చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జనం నొక్కే బటన్‌తో జగన్‌ ఇంటికే

మాడుగుల రా... కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ధ్వజం

by చైతన్యరధం
Feb 6, 2024 at 9:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జనం నొక్కే బటన్‌తో జగన్‌ ఇంటికే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టికెట్లు ఇస్తామన్నా… వైసీపీలో పోటీకి అభ్యర్థులు లేరు
  • ఎన్నికలకు జగన్‌ సిద్ధం కాదు… సందిగ్ధం
  • బటన్‌ నొక్కుడు సరే.. జగన్‌ బొక్కుడు మాటేమిటి?
  • జగన్‌ బటన్‌ నొక్కడం వల్లే 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి
  • జాబ్‌ కేలండర్‌కు ఎందుకు బటన్‌ నొక్కలేదు?
  • మద్య నిషేధం..సీఎఎస్‌ రద్దు హామీలకు బటన్‌ ఎందుకు నొక్కలేదు?
  • వందలకోట్లు మింగేసిన సలహాదారులు ఇచ్చిన ఒక్క మంచి సలహా చెప్పగలవా?
  • ఆర్థిక రాజధాని విశాఖ నేడు నేరాలకు రాజధానిగా మారింది
  • సీఎం విశాఖ వస్తానంటే.. జనం వద్దు బాబోయ్‌ అంటున్నారు
  • సాక్షి పత్రిక, టీవీలు జగన్‌ అవినీతి పుత్రికలు కాదా?
  • ప్రాంతం ఏదైనా టీడీపీ సభలకు అదే జోష్‌
  • మాడుగుల రా… కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ధ్వజం

మాడుగుల: ఎన్నికలకు సిద్ధం అని జగన్‌ తన సభల్లో అంటున్నారు..కానీ ఓటమి భయంతో పూర్తిగా సందిగ్ధంలో ఉన్నాడు..జగన్‌ టికెట్లు ఇస్తామన్నా పోటీకి అభ్యర్థులు దొరకడం లేదు.. జగన్‌ బటన్‌ నొక్కడం వల్లే 9సార్లు విద్యుత్‌ఛార్జీలు పెరిగాయి.. జాబ్‌ కేలండ ర్‌కు జగన్‌ ఎందుకు బటన్‌ నొక్కలేదో సమాధానం చెప్పాలి.. మద్య నిషేధం.. సీఎఎస్‌ రద్దు హామీలకు బటన్‌ ఎందుకు నొక్కలేదో చెప్పాలి.. వచ్చే ఎన్నికల్లో ఓటుతో ప్రజలు నొక్కే బటన్‌తో జగన్‌రెడ్డి ఇంటికెళ్లడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్ఘా టించారు. అనకాపల్లి జిల్లా, మాడుగుల నియోజక వర్గంలో సోమవారం రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ మాడుగులలోరా… కదలిరా అని పిలుపునిస్తే.. జనం పెద్దఎత్తున తరలి వచ్చారన్నారు. యుద్ధానికి మేము కూడా సిద్ధమంటూ మా ఆడబిడ్డలు కూడా వచ్చారు. యువత ఎటువైపు ఉంటే అటువైపే గెలుపు.

ప్రజాక్షేత్రంలో టీడీపీ-జనసేన గెలిచింది. రానున్న ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించి ప్రజల ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. మాడుగుల సభకు వచ్చిన జనాన్ని చూసి తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది.రానున్న రోజుల్లో నిద్ర కూడా పట్టదు. కేవలం 64 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. రా..కదలిరా అని పిలుపునిస్తే ప్రాంతం ఏదైనా రాష్ట్రవ్యాప్తంగా కార్య కర్తలు, ప్రజల్లో జోరు… స్పీడు ఎక్కడా తగ్గకుండా కని పిస్తోంది. జగన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వంపై ప్రజలు ప్రకటించిన యుద్ధం కనిపిస్తోంది.. ఇది రాను న్న కాలంలో ఉధృతమై తుఫానుగా మారుతుంది… ఈ తుఫానులో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. రానున్న ఎన్నికలు టీడీపీ, జనసేన కోసం కాదు..రాష్ట్ర భవిష్యత్తు కోసం. రానున్న ఎన్నికలు పార్టీలు, అధికా రానికి సంబంధించినవి కాదు… తెలుగుజాతి భవిష్య త్తుకు సంబంధించినవి. రానున్న ఎన్నికలు రాష్ట్రం, ప్రజలు, బిడ్డల భవిష్యత్తు గెలుపు కోసమే.. సైకో పాలనను అంతం చేస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

నేను చేసిన అభివృద్ధితో జగన్‌రెడ్డి ఐదేళ్లు బటన్‌ నొక్కాడు

గెలుపు.. ప్రచండ తుపానే!!

