ను బైజూస్ ఇస్తోందని.. దాని విలువ 778 కోట్లని సీఎం జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ కంటెంట్‌తో ఏపీలో విద్యార్ధుల జీవితాలన్నీ మారిపోతాయనే విధంగా ఆనాడు సీఎం ప్రసంగం కొనసాగింది.

ఇక.. 8వ తరగతి విద్యార్ధులకు ఇచ్చిన ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ లోడ్ చేయగా.. 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులకు వారి మొబైల్ ఫోన్లలో కంటెంట్ లోడ్ చేశారు. అయితే.. బైజూస్ కంటెంట్ వాడటం మొదలు పెట్టిన తరువాత గానీ.. జగన్ సర్కార్ కు అసలు విషయం బోధపడలేదు. తాము అడుసులో కాలేసామని భావించిన సీఎం జగన్ రెడ్డి.. బైజూస్ కంటెంట్ ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చేశారు. దానికి సమాంతరంగా సొంత కంటెంట్ తయారు చేయిస్తున్నారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్ఈ బేస్డ్ సిలబస్ రూపొందించే బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలికి అప్పగించారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఈ కంటెంట్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిని బట్టి ఏడాది కాలంలోనే బైజూస్ సేవలకు జగన్ సర్కార్ బైబై చెప్పినట్టు అర్ధం అవుతోంది.

ప్రస్తుతం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో రూపొందుతున్న కంటెంట్ కు, మొబైల్ యాప్‌కు సైతం భారీగా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన వందల కోట్ల రూపాయల మాటేంటి…? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అంతే కాదు.. బైజూస్ ట్యాబ్‌లు పంపిణీ సందర్భంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు అవసరం లేదనే విధంగా సీఎం జగన్ మాట్లాడారు. ప్రతీ టీచర్ బైజూస్ కంటెంట్ ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కూడా విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ చేయించారు. బీఈడీ చేసి… టెట్ , డీఎస్సీ వంటి అర్హతలు పాసైన ఉపాధ్యాయులు సైతం బైజూస్ కంటెంట్‌ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి..? బోధనలో ఉపాధ్యాయుల ఎక్స్‌‌పీరియన్స్ కన్నా బైజూస్ కంటెంట్ గొప్పదా..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. పిల్లల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి.. ఏపీ సర్కార్ అనవసర ప్రయోగాలు చేస్తోందనే విమర్శలు వచ్చాయి. అయితే ఆనాడు జగన్ సర్కార్ వాటిని బేఖాతర్ చేసింది. కానీ.. ఇప్పుడు బైజూస్ కంటెంట్ ను వదిలించుకోవటంతో.. ప్రజల అనుమానాలే నిజం అయ్యాయి. మరోవైపు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి SCERT కంటెంట్‌నే ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేక బైజూస్ కంటెంట్ ను కూడా మిక్స్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ. ఒకవేళ రెండింటినీ ఒకేసారి విద్యార్థులపై రుద్దితే వారిపై తీవ్ర ఒత్తిడి పడుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి 2019-20 కరోనా లాక్‌డౌన్ సమయంలో బైజూస్ ఆన్ లైన్ క్లాసులకు విద్యార్ధులు ఎగబడ్డారు. దీంతో ఆ సంస్థకు ఇబ్బడి ముబ్బిడిగా లాభాలు వచ్చి పడ్డాయి. ఆ తరువాత కోవిడ్ పరిస్థితులు చక్కబడటంతో.. బైజూస్ ఖాతాదారులు కూడా తగ్గారు. క్రమంగా బైజూస్ లాభాలు తగ్గి నష్టాల బాట పట్టింది. ఏకంగా 4 వేల 500 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు మూటగట్టుకున్న ఈ సంస్థ వేలాది మంది ఉద్యోగుల్ని సైతం తొలగించింది. ఈ నేపథ్యంలో కొంత మంది వైసీపీ నేతల సహాయంతో చక్రం తిప్పిన బైజూస్ అధినేత రవీంద్రన్.. ఏపీ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. దశల వారీగా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బైజూస్ కంటెంట్ అంటగట్టే స్కెచ్ దీని వెనుక ఉందంటున్నారు. అయితే ఫస్ట్ ఫేజ్‌లో 8వ తరగతి విద్యార్ధులకు కంటెంట్ ఇచ్చేలా ఎగ్రిమెంట్ అయ్యింది. కానీ.. మూడు నెలల్లోనే బైజూస్ కంటెంట్ బోర్ కొట్టేయటంతో.. ఏపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. దీంతో జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లి తండ్రుల్లో నవ్వుల పాలౌతోంది.

