- మాటలు ఫేక్.. చేతలు ఫేక్.. సంక్షేమం ఫేక్
- జగన్ గేమ్ ఈజ్ ఓవర్.. మే 13న మన గెలుపు లాంఛనమే
- మనం పేదల పక్షం.. జగన్ పెత్తందారు పక్షం
- వందలాది కోట్లున్న వైసీపీ వాళ్లు పేదలట!
- అన్నివర్గాల అభివృద్ధికి నేను డ్రైవర్నవుతా
- సీమ నీటి ప్రాజెక్టుల దిశ, దశ మారుస్తా
- కర్నూలుకు నీళ్లిస్తే.. నా జన్మ ధన్యమే
- బుడగజంగాలు, కురబ, బోయల సామాజిక గుర్తింపునకు కృషి
- ముస్లింలకు అన్నివిధాలా అండగావుంటా..
- ఎమ్మిగనూరు ప్రజాగళంలో చంద్రబాబు ఉద్ఘాటన
ఎమ్మిగనూరు (చైతన్యరథం): ప్రజాగళం సభలకు పోటెత్తుతున్న జనవాహిని చూస్తుంటే జగన్ ఇంటికెళ్లే రోజు దగ్గర పడిరదనిపిస్తుందని తెలుగుదేశం జాతీయా ధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘1994 తరు వాత మళ్లీ ప్రజల్లో ఇంత కసి చూస్తున్నాను. అసమర్థ పాలకుడి ఏలుబడిలో ఐదేళ్లుగా అనుభవించిన నరకా నికి రెట్టింపు గిఫ్ట్ ఇవ్వాలన్న కసి ప్రజల్లో కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు ముక్కల్కె డస్ట్‌బిన్‌లోకి పోవడం ఖాయం’ అన్నారు. మే 13న కూటమి విజ యం లాంఛనమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాగళం ఎన్నికల యాత్రలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు మాట్లాడారు. అబద్ధా లతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ ‘ఓ ఫేక్ ఫెలో’ అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. నైతిక రాజకీయాలకు పాతరేసిన జగన్ ` బీజేపీతో తెలుగుదేశం ఎన్నికల పొత్తు తాత్కాలిక మేనం టూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీని తప్పుడు కథనాల రూప కల్పనకు వినియోగిస్తూ`ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే కుటిల యత్నాలకు జగన్ తెరతీస్తున్నాడన్నారు.
ప్రజలు అమాయకులు కారని, జగన్ మోసాలు ఇక చెల్లవని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అని గద్దెమీదున్న ఫేక్ ఫెలోని ప్రశ్నిస్తున్నాను. గొడ్డలి వేటు వేసిందెవరో ఇక ప్రపంచం ముందు దాచలేవు. చంపిన వాళ్లను పక్కన పెట్టుకుని ఎంపీ సీటిచ్చి.. బాధి తలపై కేసులుపెట్టి రోడ్డుకు లాగావు? స్వయానా చెల్లినే ఇబ్బందులకు గురి చేసిన నువ్వు ముఖ్యమంత్రివా? నీకు మానవత్వం ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించా రు. తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దుచేసి.. తానేదో కొత్తగా ఉద్దరిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న వైసీపీ బండారంపై విరుచుకుపడ్డారు. తెదేపా ఎప్పుడూ పేదల పక్షమేనని, వైసీపీ పెత్తందారుల పక్షమేనన్నారు. బీసీలు తెదేపా డీఎన్‌ఏలోనే ఉన్నారని, ఆయా వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం కట్టుబడి ఉందని ప్రకటిం చారు. బీసీ వర్గాల్లోని కురబలు, బుడగజంగాలను ఎస్సీలు, బోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ముస్లింలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం అంటూ.. అన్ని సామాజిక వర్గాల సంక్షే మానికి తాను డ్రైవర్‌ని అవుతానని చంద్రబాబు ప్రక టించుకున్నారు. ప్రజాగళం సభలకు పోటెత్తుతున్న జనాన్ని చూసి చెప్తున్న ‘జగన్ గేమ్ ఈజ్ ఓవర్’ అని చంద్రబాబు ప్రకటించారు. అడ్డొచ్చిన వైసీపీని సైకిల్ తొక్కుకుంటూపోతుంది. గ్లాసు కుమ్ముకుంటూ పోతుం ది. వీళ్లిద్దరికీ కమలం బలం తోడైంది. ఇక కూటమి గెలుపు అన్‌స్టాపబుల్ అని చంద్రబాబు అన్నారు.