ఓటుతో అరాచక శక్తులపై వేటు

కమీషన్లతో కంపెనీలు పరార్‌
విశాఖలో మిలీనియం టవర్స్‌, హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ కట్టిన ఘనత టీడీపీది. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కంపెనీలను తీసుకొచ్చాం. వాటిలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, లులు, హెచ్‌ఎస్బీసీ, అదాని డేటా సెంటర్‌ వంటివి ఉన్నాయి. ఈ కంపెనీలను జగన్‌ తన కమీషన్ల కక్కుర్తి కోసం తరిమేసి…రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు భూములను దోచిపెట్టాడు. కార్తీకవనం, ఎన్సీసీ భూములు,ప్రేమ సమాజం, బే పార్కు, దస్‌పల్లా భూములు మొత్తాన్ని దోచుకున్నారు. విశాఖ మెట్రోను ఎప్పుడో మేం చేపట్టాం.. దాన్ని జగన్‌ పట్టించుకోలేదు. 2019లో టీడీపీ వచ్చి ఉంటే ఇప్పటికే పూర్తయ్యేది. విశాఖ రైల్వే జోన్‌కు 53ఎకరాలు ఇస్తే జోన్‌ నిర్మాణం పూర్తయ్యి… మన యువతకు వందలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి. దాన్ని జగన్‌రెడ్డి అడ్డుకున్నాడు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడి సాధిస్తే.. దాన్ని ప్రైవేటీకరణ చేసే పరిస్థితి వస్తే జగన్‌రెడ్డి కనీసం ఒక్క మాట మాట్లాడటం లేదు. టీడీపీ పాలనలో ఇలాంటి పరిస్థితి వస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి డబ్బులిచ్చి ముందుకు నడిపించాం తప్ప ప్రైవేటీకరణ కానివ్వలేదు. జగన్‌రెడ్డికి ఉత్త రాంధ్రపై ప్రేమ లేదు… కేవలం దోచుకునేందుకు ఒక బంగారు గనిలా మాత్రమే భావిస్తున్నాడు. గతంలో విశాఖపట్నం ఆర్థికరాజధాని, నాలెడ్జ్‌ హబ్‌గా తయారు చేయాలని మేం ప్రయత్నించాం… జగన్‌రెడ్డి సీఎం అయ్యాక ఉత్తరాంధ్రను

గంజాయికి క్యాపిటల్‌ గా, క్రైం క్యాపిటల్‌ గా మార్చాడు.
పిల్లలు గంజాయికి అలవాటు పడితే.. తల్లిదండ్రుల మాట వినరు.. పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయినట్టే. ఇలాంటి గంజాయి విషయం లో జగన్‌రెడ్డి ఒక్కరోజు కూడా సమీక్ష చేసి నిషేధించే ప్రయత్నం చేయలేదు. చివరకు ఏపీ పోలీసులే గంజా యి అమ్ముతూ హైదరాబాద్‌లో దొరికే సిగ్గుమాలిన పరి స్థితి వచ్చింది. ఇది పోలీసుల తప్పు కాదు… జగన్‌రెడ్డి పోలీసులతో నీచమైన పనులు చేపిస్తున్నాడు. వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులే కిడ్నాప్‌ చేసి… డబ్బులు వసూలు చేశారు. విశాఖ రూరల్‌ ఎమ్మార్వో రమణయ్యను కొంతమంది ఇంట్లోకి వెళ్లి దారుణంగా చంపేశాడు.
విమానాశ్రయం నుండి నింది తుడు దర్జాగా పారిపోయాడు. అసలు రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. హం తకులు ఇళ్లకే వచ్చి ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చింది. మహిళల మాన, ప్రాణాలకు వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయింది. పులివెందుల రౌడీలు విశాఖను కబ్జా చేస్తున్నారు. ముఖ్యమంత్రి బంధువు అనిల్‌రెడ్డి విశాఖలో కబ్జాలకు పాల్పడుతుంటే వైసీపీఎంపీలు సహ కరిస్తూ వారు కూడా దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

ఫ్యానుకు ఉన్న మూడు రెక్కలు విరగ్గొట్టండి
విశాఖ ప్రజలు జగన్‌రెడ్డిని ఈ ప్రాంతానికి రావొ ద్దని చెబుతున్నారు… టీడీపీ పాలనలో అమరావతి ఏపీ రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని అని ప్రజలు ఒప్పు కున్నారు. రాజధానితో మూడు ముక్కలాట ఆడుతూ రాజధాని లేకుండాచేసి జగన్‌ చరిత్ర హీనుడుగా మిగి లాడు. జగన్‌రెడ్డి వస్తున్నాడంటే ఆ ప్రాంతం ప్రజలు భయపడిపోతున్నారు.
రాష్ట్రంలోని 3 ప్రాంతాల ప్రజలు ఫ్యానుకు ఉన్న 3 రెక్కలను ముక్కలుగా విరగొట్టాలి. బాదుడే బాదుడు అనే రెక్కను పీకడానికి కోస్తా ప్రజలు, హింస, దోపిడీ రెక్కను తుక్కుతుక్కు చేయడానికి రాయ లసీమ ప్రజలు, మొండి ఫ్యానును జగన్‌ చేతికి ఇచ్చి జగన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చి, వైసీపీని బంగాళాఖాతంలో విసిరేయడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధం కావాలి. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం కింద రాష్ట్రం లోని బడుగు బలహీనవర్గాల బతుకులు నలిగిపోతున్నా యి. ఉత్తరాంధ్రలో అసలు వైసీపీకి నాయకులు లేరా? ఇక్కడ రెడ్ల పెత్తనం ఏంటో ఆలోచించాలి. టీడీపీ పాల నలో ఉత్తరాంధ్రలో స్థానిక నాయకులే ప్రజల సంక్షేమా న్ని చూసుకున్నారు. అలాంటి పరిస్థితిని మేం అధికా రంలోకి వచ్చాక మళ్లీ తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు.

సలహాదారులిచ్చిన ఒక మంచి సలహా చెప్పు?
జగన్‌ ధనదాహంతో ఉత్తరాంధ్రను ఊడ్చేశాడు. కొండల్ని అనకొండల్లా మింగేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు నీతి నిజాయితీతో ఉంటారు. నాకు ఉత్త రాంధ్ర అంటే అభిమానం. ఇలాంటి ప్రాంతం నేడు హింస, అశాంతి, కబ్జాలకు నెలవుగా మారింది. రుషికొండను అనకొండ లా జగన్‌రెడ్డి మింగేశాడు. రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్‌ కడుతు న్నాడు. కేంద్రం ఇచ్చే డబ్బులు, నరేగా నుండి వచ్చే డబ్బులు తప్ప పేదల ఇళ్లకు జగన్‌ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగ న్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు…కానీ సాక్షి పేపరుకు రూ.1000కోట్లు ప్రకటనలపేరుతో దోచి పెట్టాడు. సలహాదారులు 100 మందికి రూ.700 కోట్లు ఇచ్చాడు. ఒక్క సజ్జలకే రూ.150 కోట్లను జగన్‌ దోచిపెట్టాడు. సలహాదారులు ఇచ్చిన ఒక్క మంచి సలహా చెప్పు? పెట్టుబడులకు విశాఖ స్వర్గ ధామం.. నేడు వైసీపీ పాలనలో కబ్జాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. విశాఖలో రూ.40వేల కోట్లను దోచేశాడు. ఇలాంటి దోపిడీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

బటన్‌ నొక్కుడు మాటున… ఎంత బొక్కావో చెప్పు?
ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను… కానీ జగన్‌రెడ్డి లాంటి సైకోను నేను నా జీవితంలో చూడ లేదు. సైకో గద్దె దిగితేనే రాష్ట్రానికి మోక్షం కలుగుతుంది. జగన్‌రెడ్డి 124సార్లు బటన్‌ నొక్కానని గొప్పగా చెబుతున్నాడు. బటన్‌ నొక్కుడు కాదు..దాని చాటున నీ బొక్కుడు ఎంతో చెప్పు. బటన్‌ నొక్కుడు చాటున ఎంత బొక్కాడో, ఎంత దాచాడో ప్రజలంతా ఆలోచిం చాలి. జగన్‌ బటన్‌ నొక్కడం వల్ల 9సార్లు కరెంటు ఛార్జీలు పెరిగి పేదవాళ్లు నష్టపోయారు. రూ.64 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశాడు. టీడీపీ పాలనలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచ లేదు. జగన్‌ బటన్‌ నొక్కడం వల్ల ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, చెత్త పన్ను, ఆస్తిపన్ను, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరి గాయి. జగన్‌ పాలనలో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల అప్పు పెరిగింది.

