- 2024 ఎన్నికల్లో జగన్ అబద్ధపు ప్రచారాలకు 46మంది వృద్ధుల బలి
- అర్హత ఉన్న ఏ ఒక్క దివ్యాంగుని పింఛన్ రద్దుకాదని హామీ ఇచ్చిన చంద్రన్న
- జగన్ పాలనలోనే 6 లక్షల పింఛన్లు తొలగించారు
- అర్హత లేనివారికి పింఛన్ ఇచ్చి అర్హులైన దివ్యాంగుల నోరుకొట్టిన జగన్ ముఠా
- పింఛన్లకు జగన్ రూ.84వేల కోట్లు ఇవ్వగా.. చంద్రన్న రెట్టింపుచేసి రూ.1,70,000 కోట్లు ఇస్తున్నారు
- వైసీపీ అబద్దపు ప్రచారాన్ని దివ్యాంగులు తిప్పికొట్టాలి
- అర్హులైన దివ్యాంగులందరూ పింఛన్లు పొందాలి
2024 ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ సిబ్బంది ద్వారా పంపిణీ చేయించాలని ఎన్నికల కమిషన్ అపద్ధర్మ జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ సిబ్బందితో ఒక్క రోజులోనే జగన్ పింఛన్ పంపిణీ చేయించి ఉండవచ్చు. వాలంటీర్లు లేకుంటే పింఛన్లు రావని అబద్ధపు ప్రచారం చేశారు. వృద్ధుల్ని ఎండల్లో అటు ఇటు తిప్పారు. చంద్రబాబుపై నిందమోపి ఎన్నికల లబ్ధిపొందడానికి వృద్ధ పింఛన్‌దారుల్ని ఎండల్లో కష్టపెట్టి 46మంది ప్రాణాలు పోయే విధంగా జగన్ కుట్ర చేశారు. అలాగే నేడు తన విషపూరిత మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు దివ్యాంగుల పింఛన్లు రద్దు చేస్తున్నారని జగన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అనర్హులైన వైసీపీ రౌడీలకు దివ్యాంగ పింఛన్లు ఇచ్చి జగన్ పాలనలో నిజమైన అర్హులు నోరుకొట్టారు. చంద్రన్న పాలనలో అర్హతవున్న ఏ ఒక్క దివ్యాంగుని పింఛన్ రద్దుకాదని మంత్రివర్యులు లోకేష్ ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
దివ్యాంగులకు ఒక్క రూపాయి కూడా పెంచని జగన్:
దివ్యాంగులుకిడ్నీ/ తలసేమియా తదితరులుపూర్తి వైకల్యం
2014-19
చంద్రన్న పాలనలో రూ.500నుంచి రూ.3000లకు పెంచారు. రూ.5000 రూ.5000
2019-2024
జగన్ పాలనలో ఒక రూపాయి కూడా పెంచలేదు 0 0
2024 చంద్రన్న పాలనలో రూ.3000 నుంచి రూ.6000లకు పెంచారు. రూ.5000 నుంచి రూ.10 వేలకు పెంచారు. రూ.5000నుంచి రూ.10 వేలకు పెంచారు.
పింఛన్లు మొదట ప్రవేశపెట్టింది తెలుగుదేశమే:
కాంగ్రెస్/ జగన్ పాలనలోటీడీపీ పాలనలో
1983కు ముందు పింఛన్లు లేవు ు
1984 ు రూ.30లతో ఎన్టీఆర్ ప్రారంభించారు.
1989-94 కాంగ్రెస్ పాలనలో పింఛన్ పెంచలేదు ు
1994-2004 ు రూ.45లు పెంచి రూ.75 చేసిన చంద్రన్న
2004-14 రూ.125 పెంచిన కాంగ్రెస్ ు
2014-19 ు రూ.1800 పెంచిన చంద్రన్న
2019-24 రూ.250 చొప్పున నాలుగు విడతల్లో రూ.1000లు మాత్రమే పెంచిన జగన్. -వాయిదాల్లో పెంచడం వల్ల ఒక్కొక్క పింఛన్‌దారు రూ.28 వేలు నష్టపోయారు. ు
2024 జూలై నుంచి ు రూ.1000 ఒకేదఫాలో పెంచిన చంద్రన్న. `ప్రారంభంలో బకాయిలతో కలిపి రూ.7వేలు ఇచ్చారు.
మొత్తం రూ.1,125 రూ.2,875
రూ.4000
-జగన్ 5 ఏళ్ల పాలనలో పింఛన్లకు రూ.84 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
-చంద్రన్న పాలనలో ఐదేళ్లలో రూ.1,70,000 కోట్లు అంటే రెట్టింపు పింఛన్లకు ఇస్తున్నారు.
-అబద్దపు ప్రచారాలతో పింఛన్‌దార్ల ప్రాణాలు తీస్తున్న జగన్ ముఠాను ఆ దేవుడు కూడా క్షమించడుగాక క్షమించడు
-కూటమి ప్రభుత్వానికి అండగా నిలుద్దాం.. అర్హులందరూ పింఛన్లు పొందుదాం.
గురజాల మాల్యాద్రి,
చైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్