నమ్మించి సీమ గొంతుకోశాడు జగన్
జగన్ నమ్మించి గొంతు కొస్తాడని చెప్పడానికి ప్రస్తుత రాయలసీమ నిలువెత్తు ఉదాహరణ. 52 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 49 అప్పగించారు. అంత బలాన్నిచ్చిన సీమ భవిష్యత్ గురించి ఆలోచించాడా? జగన్ ఏలుబడిలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టైనా వచ్చిందా? అని చంద్రబాబు నిలదీశారు. తానూ రాయలసీమ బిడ్డనేనని, తెదేపా ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు 68వేల కోట్లు వెచ్చిస్తే.. ఒక్క రాయల సీమకే 12వేల కోట్లు ఖర్చుచేశాం. వైసీపీ సర్కారు కేవలం 2వేల కోట్లు మాత్రమే వెచ్చించిందంటూ, సీమ సంక్షేమం గురించి మాట్లాడే న్కెతిక హక్కు జగన్‌కు లేదన్నారు. మాట్లాడితే తన పాలనకు ఓ బ్రాండు తగిలించుకుంటున్న జగన్, సీమ కు నీళ్లివ్వడంలో బ్రాండ్ ఎక్కడుందో చూపించాలని నిలదీశారు. సీమకు చుక్క నీరివ్వలేదు. అభివృద్ధికి తట్ట మట్టి ఎత్తలేదు. రాయలసీమలో 102 ప్రాజెక్టు లను రద్దు చేశావ్. గురురాఘవేంద్ర ప్రాజెక్టును పూర్తిగా ఎండగట్టావ్.
ఈ దుర్మార్గాలేనా సీమపై జగన్ ముద్ర? అని తీవ్రస్వరంతో ప్రశ్నించారు. సీమకు ప్రాణాధార మైన తుంగభద్రపై హెచ్‌ఎల్‌సీ, గండ్రేవుల, గురురాఘ వేంద్ర, వేదవది, వెలుగోడు ప్రాజెక్టులను తెదేపా ముందుకు తీసుకెళ్తే.. వాటినీ నిర్వీర్యం చేశాడు. సీమ రైతు సంక్షేమం కోసం డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యత నిచ్చి 90శాతం సబ్సిడీలిస్తే వాటినీ రద్దు చేశాడు. పనుల్లేక ఈ ప్రాంత కూలీలు వలసలు పోవడానికి జగన్ అసమర్థ విధానాలు కారణం కాదా? రాయల సీమ ద్రోహి జగన్‌కు ఓటేస్తే భస్మాసుర హస్తాన్ని మన నెత్తిన మనమే పెట్టుకున్నట్టని చంద్రబాబు హెచ్చరిం చారు. కూటమి ప్రభత్వం అధికారంలోకి రాగానే సీమ నీటి ప్రాజెక్టులను పరిగెత్తిస్తాం. డ్రిప్ ఇరిగేషన్‌కు పెద్దపీట వేసి అద్భుతాలు సాధిద్దాం. ఆర్డీఎస్ కుడి కాలువ పూర్తి చేస్తాం. గోదావరి కృష్ణా అనుసంధానాన్ని లక్ష్యం చేసుకుందాం. కృష్ణా జలాలు కర్నూలుకు ఇవ్వ గలిగితే నా జన్మ ధన్యమైనట్టేనంటూ.. సీమ సాగునీటి ప్రాజెక్టుల దశ, దిశ మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇది కదా సామాజిక న్యాయం
టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ బాగుంటుం దని యువత, విద్యార్థులు ఆశపడుతున్నారు. వాళ్ల ఆశలు వమ్ముకానివ్వను అని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెదేపా ఎప్పుడూ పేదలపక్షమేనని, కర్నూలు జిల్లాలో ఎక్కువగావున్న పేదలు, వెనుకబడిన వర్గాల్కెన బోయ, కురబ, చేనేత, మాదిగ, మైనారిటీల సంక్షేమా నికి పార్టీ కట్టుబడి ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ డిఎన్‌ఏలోనే బీసీ ఉందని గుర్తు చేస్తూ.. బడుగు వర్గాలతో పార్టీకున్న అనుబంధాన్ని ఎవ్వరూ విడదీయలేరని చంద్రబాబు ధ్కెర్యం చెప్పారు. సామాన్యుడు, ఎంపీటీసీగా గెలిచిన వ్యక్తి, కురబల కోసం రాజీలేని పోరాటం చేసిన పంచలింగాల నాగ రాజును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించామని, మంత్రాల యంలో రాఘవేంద్రరెడ్డి అనే బోయ కులస్థుడిని ఎమ్మెల్యే అభ్యర్ధిగా, ఆలూరులో లింగాయత్ వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్‌ను, పత్తికొండలో ఈడిగ వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి కుమారిడిని ఎమ్మెల్యే అభ్యర్ధి గా ప్రకటించటాన్ని చూస్తే.. తెలుగుదేశం పేద బడుగు వర్గాలకు ఇచ్చే ప్రాధాన్యతను తేటతెల్లం చేస్తుందన్నా రు.