జాబ్‌ క్యాలెండర్‌కు ఎందుకు బటన్‌ నొక్కలేదు? 5ఏళ్లలో ఒక్కసారి కూడా జాబ్‌ క్యాలెండర్‌కు బటన్‌ నొక్కలేదు. జగన్‌రెడ్డిది ఉత్తుత్తి బటనే. జాబు రావాలంటే…. బాబు రావాలి. మద్య నిషేధ హామీకి ఎందుకు బటన్‌ నొక్కలేదో మహిళల కు జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. మద్యనిషేధం చేయకపోతే ఓట్లు అడగనని చెప్పి… నేడు ఓట్లు వేయాలని సిగ్గులేకుండా జగన్‌ అడుగుతున్నాడు. సీపీఎస్‌ రద్దుకు ఎందుకు బటన్‌ నొక్కలేదో జగన్‌ ఉద్యోగులకు సమాధానం చెప్పాలి. ఎన్నికలకు ముం దు ఉద్యోగులకు హామీ ఇస్తూ.. వారం లోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని చెప్పాడు… నేటికీ చేయలేదు. జగన్‌ రెడ్డికి చివరివారం దగ్గర్లోనే ఉంది. ఇక ఇంటికే… రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఒక్కసారి కూడా ఎందుకు బటన్‌ నొక్కలేదో రాష్ట్ర ప్రజలకు జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ఎందుకు ఒక్కసారి కూడా బటన్‌ నొక్కలేదు? వైసీపీ పాలనలో రైతు బతుకు చితికి పోయి ంది… రోజుకు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకుంటు న్నారు.

డీఎస్సీ కోసం ఈ ఐదేళ్లలో బటన్‌ నొక్కనే లేదు.. కానీ ఇప్పుడు మెగా డీఎస్సీ అని కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు. మైనింగ్‌, భూగర్భ గనులు, ఇసుక, మద్యంపై దోచుకునేందుకు జగన్‌రెడ్డి బటన్లు నొక్కా డు. ఇసుకపై ప్రతిరోజు సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్‌కు వందల కోట్లు చేరుతున్నాయి. మద్యంలో జగన్‌ సొంత బ్రాండ్లు అమ్ముకుంటూ దోచుకుంటు న్నాడు. ఇప్పటికి జగన్‌ బ్రాండ్లు తాగి 30లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. 30వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జగన్‌రెడ్డి బటన్‌ డ్రామాలు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయి… రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు నొక్కే బటన్‌తో వైసీప ఇంటికి, జగన్‌రెడ్డి జైలు కెళ్లడం ఖాయమని చంద్రబాబు అన్నారు.

బీసీ, ఎస్సీ నేతలపై జగన్‌ అక్రమ కేసులు
జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష నేత లు బాధితులుగా మారారు. అయ్యన్నపాత్రుడుపై నిర్భ య కేసు, బండారు సత్యనారాయణమూర్తిపై అక్రమ కేసులు, వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన గొప్ప నాయకులు వైసీపీ వాళ్లు. సంక్షే మానికి చిరునామా…తెలుగుదేశంపార్టీ. రూ.2కే కేజీ బియ్యం ఇచ్చింది టీడీపీ. బీసీలను అభివృద్ధి చేసిన పార్టీ టీడీపీ.విదేశీవిద్య, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు తెచ్చిన పార్టీ టీడీపీ.
టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఇచ్చిన సంక్షే మాన్ని మించిన సంక్షేమ పథకాలు తెస్తాం. దీంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. అభివృద్ధి జరి గితే సంపద వస్తుంది, ఆదాయం వస్తుంది… ఈ ఆదాయాన్ని పేదలకు పంచితే సంక్షేమం మరింత పెరుగుతుంది. ఇదే టీడీపీ సిద్ధాంతం. సూపర్‌-6 పథకాలలో భాగంగా… యువతకు సంవత్సరానికి 4లక్షల ఉద్యో గాలు ఇస్తాం. 5ఏళ్లలో 20లక్షల

ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు ఇస్తాం. మహిళలకు ఆస్తిలో సమాన హక్కును ఎన్టీఆర్‌, తెలుగు దేశంపార్టీ తీసుకొచ్చింది. డ్వాక్రా, పసుపు, కుంకుమతో ఆర్థికసాయం, ఉద్యోగాలు, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత టీడీపీది. మేం అధికారంలోకి వచ్చాక మహిళలను ఆర్థికంగా ముందుకు తీసు కెళ్లే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తా
ఆడబిడ్డ నిధి ద్వారా 18ఏళ్లు నిండిన ప్రతి మహిళ కు నెలకు రూ.1,500 అందిస్తాం. రాష్ట్రంలో ఎక్కడు న్నా ఇస్తాం. జగన్‌రెడ్డి సంవత్సరానికి ఇచ్చే రూ.18 వేలు కొంత మందికే…మేం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ ఇస్తాం.అమ్మఒడి ప్రతి విద్యార్థికి ఇస్తానని చెప్పి జగన్‌ ఒక్కరికే ఇస్తున్నాడు. మేం అధికారంలోకి వచ్చా క ఇంట్లో ఎంతమంది బడికి వెళ్లే పిల్లలుంటే అంత మందికి సంవత్సరానికి తల్లికివందనం ద్వారా రూ.15 వేలు ఇస్తాం. పిల్లలు మన ఆస్తి, మన భవిష్యత్తుకు నాంది..వాళ్లను అభివృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. దీపం పథకాన్ని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే..మహిళలు కట్టెల పొయ్యితో పడుతున్న ఇబ్బం దులు చూసి ఈ పథకం పెట్టాను. దీన్ని జగన్‌రెడ్డి మూలన పడేశాడు. మేం అధికారంలోకి వచ్చాక పేద వారికి సంవత్సరానికి 3సిలిండర్లు ఉచితంగా అంది స్తాం.

మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఉచితం గా మరుగుదొడ్లు కట్టిన పార్టీ తెలుగుదేశంపార్టీ. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను వంటింటి నుండి సమాజంలోకి తెచ్చి…వారిలో నాయకత్వ లక్షణాలను కూడా పెంచాం. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో వెళ్లే సదుపాయం కల్పిస్తాం. 2.50 కోట్ల ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో ఉన్నారు…కొత్త బిచ్చగాళ్లు వచ్చి మహిళలను ఓట్లు అడుక్కుంటున్నారు. వాళ్లకు ఓటేస్తే మీ పిల్లల చేతుల్లో గంజాయి పెట్టి మీ జీవితాలను నాశనం చేసేస్తారు. మేం అధికారంలోకి వచ్చాక యువతకు వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కల్పిస్తాం. మండల కేంద్రంలో వర్క్‌ స్టేషన్లు పెట్టి తల్లిదండ్రులకు అందుబాటులో యువతను ఉంచుతాం. రక్షిత మంచినీటి పథకం తెచ్చి, ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తాం..ప్రజలకు మంచినీరు ఇవ్వలేని అసమర్థ పాలన జగన్‌ రెడ్డిది. మేము అధికారంలోకి వచ్చాక రైతే రాజు అనేలా చేస్తాం…సంవత్సరానికి రూ.20వేలు ఆర్థికసాయం చేస్తాం…వ్యవసాయంలో ఆధునీకరణ విధానాలు తెచ్చి భవిష్యత్తును బంగారుమయం చేస్తానని అన్నదాతలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు.

దోపిడీయే ధ్యేయంగా వైసీపీ ప్రజాప్రతినిధులు
మాడుగులలో ఓ మంత్రి ఉన్నాడు… బూడి ముత్యా లనాయుడు నియోజకవర్గాన్ని బూడిద చేశాడు. ఒక్క పనికూడా చేయలేదు. టీడీపీ పాలనలో అయ్యన్న పాత్రుడు మంత్రిగా చేసి అనేక పనులు చేశాడు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంలో రూ.100కోట్లు కొట్టేశాడు ఈ బూడిద మంత్రి. బదిలీలు, పదోన్నతుల కోసం విపరీ తంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. సొంత మనుషు లు, బినామీలను పెట్టుకుని కాంట్రాక్టర్లకు పనులివ్వ కుండా రోడ్ల పనులన్నీ నిలిపేశారు. ఇలాంటి వాడు మాడుగులకు అవసరమా? అనకాపల్లిలో మంత్రి దోపిడీలో స్పీడు… పెట్టుబడులేవి అంటే మాత్రం కోడి…గుడ్డు అని చర్చలు పెడుతున్నాడు. దావోస్‌ కు ఎందుకు వెళ్లలేదు అంటే చలి వేస్తోందని చెబుతు న్నాడు. ఇలాంటివాళ్లు ఉత్తరాంధ్ర ప్రజలకు అవస రమా? అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడ్డాడు… నేడు చతికిలపడ్డాడు. అధిష్టానం ఈ కోడిగుడ్డు మంత్రి గెలవలేడనే కాణంతో టిక్కెట్‌ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టింది. ఈ మంత్రికి అసలు సిగ్గుందా? విస్సన్నపేట భూముల్లో 600 ఎకరాలు కబ్జా చేసి, ప్లాట్లు వేసుకుని అమ్మేసుకున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రు ల అభివృద్ధి లేదు..టిడ్కో ఇళ్లు ఇవ్వలేదు..డబ్బులు మాత్రం దోచేస్తున్నాడు. నర్సీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే గణేష్‌ దోపిడీలో ఘనుడు. గణేష్‌ కు నియోజకవర్గంపై శ్రద్ధ లేదు…కేవలం అయ్యన్నను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం, అక్రమ కేసులు పెట్టడంపై మాత్రమే శ్రద్ధ పెడుతున్నాడు. మల్లవరం రిజర్వ్‌ ఫారెస్టులో రంగురాళ్ల దొంగవ్యాపారం ద్వారా రూ.150 కోట్లు కొట్టేశాడు.గబ్బాడ ఇసుక డిపో నుండి 2,300 మెట్రిక్‌ టన్నుల ఇసుకను మాయం చేశాడు.

రెవెన్యూ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఆన్‌లైన్‌ లో పేర్లు తొలగించి… డబ్బులు వసూలు చేస్తున్నాడు. పాయకరావు పేటలో ఓ ఎమ్మెల్యే ఎగిరెగిరిపడ్డాడు.. ఎక్కడ దొరికితే అక్కడ దోచేయాలని చూశాడు..జగన్‌ అతన్ని కూడా పక్కన పడేశాడు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌… బిల్డప్‌లో ఇతను రాజ్‌… తిక్కవారిపాలెం చెరువును ఆక్రమించి చేపల చెరువుగా మార్చాడు… కాలువలు, నీటివనరులను పూడ్చి లే అవుట్‌లు వేశా డు. బినామీలతో సెంటు పట్టాల భూములను ఆక్ర మించాడు. నరవ, జెర్రిపోతులపాలెం, ఇత్తులవారి పాలెం, ముదప గ్రామాల్లో అక్రమంగా క్వారీయింగ్‌ చేస్తున్నాడు.హిందూజా ఫార్మా కంపెనీ నుండి వసూళ్లు విపరీతంగా చేస్తున్నాడు. చోడవరంలో కరణం ధర్మశ్రీ ఉన్నాడు… ఇతను అధర్మశ్రీ. రావికమతం మండలం లో రాబందు కొండను అనకొండలా మింగేశాడు. గ్రానైట్‌, మైనింగ్‌ క్వారీల వద్ద ప్రతినెలా వసూళ్లు చేస్తున్నాడు. మందు గుండు సామాను అమ్ముకోవాల న్నా కమీషన్లు ఇవ్వాల్సిందే. యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు దోపిడీలో రాజు… దోపిడీని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నాడు. అచ్యుతాపురం మండలంలో పూడిమడక, లాలం కోడూరుల్లో 90ఎకరాలు దోచేశా డు. డొప్పెరలో 60 ఎకరాలు కొట్టేశాడు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఇలాంటి వసూల్‌ రాజాలు కావాలా? నిజాయి తీగల నాయకులు కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.

