పొన్నూరు(చైతన్యరథం): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జగన్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేయకుండా అవమానించారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఆగస్టు 15న జెండా ఎగురవేయని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షునిగా ఆయన నిలిచిపోయాడు. జెండా ఎగురవేయకపోవడం దేశాన్ని, స్వాతం త్యం కోసం పారాడిన వారిని, జాతీయ జెండాను అవమానిం చడమే. పులివెందుల ఓటమి తెచ్చిన తీవ్ర ఫ్రస్టేషన్ అందుకు కారణం కావచ్చు. బయటకు వచ్చి జాతీయ జెండా ఆవిష్కరిం చలేని స్థితిలో జగన్ ఉండడం అతని మానసిక స్థితికి అద్దంపడు తుందన్నారు. రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు వంటి కష్టజీవులు కూడా కూడళ్లలో జాతీయ పండుగ జరుపుకుని దేశభక్తిని చాటు కుంటారు. కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ జాతీయ జెండా ఆవిష్కరణకు రాకపోవడం విచారకరమని పేర్కొన్నారు.