మిత్రపక్షమైన బీజేపీ సైతం ఆదోని నుంచి బోయవర్గానికి చెందిన పార్థసారథికి ఇస్తే, కర్నూలో వైశ్య, కొడుమూరులో మాదిగ వర్గానికి చెందిన ఎస్సీ లకు అభ్యర్థిత్వం ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పారు. ఇక ఎమ్మిగనూరుకు సంబంధించి జయనాగేశ్వరరెడ్డి కుటుంబ డీపన్‌ఏ తెలుగుదేశంలో ఉందన్నారు. పేద, బడుగువర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తోన్న తెదేపాను, దాని మిత్రపక్షాల అభ్యర్థులను పెద్ద మెజా రిటీతో గెలిపించి సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయా వర్గాలపైనే ఉందని చంద్ర బాబు పిలుపునిచ్చారు. తన అభ్యర్థులంతా కడు పేదవాళ్లని పెత్తందారు జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ అభ్యర్థు లను ప్రస్తావిస్తూ.. బుట్టా రేణుక నిరుపేద కుటుంబ మా? అని బాబు నిలదీశారు. 2014లోనే ఆమె ఆస్తి రూ.250 కోట్లన్నారు. వైసీపీ నుంచి బరిలోవున్న రామయ్య చాలా పేదవాడు జగన్ దృష్టిలో అని ఎద్దేవా చేశారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి ఇసుక, మట్టితోపాటు మంత్రాలయం దేవుడినీ మింగేసిన వ్యక్తి కాదా? వీళ్లకి సీట్లిచ్చి పేదవాళ్లకు సీట్లిచ్చానని చెప్పుకోవడం జగన్ అన్కెతిక రాజకీయానికి అద్దం పడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘ఆదోనిలో వలసపక్షి ఉన్నారు. మంత్రాలయం, ఆదోని, గుంతకల్లులోను షాడోలే. సాయిప్రతాప్‌రెడ్డి ఎక్కడ నుంచి వచ్చారు. 1983లో వాళ్ల నాన్న టీడీపీలోనే ఉండేవాడని గుర్తు చేస్తూ.. యుద్ధాల్లో సామంత రాజును చంపేసి రాజ్యాన్ని పంచుకున్నట్లుగా వీళ్లు ఇక్కడ నాయకులను ఆణగదొక్కి దోపిడీకి పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.