Tags: ap cm ys jaganbyju's education in ap govt schoolsbyju's exam prepbyju's in apbyjusbyjus mou with ap govtbyjus studentscm jagancm jagan about byjus content in tabscm jagan about tabs and byjuscm ys jaganlatest newspolitical newsys jaganys jagan byjusys jagan mohan reddy
Previous Post

అధికారంలోకి రాగానే జీవో నం.217 రద్దు చేస్తాం బెస్త సామాజిక వర్గీయులకు నారా లోకేష్ హామీ

Next Post

జగన్ రెడ్డి దెబ్బకు చెప్పుతో కొట్టుకుంటున్న సర్పంచ్‌లు…

మరిన్ని వార్తలు

ప్రభుత్వ పాఠశాలల నుంచీ ర్యాంకర్లుగా మెరవొచ్చు
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలల నుంచీ ర్యాంకర్లుగా మెరవొచ్చు

చైతన్యరధం
@ May 21, 2025
అందరి చూపు ఏపీ వైపు!
ఆంధ్రప్రదేశ్

అందరి చూపు ఏపీ వైపు!

చైతన్యరధం
@ May 21, 2025
ఆంధ్రప్రదేశ్

కడప మహానాడుకు 19 కమిటీలు

చైతన్యరధం
@ May 21, 2025
దోచుకోవడమే ధ్యేయం..అభివృద్ధిపై అంతులేని నిర్లక్ష్యం
ముఖ్య వార్తలు

దోచుకోవడమే ధ్యేయం..అభివృద్ధిపై అంతులేని నిర్లక్ష్యం

చైతన్యరధం
@ May 21, 2025
రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం
ఆంధ్రప్రదేశ్

రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం

చైతన్యరధం
@ May 21, 2025
ఇక రేషన్‌ డిపోల్లోనే సరుకుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్

ఇక రేషన్‌ డిపోల్లోనే సరుకుల పంపిణీ

చైతన్యరధం
@ May 21, 2025
పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్‌ భూములపై నిర్ణయం
ఆంధ్రప్రదేశ్

పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్‌ భూములపై నిర్ణయం

చైతన్యరధం
@ May 21, 2025
నేటి నుంచి నెల రోజులు ‘యోగాంధ్ర’!
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి నెల రోజులు ‘యోగాంధ్ర’!

చైతన్యరధం
@ May 21, 2025
Load More

ముఖ్య వార్తలు

దోచుకోవడమే ధ్యేయం..అభివృద్ధిపై అంతులేని నిర్లక్ష్యం

దోచుకోవడమే ధ్యేయం..అభివృద్ధిపై అంతులేని నిర్లక్ష్యం

చైతన్యరధం
@ May 21, 2025
ఇక రేషన్‌ డిపోల్లోనే సరుకుల పంపిణీ

ఇక రేషన్‌ డిపోల్లోనే సరుకుల పంపిణీ

చైతన్యరధం
@ May 21, 2025
పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్‌ భూములపై నిర్ణయం

పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్‌ భూములపై నిర్ణయం

చైతన్యరధం
@ May 21, 2025

పార్టీలో కష్టపడిన అందరికీ పదవులు

చైతన్యరధం
@ May 20, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ పాఠశాలల నుంచీ ర్యాంకర్లుగా మెరవొచ్చు

ప్రభుత్వ పాఠశాలల నుంచీ ర్యాంకర్లుగా మెరవొచ్చు

చైతన్యరధం
@ May 21, 2025
అసెంబ్లీలో ప్రశ్నలకు బాగా సన్నద్ధం కావాలి

అసెంబ్లీలో ప్రశ్నలకు బాగా సన్నద్ధం కావాలి

చైతన్యరధం
@ May 21, 2025
అందరి చూపు ఏపీ వైపు!

అందరి చూపు ఏపీ వైపు!

చైతన్యరధం
@ May 21, 2025

కడప మహానాడుకు 19 కమిటీలు

చైతన్యరధం
@ May 21, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist