అమరావతి : వైకాపా సోషల్మీడియా మూక అసత్య ప్రచారాల దురాక్రమాలు పరాకాష్టకు చేరు తున్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ సర్కారు నిర్మించిన అంబేద్కర్ విగ్ర హాన్ని కూల్చేసి కొత్తది నిర్మిస్తామంటూ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేం ద్ర సంచలన వ్యాఖ్యలుచేసినట్టు ఫేక్ ప్రచా రాన్ని సోషల్ మీడియాకు వదిలింది. పాల నా వైఫల్యాల కారణంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ పుట్టిమునిగే పరిస్థితి వచ్చిందని గ్రహి ంచిన వైకాపా`అప్రతిహతంగా దూసుకు పోతున్న తెలుగుదేశం పార్టీపై బురదజల్లే ప్రయత్నాలకు పదును పెడుతుంది. టిడిపి అధికారంలోకి వస్తే అంబే ద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని తాను చెప్పినట్లు అబద్ధపు మాటలు ప్రచారం చేయిస్తు న్న జగన్పై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళి పాళ్ల నరేంద్రకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చేచిల్లర పైసలకు కక్కుర్తి పడి పేటియం బ్యాచ్ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చిల్లరపోస్టులు పెడుతుందని దుయ్యబట్టారు. కుల, మతరహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ చేసిన పోరా టంపై తెలుగుదేశంపార్టీ, నేతలకు ఎనలేని గౌరవం ఉందన్నారు. అధికారంలోకి వచ్చి న నాటినుండి దళితులు, అణగారిన వర్గా లపై దాడులు చేస్తూ జగన్ సైకో పాలన సాగిస్తున్నాడన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించి ప్రజల్లో గందర గోళం సృష్టించి తిరిగి అధికారంలోకి రావా లన్న వైసీపీ కుట్రలుసాగవని,జగన్ను ప్రజ లు నమ్మేస్థితిలో లేరన్నారు. మహనీయుడు అంబేద్కర్ను తప్పుడు ప్రచారానికి వాడు కుంటున్నందుకు జగన్ సిగ్గుపడాలన్నారు. అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని ధూళిపాళ్ల హెచ్చరించారు.