మేమెప్పుడూ పేదలపక్షమే
సామాజిక న్యాయమంటే రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసి.. మిగిలిన వర్గాల ప్రాధాన్యతను అణగదొక్కడమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పేదల సంక్షేమానికి కట్టుబడివున్న పార్టీ తెలుగుదేశ మైతే.. పెత్తందారులు, భూస్వాముల బాగుకు పనిచేసే పార్టీ వైసీపీ అని చంద్రబాబు ఎత్తిపొడిచారు. బీసీ డిక్లరేషన్ తెచ్చిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. 50 ఏళ్లు పైబడిన బీసీలకు రూ.4వేల ఫించన్ హామీ ఇచ్చామన్నారు. ఫించన్లు మొదటి తారీఖునే ఇంటిదగ్గరే ఆంక్షలు లేకుండా అందించే దృక్ఫథంతో ఉన్నామ న్నారు. 5 ఏళ్ల్లల్లో వెనకబడిన వర్గాలకు రూ.1.5 లక్షల కోట్లతో సబ్‌ప్లాన్ తెస్తామని హమీ ఇచ్చారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ 34శాతం టీడీపీ కల్పిస్తే.. జగన్‌రెడ్డి 24శాతానికి తగ్గించడంతో దాదాపు 17 వేల మంది పదవులు కోల్పోయారన్నారు. బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. కులగణన చేసి ధామాషా ప్రకారం నిధులు ఖర్చు పెడతామని, బీసీ వర్గాల్లోని కురబలు, బుడగ జంగాలను ఎస్సీలు, బోయలను ఎస్టీలుగా గుర్తించేం దుకు కట్టుబడి ఉన్నామన్నారు. రూ.5వేల కోట్లతో ఆదరణలో ఆధునిక పనిముట్లు ఇస్తామని, విదేశీ విద్య, స్టడీసర్కిల్, విద్యోన్నతి పథకాలు పునరుద్దరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.చంద్రన్న బీమాతో రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని, శాశ్వత కులదృవీ కరణ పత్రాలిస్తామని, బీసీ భవనాలు, కమ్యునిటీ హాళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చేనేతలకు హ్యాండ్‌లూమ్ ఉంటే రూ.200యూనిట్లు, పవర్‌లూమ్ అయితే రూ.500యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తా మన్నారు. చేనేతలకు ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి కుటుంబాలకు ఆర్ధిక సాయం అంది స్తామని, ఎమ్మిగనూరు కేంద్రంగా టెక్స్ ట్కెల్స్ పార్కు తెస్తానని హామీ ఇచ్చారు.
మైనారిటీలకు మేమే అండ
టీడీపీ వెనకబడిన వర్గాలకు అత్యధికంగా సీట్లిచ్చిం దని చంద్రబాబు స్పష్టం చేశారు. సామాజిక న్యాయం అంటూ గొప్పలు చెప్పుకుని.. ప్రత్యర్థులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న వైసీపీ ధైర్యం వుంటే చర్చకు రావా లని చంద్రబాబు సవాల్ చేశారు.పేర్లతో సహాచర్చించేం దుకు మేం సిద్ధం? మీరుసిద్ధమా? అని నిలదీశారు. ఒకేవర్గానికి 49సీట్లు ఇచ్చిన వైసీపీ నాయకులా సామా జిక న్యాయంపై మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. 1995లో మాదిగలకు ఏ,బి,సి,డి, తీసుకువచ్చింది టీడీపీ అని గుర్తుచేశారు. మాదిగలకు జిల్లాల వారీగా క్యాటిగరైజేషన్ తీసుకొస్తామని, మాల,మాదిగ,రెల్లి వర్గా లకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రెండుసార్లు ఎన్డీలో వున్నా ఏ ఒక్క ముస్లింకీ హక్కుల భంగం వాటిల్లకుండా చూశామని గుర్తుచేశారు. హైద రబాద్, కర్నూలులో ఉర్దూ యూనివర్శిటీలు, ఉర్దూను రెండో భాషగా పెట్టడం, రంజాన్ తోఫాలు అందించ డం,ముస్లింలకు అధికశాతం నిధులుకేటాయించడం… ఇవన్నీ తెలుగుదేశం ఘనతలేనన్నారు. దుల్హన్ పథకం ద్వారా ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయించామని, దుకాన్, మకాన్ ద్వారా షాపులు ఇచ్చామని, మౌజన్, ఇమాం లకు గౌరవ వేతనం కల్పించామన్నారు. ఐదేళ్లు కేంద్రం లోని బీజేపీకి రహస్య సహకారం అందించిన వైసీపీ, ఇప్పుడు రాజకీయ పునరేకీకరణపై పిచ్చి ప్రచారాలు చేయడం ఆ పార్టీ న్కెజాన్ని బయట పెడుతుందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లకు ముప్పు ఉందంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం.. వైసీపీ విశ్వనీయతకు అద్దం పడుతుందన్నారు.
టీడీపీ ఎప్పు డూ అధికారంలో ఉన్నా 4శాతం ముస్లిం రిజర్వేషన్లు కాపాడిరదని గుర్తు చేశారు. మా పిల్లల భవిష్యత్ నువ్వే చంద్రన్న అంటూ ముస్లింలు కోరుతున్నారని చంద్ర బాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పవన్ కళ్యాణ్, బీజేపీలతో కలిసి వస్తున్నామన్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రానున్న తరుణంలో `ముఖ్యమంత్రిగా తానుంటే హైదరాబాద్‌ను మించిన అభివృద్ధిని ఏపీలో సాధించవచ్చని చంద్రబాబు అన్నా రు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని వివ రిస్తూనే.. పొత్తులు రాష్ట్రం కోసమేగానీ పార్టీల కోసం కాదన్నారు.
సామాజిక వర్గాల సంక్షేమానికి డ్రైవర్నవుతా
తెదేపా పాలనలో ఏటా బడ్జెట్‌లో 19.15శాతం సంక్షేమానికి ఖర్చు పెడితే.. జగన్ ఏలుబడిలో బడ్జెట్ కేటాయింపులు 15.08శాతం మాత్రమే. జగన్ అమలు చేశా నని చెప్పుకుంటున్న పథకాలు తొమ్మిద్కెతే.. తెదేపా సంక్షేమ పథకాలు 100. పేదోడి ఆకలి తీర్చడానికి రూ.5కే తెదేపా అన్నం పెడితే.. జగన్ వచ్చి నోటిదగ్గర కూడు కొట్టేశాడు. దుల్హన్, ఆదరణ, రంజాన్ తోఫా, రైతులకు డ్రిప్ ఇరిగేషన్, పంటల బీమా, స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, చేనేతలకు పథకాలు ఇవీ తెదేపా బ్రాండ్. సంక్షేమాన్ని సర్వనాశనం చేయడం జగన్ బ్రాండ్. తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు 27, బీసీలకు 30, మైనారిటీలకు 10పథకాలు అమలు చేస్తే.. వాటిని రద్దు చేసింది జగన్ సర్కారు. మద్యపాన నిషేధం అమలుచేసిగానీ ఓటడగనన్న వ్యక్తి.. అదే నాసిరకం మద్యం ఏరుల్కెపారించి వేల కోట్లు వెనకేసుకున్నాడు. ప్రజారోగ్యాన్ని సర్వనాశనం చేశాడు. అక్క చెల్లెమ్మల సంక్షేమం అంటూ దగాకోరు మాటలతో మహిళలను జగన్‌మోసం చేస్తున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు. ఆడ బిడ్డలకు పెత్తనమిచ్చి ఆత్మస్థయిర్యాన్ని పెంచి ప్రపంచానికే ఆదర్శం చేయాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీదే అన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాలు, ఆస్తిలో సమాన హక్కు, కాలేజీలు స్కూళ్లలో 33శాతం రిజర్వేషన్, వంట గ్యాస్ అంశాలను ప్రస్తావించారు.
జగన్ మాదిరిగా ఒట్టొట్టి బటన్ నొక్కకుండా `నిజమైన బటన్ నొక్కుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 18ఏళ్లు పైబడిన ఆడబిడ్డలకు నెలకు రూ.1,500. ఇద్దరుంటే రూ.3వేలు, ముగ్గురుంటే రూ.4,500వేలు, నలుగుంటే రూ.6వేలు ఇస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ఒక బిడ్డ ఉంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే రూ.45వేలు, నలుగురుంటే రూ.60వేలు ఇస్తామన్నారు. తాను దీపం పెడితే జగన్‌రెడ్డి ఆర్పేశాడని ఎద్దేవాచేస్తూ.. ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఆడబిడ్డల చ్కెతన్యానికే కాదు, ప్రజల భవిష్యత్‌కు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, రైతు సంక్షేమానికీ తాను డ్రైవర్‌గా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన తన పూచీ అన్నారు. మెగా డిఎస్సీ వేయడమే కాదు, పద్ధతి ప్రకారం జాబ్ క్యాలెండర్ వేస్తానన్నారు. నిరుద్యోగులకు 3వేల భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.