షుగర్‌ ఫ్యాక్టరీలను గాడిలో పెడతాం
తాండవ షుగర్‌ ఫ్యాక్టరీకి మూత వేశారు. తుమ్మపాల, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చి జగన్‌ మూత వేశాడు. మేం అధికారంలోకి వచ్చాక చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీని బాగుచేయడంతో పాటు సమర్థవంతమైన మేనేజ్‌మెంట్‌ ను ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. విశాఖ మన్యంలో లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ దోచుకుంటూ, దాన్ని జగన్‌ రెడ్డి భారతీ సిమెంట్‌ కంపెనీలకు తరలించుకుంటున్నాడు.
ఉత్తరాంధ్రలో పాడైపోయిన రోడ్లను బాగుచేసే బాధ్యత మాది. అభివృద్ధి చేసిన పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, ఆదాయాన్ని సృష్టించి దాన్ని పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ. పేదవాళ్లను ధనికులుగా చేయడానికి పూర్‌ టు రిచ్‌ కార్యక్రమం చేయాలనేది నా ఆకాంక్ష. తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రజాతిగా మార్చాలనేది నా లక్ష్యం. జగన్‌రెడ్డి పాలనలో 30 ఏళ్లు వెనక్కిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మీరు ఒక్క అడుగు ముందుకేయండి నేను వంద అడుగులు ముందుకు వేస్తానని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

సందిగ్ధంలో జగన్‌
జగన్‌రెడ్డి వైనాట్‌ 175అంటున్నాడు… కానీ మేం అంటున్నాం… వై నాట్‌ పులివెందుల అని. జగన్‌రెడ్డికి అభ్యర్థులు దొరకడం లేదు కానీ, సిద్ధం అంటూనే సందిగ్ధంలో పడిపోయాడు. ఎమ్మెల్యేల ను జగన్‌రెడ్డి బదిలీలు చేస్తున్నాడు. ఆరు జాబితాల ద్వారా 85మందిని మార్చాడు. కొంత మంది జగన్‌రెడ్డి ఆదేశాలను చెత్తబుట్టల్లో వేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశా రు. కొంతమంది అందుబాటులో లేకుండా వెళ్లిపో యారు. ఈ బదిలీలతో జగన్‌రెడ్డి పిచ్చి రాజకీయా లు చేస్తున్నాడు. జగన్‌రెడ్డి..ప్రజలిచ్చిన అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయిలా వాడుతున్నాడు. రాష్ట్ర ప్రజల జీవితాలను నాశనం చేసిన జగన్‌ను ఇంటి కి పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలదే.జగన్‌ తనకు ఎవరూ లేరు…పేపర్లు లేవు… ఛానళ్లు లేవు అం టున్నాడు. కానీ సాక్షి ఛానల్‌,పత్రిక జగన్‌ అవినీతి పుత్రికలే కదా?జగన్‌రెడ్డి కలియుగ భస్మాసరుడు… జగన్‌రెడ్డిని అంతంచేయడం ప్రజల బాధ్యత. దీనికి ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు వాడుకోవాలి. జగన్‌రెడ్డిని ఓడిరచడానికి నిరుద్యోగులు, మహిళ లు, రైతులు, పేదవాళ్లు, ఎస్సీ, బీసీ, మైనారిటీలు స్టార్‌ క్యాంపెయినర్లుగా మారాలి. మండుటెండల్ని లెక్కచేయకుండా కదిలివచ్చిన ఉత్తరాంధ్ర ప్రజానీ కాన్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాటిస్తున్నా. నష్టపోయిన రాష్ట్రాన్ని, తెలుగుజాతిని కాపాడుకునేందుకు నేను మీ వద్దకు వచ్చాను…. ఆశీర్వదించాలని చంద్రబాబు అభ్యర్థించారు.

పేదలకు 2 సెంట్ల భూమిలో ఇంటి నిర్మాణం
బీసీలు టీడీపీకి వెన్నుముక లాంటి వారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీసీల రుణం తీర్చు కుంటా. బీసీ సబ్‌ప్లాన్‌తో పాటు.. ప్రత్యేక రక్షణచట్టం తెస్తామని హామీ ఇస్తున్నా. ఏపీలో పెన్షన్లను తెచ్చిన టీడీపీనే. ఎన్టీఆర్‌ హయంలో రూ.35 ఇచ్చారు. దీన్ని నేను సీఎం అయ్యాక రూ.75చేశాను. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వా లన్నీ కలిసి రూ.200చేశాయి. నేను 2014లో సీఎం అయ్యాక ఒక్కసారిగా రూ.1,000కి పెంచాను. తరువాత రూ.1000 నుండి రూ.2వేలకు పెంచాను.జగన్మోహన్‌రెడ్డి పెన్షన్‌ను అంచెలం చెలుగా పెంచానని గొప్పలు చెబుతున్నాడు. మేం అధికారం లోకి వచ్చాక పెన్షన్‌ మీఇంటికే పంపిస్తాం.. పెన్షన్‌ను ఇంకా ఎంత పెంచాలో ఆలో చించి ఆ బాధ్యత మేం తీసుకుంటాం. రూ.5కే పూట భోజనాన్ని అన్న క్యాం టీన్‌ ద్వారా అందించాను.
3నెలలు పెన్షన్‌ తీసుకోక పోయినా ఇచ్చేబాధ్యత తీసుకుంటాం. పేదవాళ్లకు గతంలో 2సెంట్లు భూమి ఇచ్చాం…జగన్‌రెడ్డి ఇచ్చింది కేవలం సెంటు భూమి మాత్రమే. మేం అధికారంలోకి వచ్చాక 2 సెంట్లు భూమి ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం. గతంలో మేం టిడ్కో ఇళ్లు కడితే… జగన్‌రెడ్డి రంగుల పిచ్చో డిలా టిడ్కో ఇళ్లకు రంగులు వేసుకున్నాడు కానీ లబ్ధి దారులకు ఇళ్లు మాత్రం ఇవ్వలేదని చంద్రబాబు తప్పుబట్టారు.

ఉత్తరాంధ్రకు సుజల స్రవంతి కానుకగా ఇస్తా
ఉత్తరాంధ్రకు మాటిస్తున్నా…బంగారం పండిరచే రైతులకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తిచేసి కానుకగా ఇస్తా. 8 లక్షల ఎకరాలకు నీరు, 30 లక్షల మందికి తాగునీటిని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా అందిస్తాం. 2017లో రూ.2దవేల కోట్ల అంచనాతో టెండర్లు పిలిచాం. మేం ఇప్పుడు అధికారంలో ఉండుంటే ఉత్తరాంధ్రలోని చెరువులు అన్నింటిలో పుష్కలంగా నీరు ఉండేది. రైవాడ రిజర్వాయర్‌ ఉంది… దీనికి గోదావరి నీరు ఇచ్చి ఆదుకునే బాధ్యత మాది. దేవరాపల్లి వద్ద రైవాడ రిజర్వాయర్‌ ఆధునీకరణకు రూ.1824 కోట్లు ఇస్తే దాన్ని వైసీపీ నేతలు వచ్చి దోచుకున్నారు. తాచేరు, ఉరకగడ్డ రిజర్వాయర్‌కు రూ.8 కోట్లు ఇస్తే దాన్ని పూర్తిచేయలేదని చంద్రబాబు విమర్శించారు.

Tags: చంద్రబాబుబహిరంగ సభమాడుగుల రా... కదలిరా
Previous Post

ఓటరు తుది జాబితాలోనూ అనేక తప్పులు

Next Post

అర్జునుడు కాదు.. అక్రమార్జనుడు

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం
ఆంధ్రప్రదేశ్

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
చైతన్యరధం ఈ పేపర్ 18-05-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-05-2025

కార్యకర్త
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌
ఆంధ్రప్రదేశ్

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

మహిళలకు శుభవార్త ..ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్ర విద్యార్థి హార్డీకి మాస్టర్‌ స్పెల్లర్‌ అవార్డ్‌

చైతన్యరధం
@ May 18, 2025
ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్‌ భేటీ

చైతన్యరధం
@ May 18, 2025
20 లక్షల ఉద్యోగాలు..హామీ నిలబెట్టుకుంటాం

దేశ క్లీన్‌ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి రెన్యూ!

చైతన్యరధం
@ May 17, 2025
అడుగడుగునా జేజేలు..

ఇబ్బందులు తీర్చి అండగా ఉంటా

చైతన్యరధం
@ May 17, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మహానాడు ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమీక్ష

చైతన్యరధం
@ May 18, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయం

మన త్రివిధ దళాలకు శిరసాభివందనం

చైతన్యరధం
@ May 18, 2025
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చైతన్యరధం
@ May 18, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

బల్లెం వీరుడి ప్రదర్శన భేష్‌ 

చైతన్యరధం
@ May 18, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist